పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/376

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎందరో భక్తులు ప్రతిదినమును వచ్చి సూర్యదర్శనము చేసికొని, తీర్థప్రసాదము లారగించిపోవుదురు. ఈ ప్రదేశ మున మూడు చెరువులు గలవు. ప్రస్తుతము దేవాలయ మునకు తూర్పుగా నొక పెద్ద కొలను గలదు. దీనిని సూర్య పుష్కరిణి యందురు. ఇందే స్నాన మాచరించి తైర్థికులు దేవదర్శన మొనరించెదరు. తైర్థికుల సౌకర్యము కొరకు ఉదారులు నిర్మించిన సత్రములు కలవు. ప్రత్యాది వారము పర్వదినము . మాఘమాసము సూర్యప్రీతి కరమయిన మాసము. రథసప్తమి సూర్యదేవుని పర్వదిన ములలో శ్రేష్ఠమైనది. దేవాలయమున నమక చమక సౌర త్రిచలతో సూర్య నమస్కారములు ప్రతిదినము జరుగును, ఇందు అర్చకులు సంప్రదాయబద్ధులు. అర్చనా విధాన మున ఆరితేరినవారు, పరిశుద్ధులు నగుట ప్రశంసాపాత్ర మైనది. అరసవెల్లిలోని సూర్యభగవానుని సందర్శించి హర్షము వెల్లువలు కాక యరిగిన వారు లేరు. ది. రా. అరిస్టాటిల్ (384 - 322 క్రీ. పూ.) (విద్యా విషయము):- జీవిత సంగ్రహము:- ప్రాచీన గ్రీకు విజ్ఞానమునకు మూలపురుషులు మువ్వురు. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్. ఇదియొక అసాధారణ గురు శిష్య వరంపర. వీరిలో చివరివాడగు అరిస్టాటిల్ ప్రపంచ చరిత్ర యందు మొదటి మేటి శాస్త్రవేత్తయనియు, విజ్ఞానమును వ్యవస్థీకరించి శాస్త్రరూపము నిచ్చుటలో నద్వితీయు డనియు నెంచబడుచున్నాడు. ఈతని జీవితమునందు మూడు విస్పష్ట దశలు గమనింపదగును. ఈ దళలలో ఈతని మానసికాభివృద్ధియందుగూడ అంతరములు కని పించును. ప్రథమదశ :- (క్రీ. పూ. 384 నుండి 847 వరకు) మేసిడోనియా సరిహద్దులపైనున్న థేసు రాష్ట్రము నందలి "స్టాజిరా" యను నూర క్రీ. పూ. 884 లో అరిస్టాటిల్ జన్మించెను. ఈతని తండ్రియగు "నికోమాకస్" మేసిడోనియారాజగు "అమిస్టాను”నకు ఆస్థాన వైద్యుడు గను, ఆ ప్తమిత్రుడుగను ఉండెను. ఈతని తల్లి పేరు "ఫేస్టిమ". బాల్యముననే తలిదండ్రులను కోల్పోయి నందున నీతినిని, బంధువగు "ప్రోక్సినన్" పెంచి పెద్ద 315 అరిస్టాటిల్ వానిని జేసి, విద్యాబుద్ధులు చెప్పించెను. 17వ యేట ఏథెన్సు నగరములో ప్లేటో యొక్క పాఠశాలను (ఎకా డమీ) ప్రవేశించి, 61 సంవత్సరముల వయస్సుగల గురువు పాదముల యొద్ద సక లవిద్యల నభ్యసించెను. తుద కాపాఠశాలయందే సహా యో ధ్యా యుడయ్యెను. కళ లు, శాస్త్రములు, రాజకీయ,త త్త్వశా ము లు మత గ్రంథములు మొద లగునవన్నియుపఠిం చెను. క్రీ.పూ 47సం. న ప్లేటో కాలధర్మము నొందుటచే అరిస్టాటిల్ శాలను వీడెను. అరిస్టాటిల్ ఆ పాఠ ఈతని ద్వితీయదశ :- అటనుండి “జనోక్రేట్స్" అను ముఖ్య సహచరునితో గలిసి “ఏసస్" నగరమును జేరి, అందు పాఠశాల నొకదానిని నెలకొల్పెను. ఎకాడమీలో తన సహపాఠియగు "హెర్మియస్" యొక్క మేనకోడలు “పిథియస్" అను నామెను వివాహమాడెను. సహాయమువలననే ఆరిస్టాటిల్ మేసిడోనియా రాజగు “ఫిలిప్” కుమారుడయిన “అలెగ్జాండరునకు పెల్లా నగర మందు దేశికఁడయ్యెను. క్రీ. పూ. 885 వరకు ఈ పదవి నత్యంత సమర్థతతో నిర్వహించెను. ప్రపంచచరిత్రయందు ఇట్టిమహాప్రజ్ఞావంతులగు గురుశిష్యులు కానరారు. సహ పాఠియును, బంధువునకు హెర్మియసన్ను పర్షియనులు చంపిరను క్రోధమున నీతడు అలెగ్జాండరును తూర్పు దేశ ములపై దాడికై పురికొల్పెనని సందేహింపవచ్చును. క్రీ. పూ. 385 అలెగ్జాండరు సింహాసన మధిష్ఠింపగ నే ఈతడు మరల ఏథెన్సు నగరమును చేరెను. తృతీయదశ :- ఇప్పటినుండి ఏథెన్సునందలి సామాన్య పాఠశాల యగు "లై సియం" నందు అరిస్టాటిలు ఉపా ధ్యాయుడయ్యెను. ఈ కాలమం గీతడు ఉదయమున వ్యాయామము, ఉన్నత శాస్త్ర విషయములు మొదలగు