పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/380

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కును ఏర్పడి యుండవచ్చును. కాని రాజ్య మను సంస్థ మానవుని ఉత్కృష్ట ఆశయములకొరకు ఏర్పడినది. ఉత్కృష్ట ఆశయములు, వాక్ఛక్తి—ఇవియే మానవుని జంతుజాలమునుండి ప్రత్యేకించునవి. ఇవి మానవునకు స్వాభావికములు. కనుక రాజ్యముకూడ మానవునకు స్వాభావిక మైనది. రాజ్యము లేకున్న మానవునకు వా వాస్త వముగ నైతిక జీవన మసంభవము. రాజనీతి సకలశాస్త్ర ములకును మూలము. నైతిక ఆదర్శములు రాజనీతి యందలి భాగములు. మానవులందు కొందరు బలవంతులు, ఇతరులు దుర్బ లులు; కొందరు ధీమంతులు, ఇతరులు జడులు కనుక బలవంతులును, ధీమంతులును యజమానులుగ నుండు టయు, దుర్బలులు, జడులు సేవకులుగ నుండుటయు సహజమును, న్యాయమును. అల్పకార్యములను సేవ కులు నెరవేర్పకున్న యజమానులకు ఉత్కృష్టజీవనము కాని, రాజ్యమునకు శ్రేయము కాని చేకూరవు. రాజ్య వ్యవహారములందు పాల్గొను పౌరులు అల్పవ్యవహారముల యందు నిమగ్నులగుట రాజ్యమునకు నష్టము. పాలిటికు అను గ్రంథమునందు అరిస్టాటిల్ ప్లేటో యొక్క ముఖ్యాభిప్రాయములను తీవ్రముగ విమర్శించి యున్నాడు. రాజ్యైక్యము రిపబ్లిక్ లోని ముఖ్యాంశము. సామూహిక జీవన మిందులకు ముఖ్యమార్గము. రాజ్యై క్యము ముఖ్యమైనదేకాని వ్యక్తి ప్రత్యేకతయును ముఖ్యముకదా యని అరిస్టాటిల్ వాదించెను. వ్యక్తులను సంపూర్ణముగ రూపుమాపి ఐక్యమును సాధించునట్టి రాజ్యమునకు విలువ యుండునా? అంతియ కాదు. ప్లేటో సూచించినట్టి సామూహిక జీవనపద్ధతి సాధ్యము కానిది. సంసారము, ఆస్తి, స్వామ్యము అను వాటి యందు మానవులకు ఆసక్తి నశించుననుటకూడ అసంభ వము. పౌరుల సమాజము రాజ్యమనియు, రాజ్యమును నిర్వ హించు పౌరవర్గము ప్రభుత్వమనియు అరిస్టాటిల్ నిర్వ చించి రాజ్యమునకును, ప్రభుత్వమునకును గల వ్యత్యాస మును స్పష్టపరచెను. రాజ్యభారమును వహించుటయు, ప్రభుత్వమునకు లోబడి ప్రవర్తించుటయు పౌరుని ముఖ్య లక్షణము లని, అతని అభిప్రాయము. ప్రభుత్వమునకు 319 అరిస్టాటిల్ సంబంధించిన సమస్యల నతడు అతి సూక్ష్మముగ విమ ర్శించి, ఆదర్శ రాజ్య రచనయందు ముఖ్యముగ గమ నింపవలసిన విషయములను విపులముగ పేర్కొనెను. పరిస్థితులు కన్వయింపని ఆదర్శములు నిరర్ధకములు. అంతియకాక అరిస్టాటిల్ రాజ్యముల చరిత్రను, ఆకృతిని చక్కగ పరిశీలించెను. కనుక రాజ్యములను వర్గములుగ విభజించుట కనుకూలమైన మార్గములను, ప్రమాణము లను కూడ అతడు సూచించి యున్నాడు.. ఇక రాజ్యములయందు సంభవించుచుండు మార్పులు క్రాంతులు మరియొక ముఖ్యమైన సమస్య. ఈ సమస్యను కూడ అరిస్టాటిల్ సంపూర్ణముగ పరిశోధించి వీనిని నివా రించు మార్గమును వర్ణించి యున్నాడు. ప్రజలయందు సమత్వ వాంఛయే వీటికి కారణము. ఆర్థిక విభజన మందును, అధికార విభజనమందును, న్యాయదృష్టి యే రాజ్యముల అంతఃకలహముల నివారణకు పరమౌషధము. నానావిధములయిన రాజ్యముల లక్షణములను సమన్వ యించునట్టి రాజ్యమే సుస్థిరముగ నుండగలదని అరి స్టాటిల్ మతము. జి. ఎన్. యస్. ఈ అరిస్టాటిల్ (4. సాహిత్య శాస్త్రము) :- తక్కిన శాస్త్రములం దెంత ప్రామాణికముగా తన రచనలను సాగించెనో సాహిత్య శాస్త్రమునందును అంత ప్రామాణి కముగా అరిస్టాటిల్ తన రచనను సాగించెను. శాస్త్రమునందు నేటికి మనకు నిలిచినవి అతని రచనలలో రెండు మాత్రమే. (1) పొయెటిక్స్ (Poetics); (2) రిటారిక్ (Rhetoric), మొదటి రచన ప్రధానముగా దుఃఖాంత నాటకములకు లక్షణ గ్రంథము ; కాని, ఆను షంగికముగా మహాకావ్య, సుఖాంత నాట కాదులకుగూడ లక్షణములు చెప్పబడినవి. రెండవ రచన 'ఉపన్యాస' విధానమునకు, భాషా వై చిత్ర్యములకు లక్షణగ్రంథము. అరిస్టాటిల్ కు పూర్వము సాహిత్య చర్చను సోక్రటీస్, ప్లేటో మొదలగువారు చేసినారు. కాని ఒక క్రమపద్ధతిలో ప్రణాళికానిబద్ధముచేసి శాస్త్రీయముగా చర్చించిన ప్రథమ గౌరవము అరిస్టాటిల్ కే దక్కును. కొన్ని సందర్భములం దీతడు తన గురువైన ప్లేటో అభిప్రాయములకు అతనిని పేర్కొనకయే మార్పులను గూడ సూచించియున్నాడు.