పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/378

ఈ పుటను అచ్చుదిద్దలేదు

లకు గురికావలెనని ఈతని మతము, వారెంత యేడ్చిన వయస్సు వరకును నంత యారోగ్యకరము. 5 సం. కథలు, ఆటలు, సత్సహవాసము, వినోదములకు తగిన యవకాశము అవసరము. అవినీతికర శిల్పములు దేవ ళములందు తప్ప నింకెక్కడ నుండరాదు. తప్పుచేసిన బాలురను బహిరంగముగా శిక్షించవలెను. 5 సం. నుండి 7 సం. వయస్సుగల బాలబాలికలు వారు ముందు చేర బోవు పాఠశాలలను సందర్శించుచుండవలెను. 7 సం. నుండి 21 సం. వరకు దీనియందు రెండు అంతర్దశల నేర్పరచెను, యౌవన పూర్వదశ, యౌవనపర దశ. ఈ 14 సంవత్సరముల కాలములో చదువుట, వ్రాయుట వ్యాయామమును, గానమును, చిత్ర లేఖనమును, నాటక కథను బోధించుటవలన ఉద్రేకము లకు తగిన శిక్షణ నొసంగవలెను. చిత్రలేఖనమును జీవనో పాధికి మాత్రమే యుద్దేశింపక, ఆనందోత్పాదనమునకును వ్యాయామమును పశుబలు సంపాదనమునకుగాక దేహ సౌష్ఠవమునకును ఆరోగ్యమునకును అవసరము. యౌవన మునకు పూర్వము తేలిక వ్యాయామమును, తరువాత ఆహార నియమములతోగూడిన కఠినమగు కసరత్తులను ఆదేశించెను. గానము ఆత్మకు తగిన కసరత్తు; అది విశ్రాం తీని సంస్కారయుతముగా గడపుటకు ఉపకరించును. గానమువలన సుఖదుఃఖముల యెడ సమభావము కలు గును. దేహమునకు ఔషధ మెట్టిదో, ఆత్మకు గాన మట్టిది. చిత్ర లేఖనముకంటిద్వారా దేహము పై మాత్రము ప్రభావము కల్గింపగా, గానము చెవిద్వారా యాత్మపై ప్రసరించును. చిత్రలేఖనముకన్న గానము ఉన్నతకళ. కనుక బాలబాలికలకు ప్రారంభమునందు చిత్రలేఖనము కన్న గానమే లాభదాయకము. వారికి నీతిదాయకము లగు గీతములనే బోధింపదగును, ఈతడు విద్యా విషయములను, ప్రయోగాత్మకములు, సృజనాత్మకములు, జ్ఞానాత్మకములని మూడు తరగతు లుగా విభజించెను. మొదటిదానియందు నాట్యము, పరుగెత్తుట, దుముకుట, కసరత్తు చేయుట, కుస్తీ పట్టుట, కవాతు, స్వారి చేయుట, గురిజూచుట, బల్లెములను, చక్రములను విసరుట గలవు. రెండవదానియందు గానము చిత్రలేఖనము గలవు. మూడవదియగు జ్ఞానాత్మకము అరిస్టాటిల్ నందు వ్యాకరణము, తర్క, మీమాంసలు, సారస్వతము, గణితము, ఖగోళశాస్త్రములు గలవు. 21 సంవత్సరముల వయస్సు పిమ్మట దశః శరీర సౌఖ్యమునకు ఆరోగ్య మవసరమైనట్లు, మానసిక సౌఖ్యమునకు సన్మానసికత్వము ఆవశ్యకము. ఈ దళ యందు యువకులు ప్రత్యక్షముగా చట్ట నిర్మాణ, నిర్వా హక కార్యములందు పాల్గొనుచు శిక్షణము బొంద వలయును. వారు సరిహద్దులపై కొంతకాలము సేవ చేయుట అవసరము, అటుపిమ్మట ఆధ్యాత్మికాభిరుచిగల వారిని మతబోధనకార్యములలోనికి తీసికొనవచ్చును. 317 అరిస్టాటిల్ చెప్పిన యీ విద్యా ప్రణాళికయంతయు స్వతంత్ర పౌరులకై యుద్దేశించబడినదే. ఆనాటి బానిస ప్రజల కొరకుగాదు. తన గురువర్యుడగు ప్లేటో యథి మతమునకు భిన్నముగా నీతడు స్త్రీలకు ఉన్నత విద్య యనవసరమని తెలిపెను. ఇతని గ్రంథ మిచ్చట అకస్మా త్తుగా నిలచిపోయినది. కనుక ఉన్నతవిద్యా ప్రణాళిక యందలి వివరములు లేవు. ఈతని ప్రభావము : ఆనాటి గ్రీసునందు అరిస్టాటిల్ ప్రభావ మంతగా కాన రాదు. ఈతని అనుయాయులు కొన్ని గ్రంథ భాగములపై విమర్శనలను, టీకాలను వ్రాయుటకన్న ఇం కేమియు జేయరైరి. క్రీ.పూ. 287 లో నీతని గ్రంథములు ఆసియా మైనరుకు గొంపోబడినవి. అచట నివి రెండు శతాబ్దముల కాలము ఉపయోగ రహితముగ . పిమ్మట ఆ గ్రంథములు అలెగ్జాండ్రియా కును, రోమునకును చేరినవి. అరబ్బీ భాషాంతరీకరణ ముల వలన బాగ్దాదులోను, వారి సామ్రాజ్య విస్తరణచే స్పెయిను నందును ఈతని రచనలు జ్ఞానము వ్యాప్తి చెందేను. మధ్య యుగములందు అన్ని పాఠశాలల యందును ఈతని రచనలే ప్రధాన పాఠ్య గ్రంథములుగా. నుండెను. 15 వ శతాబ్దము నందలి “రినై సాన్సు” అన బడు పూర్వ విద్యా పునరుద్ధరణము వరకును అరిస్టాటిలు పూర్వ విద్యావేత్తలందరిలో ప్రాధాన్యము వహించెను. నేటికిని సర్వశాస్త్రములందును అరిస్టాటిల్ చూపిన శాస్త్రీయ పరిశోధన మార్గము, హేతువాద విధానము అనునవే యనుసరింపబడుచున్నవని చెప్పక తప్పదు.. F సో. రా.