పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/377

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆరిస్టాటిల్ వాటినిగూర్చి కొద్దిమంది విద్యార్ధులకు ఉపన్యసించుటయు మధ్యాహ్నము సామాన్య విషయములపై ప్రజాబాహు శ్యమునకు ఉపన్యసించుటయు చేయుచుండెను. రెండవ సారి ఏథెన్సు చేరినతరువాత పిథియస్ చనిపోయెను. తరువాత అతడు హెర్పిలిస్ ను వివాహమాడెను. వారికి 'నికోమాకస్' అను కుమారుడు కలిగెను. ఈతడు మేసిడోనియానుండి వచ్చినవాడగుట చేత “ఏథెన్సు” నగరవాసు లీతనిని ద్వేషించుచుండిరి. కాని అలెగ్జాండరు జీవిత కాలమున నీతని కెట్టిహానియు సలుప జాలరయిరి. తూర్పు దండయాత్రలనుండి వచ్చుచు అలె గ్జాండరు క్రీ. పూ. 823 లో మరణించినట్లు తెలియగానే అసూయాపరు లీతని పై నా స్తికుడను నిందమోపిరి. ఏథెన్సు నగరవాసులకు సోక్రటీసు హత్యాపాపముతో పాటు ఇంకొక పాపకార్యాచరణమున కవకాశ మీయరాదని ఈతడే ఏథెన్సును వీడి "కాల్చిస్" అను ఊరు చేరెను. కొంతకాలము ఉద రరోగముతో బాధపడి క్రీ. పూ. 322 లో దేహము చాలించెను. పిదప నీతని అస్తికలను జన్మస్థాన మగు “స్టాజిరా"కు తీసికొనిపోయి, చిరస్మరణీయముగా నొక సమాధియందు నిక్షేపించి, ప్రజలు తమ భక్తి శ్రద్ధ అను చాటుకొనిరి. అరిస్టాటిల్ బట్టతలను, పల్చని పాదములను, చిన్న కనులను కలిగియుండెడివాడని చెప్పబడుచున్నది. ఆశ డెల్లప్పుడును ఆకర్షణీయమైన దుస్తులను ధరించెడివాడట. బంధువులకు బానిసలకు తన యాన్తి చెందవలెనని అరి స్టాటిల్ మరణశాసనమునుగూడ వ్రాసెను. రచనలు : తండ్రి వైద్యుడగుటచేత ఇతనికి భౌతిక, జంతు, జీవశాస్త్రములందు సహజాభిమానము కలదు. అకాడమీయందున్నప్పుడు జంతుశాస్త్రమును గూర్చి నూత నములగు పరిశోధనములు కావించెను. తత్త్వశాస్త్రము నభ్యసించేను. అలెగ్జాండరునకు గురువుగానున్నప్పుడు రాజకీయశాస్త్రమునందును, సాహిత్యశాస్త్రమునందును విశేషముగా కృషి సాగించెను. ఇంక రెండవసారి ఏథెన్సు నందున్న కాలమున (క్రీ. పూ. 885-828) ఇతడు తన ముఖ్యరచనలు గావించెను. తర్క శాస్త్రము, తత్త్వ శాస్త్రము, నీతిశాస్త్రము, రాజకీయశాస్త్రము, సాహిత్య శాస్త్రము, జంతు భౌతిక శాస్త్రములు మున్నగు వాటి 316 యందు నేటికిని ఈతని గ్రంథములే అగ్రస్థాన మలంక రించుచున్నవి. పెక్కు శాస్త్రములకు పేరును, రూప మును కల్పించి నేడు మన వాడుకలో నున్న పెక్కు పారిభాషిక పదములను సృష్టించినవాడు ఈ "విజ్ఞాన శాస్త్ర జనకుడే" అనదగును. ఈతడు రచించిన "ఆర్గనమ్” అను గ్రంథమును మించి, ప్రయోగ తర్క శాస్త్రము నేటి కిని పురోగమించ లేదు. ప్రతిస్థాపన తర్కశాస్త్రమును గూడ నీతడు సమగ్రముగా రచించి యుండవ లెననుటకు ఆధారములు గలవు. కాని మానవజాతి దురదృష్టమువలన గ్రంథ మెటులో నశించినది. ఆశాస్త్రభాగమును మరల బేకను మహాశయుడు మనకు ప్రసాదించినాడు. వ్యక్తి, సంఘము, ప్రభుత్వము అను వాటి యొక్క పరస్పర బాధ్యతలను హక్కులను గురించి తన సిద్ధాంతములను, “నీతిశాస్త్రము” “రాజకీయశాస్త్రము" అను గ్రంథము లందు ఇతడు స్పష్టపరచెను. ఈతని “నీతిశాస్త్రము”నందు మానవుని మంచి లేక సుఖమును గురించిన చర్చయు, “రాజకీయశాస్త్రము" నందు దీనిని సాధించు విధానములు సుగలవు. మధ్యయుగములం దీమహామహుని గ్రంథములు తక్క తక్కినవన్నియును మూలబడినవని చెప్పవచ్చును. విద్యా విధానము : ఈతడు ప్రాచీన విద్యావేత్తలయం దగ్రగణ్యుడు. విద్యావిధానమును శిశుగకనుండి విశ్వ విద్యాలయ దశవరకు చాలా వివరముగ నిర్ణయించెను. నేటి మన యభివృద్ధి సూచకములయిన ఆరు పాఠశాలలు గూడ ఇతని యాదర్శమునకు వెనుక బడినవే యగును. ప్రాథమిక విద్య : శిశువు యొక్క తలిదండ్రుల వివా హమునకు ముందునుండియు ఈతని ప్రణాళిక మొద లగును. ఆరోగ్యమును, బలమునుగల యువతీయువకు లే వివాహమునకును, జాతిని వర్థిల జేయుటకును అర్హులు. స్త్రీకి 18 సం. లును, పురుషునకు 37 సం. లును, వివాహమునకు యుక్తవయస్సు. గర్భీణియగు యువతికి అఘుపరిశ్రమయు, లఘ్యాహారమును తగును. ఆకా మున దేవతా దర్శనమును, పూజలును అవసరము. ఒక్కొక్క మిధునమునకు సంతానపరిమితిని ప్రభుత్వము నిర్ణయించవలెను. అనారోగ్యవంతులగు శిశువులను అంత మొందింపవలయునను నాటి యాచారము నీతడు సమ ర్థించెను. దేహదార్థ్యమునకై శిశువులు శీతవాశాతపము