పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/374

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గలడు. మానవజాతి యందు విజ్ఞానమయసత్త యొక్క అవతరణమునకు మార్గము నేర్పరుపగలడు. అమృతత్వము ; ఇదియే దివ్యత్వము; ఇదియే ముక్త త్వము, ఇదియే మానవుడు సాధింపవలసిన లక్ష్యముగా శ్రీ అరవిందునిచే నిరూపింపబడినది. ఆరవిందుని యోగము : శ్రీశ్రీ అరవిందుని యోగ సాధనయు ఈ లక్ష్యము కలదగుటచేతనే పూర్వ మార్గ ములకంటె విశిష్టమగుచున్నది. సత్త యొక్క అపరార్థము నందు మనః ప్రాణ శరీరములును, పరార్థమున విజ్ఞాన సచ్చిదానందములును కాననగును. మనుష్యుడు విజ్ఞాన భూమిక కారోహించి, తన మనోమయ సత్తను విజ్ఞాన మయ సత్తగా పరిణమింప జేయగలడు. అపుడు తన వ్యష్టి చేతనతోపాటు విశ్వచేతన తోడను విశ్వాతీతత్వము తోడను యుగపత్సంబంధమున నిలువగలడు. విజ్ఞాన భూమిక యందలి జ్యోతిళ్ళక్తులను క్రింది మూడు భూమికలలోనికి అవతరింపజేసి అచట వాటిని నెలకొల్పగలడు. ఈవిధ మున వాటి స్వభావమును, శరీరము యొక్క భౌతిక ధర్మమును గూడ సంపూర్ణముగా మార్చివేయగలడు. మనుష్యు డపుడు దివ్యుడై మానుష్యక మునందు దివ్యత్వ ప్రతిష్ఠాప నమునకు కేంద్రమై, దివ్యకర్మల నాచరింపగలడు. ఇదియే శ్రీ అరవిందుని విజ్ఞానయోగము. (శ్రీశ్రీ అరవిందుడు పూర్వమార్గముల ప్రత్యేక లక్ష్యము లను గూర్చియు, సాధనలను గూర్చియు వివరించి, వాటి నుండి ఏయే సాధనల నేదృష్టితో స్వీకరింపదగునో తనపూర్ణ యోగమున దెలిపియున్నాడు. చిత్తమందు శాంతిని నెల కొల్పుటకై రాజయోగమును స్వల్పముగా నవలంబించి అటుపై కర్మ, జ్ఞాన, భక్తి మార్గములను చక్కని సంయోజనము నందు భగవద్గీత సమీకరించినది. కాని ఇందలి ఏదో ఒక మార్గము యొక్క ఉత్తమత్వమును, మిగిలినవాని యొక్క అవరత్వమును స్థాపింపబూనుకొనిన మతాఖిని వేళములచే ఈమూడు మార్గములును తిరిగి విడిచి వేయబడినవి. భగవద్గీత చే ఉద్దేశింపబడిన సంయోజనము మరల శ్రీ అరవిందుల యోగమునందు ఉద్ధరింపబడినది. ఆత్మ సమర్పణము అన్ని యోగములకును ప్రథమమును, అంత్యమును అగు సోపానము; యోగశక్తి నావాహింప నేర్చుటకు పూర్వావశ్యకమైన స్థితి చిత్తస్థిర శాంతియై 40 313 అరవిందుడు యున్నది. ఇది సాధింపబడిన పిమ్మట యోగము తనను తానే నడుపుకొని ముందునకు బోవుననవచ్చును. "యోగో యోగస్య ప్రవర్తక". నిర్యాణము : శ్రీ అరవింద యోగీంద్రులు 1950 డిసెంబరు 4 రాత్రి 1-30 గంటల సమయము న -12-1950 మంగళవారము) మహాసమాధి ప్రవిష్టు లయిరి. పరాసు దేశీయురాలును శ్రీ అరవిందాశ్రమ మున కధిష్ఠాత్రియునగు మాత శ్రీ గురుదేవుని నిర్యా ణమును గూర్చి ఇట్లు చెప్పెను :- "శ్రీ అరవిందుడు తన శరీరమును విడిచి పెట్టుటలో మహనీయమగు స్వార్థ త్యాగమును ప్రదర్శించెను. సాముదాయకమగు అనుభవ సిద్ధికాలమును త్వరపరచుటకుగాను ఆయన తన శరీర ములో పొందిన అనుభవ సిద్ధిని పరిత్యాగముచేసెను. " శ్రీ అరవిందుల నిర్యాణ విధానము సామాన్య మాన వ దుర్లభముగనుండి అద్భుతము గొల్పెను. అతని భౌతిక శరీరము ఎట్టి వికారములకు లోనుగాకుండా ప్రశాంత ముగా నుండి, దివ్యకాంతిని వెదజల్లుచుండెను. ఇట్టి పరి స్థితి 78 గంటలవరకును ఉండెను. మృతకాయ మిట్లు జ్యోతిఃప్లుతముగా ఇంత దీర్ఘకాలము నిత్య నూతనముగా కనిపించుట అద్భుత విషయముగదా! ఆయన మూర్తి శయ్యపై నిద్రపోవుచున్నట్లుగానో, సమాధిలో నున్నట్లుగానో కనబడుచుండెను. ఎటువంటి వికారము లను చెందని ఆయన శరీరమునుండి హంస లేచిపోయినదో లేదో తెలియరాని పరిస్థితి యేర్పడెను. మహా పుదుచ్చేరిలోని ఫ్రెంచి ప్రభుత్వ శాసనముల ప్రకా రము ఏ మృతక ళేబరము 47 గంటలకు మించి ఆవాస స్థలములో నుండగూడదు. పుదుచ్చేరి ప్రధాన వైద్యాధి కారి 8-12-1950 నాడు వచ్చి శ్రీ అరవిందులను పరీ క్షించి విభ్రాంతుడయ్యెను. అరవిందయోగి భౌతికావ శేషాలకు ఎప్పుడు ఎట్లు అంత్యక్రియలు జరుపవలె నను విషయములో ఆశ్రమమున పరిపూర్ణ మౌనము అవలం లింపబడెను. వాతావరణము పవిత్రముగా నుండెను. శ్రీ అరవిందులవారు భారత దేశానికిచెందిన మహావ్యక్తి అగుటచే భారత పార్లమెంటులో అరవిందుని యెడ గౌరవసూచకముగా ఒక నిమిషము సభ్యులందరు లేచి మౌన ప్రార్థనలు గావించిరి. లోక సభాసభ్యులు కాని