పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/373

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరవిందుడు నాత్మయై యందే చూచుచున్నాడు. సర్వమునకును తా తాను సర్వమును అగుచున్నాడు. సర్వాత్మభావమును లేక సర్వభావాపత్తిని చేరుచున్నాడు. మరియు ఈ ఆత్మయే బ్రహ్మము (అయ మాత్మా బ్రహ్మ). మనుజుడు తన యాత్మను సమగ్రముగా నెరిగినవాడై, బ్రహ్మమును తెలిసికొనుచున్నాడు; బ్రహ్మమే యగుచున్నా డు. (సయోహవై పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి). పర బ్రహ్మము నెరుగుటయన, బ్రహ్మమును తనయందును విశ్వ మందును తెలిసికొనుటయేగాక అద్దానిని విశ్వాతీత మైన దానినిగా తెలిసికొనుట (పాదోఒన్య విశ్వాభూతాని త్రిపాదస్యా ఒమృతం దివి). ఆ బ్రహ్మము అచింత్యము, అవ్యపదేశ్యము, ఏ కాత్మప్రత్యయ సారము, ప్రపంచోప శమము, శాంతము, శివము, అద్వైతము అని తెలియ నగును. ' ఈ భూమిపై మనకు గోచరించు భౌతిక ప్రాణ మనో ధాతువులు మూడు. పరిణామ క్రమమున ఇచట యోగ్య మైన భౌతికాధారము నిష్పన్నమై అందు ప్రాణము వెలువడుచున్నది. యోగ్యమైన ప్రాణాధారము వెలు వడిన పిమ్మట అందు మనోధాతువు వ్యక్తమగుచున్నది. ఆవిర్భావమున పూర్వావశ్యకమైన స్థితి అంతర్హితముగా నున్నది. భౌతిక ధాతువునందు ప్రాణ మనో ధాతువులు అంతర్హితములై యున్న కారణముచేతనే పరిణామ క్రమమున వాటి ఆవిర్భావము సాధ్యపడుచున్నది. శ్రీ అరవిందులచే ఈ ధాతువు అచేతనమైన జడముగా గాక అంతర్నిమగ్నమైన చేతన కలదిగా గ్రహింపబడుచున్నది. శ్రీ అరవిందుల ఈ పరిణామదృష్టికి పాశ్చాత్య విజ్ఞానముల అనురోధమున్నను లేకపోయినను, ప్రాచీన ఋషి జ్ఞానము యొక్క అవలంబము సంపూర్ణముగా కలదు. "తపసా చీయతే బ్రహ్మ తతోన్న మభిజాయతే ! అన్నా శ్రాణో మనఃసత్యం లోకాః కర్మసుచామృతం " అతి దీర్ఘకాల పర్యాప్తమైన ఈ పరిణామమునందు గోచరించెడు ప్రధాన లక్షణము చేతనా విర్భావము యొక్క క్రమాతిశయము. మనుష్యుడిపుడు భౌతిక శరీర మాధారముగా గల మనోమయప్రాణి. ఇప్పుడొక ప్రశ్న సహజముగా ఉళితమగుచున్నది. అది 'ఇక నిచట ఈ పరిణామ కార్యము మానవునియందు మానసిక 312 చేతన యొక్క ఆ విర్భావముతో ముగిసినట్లే తలపవల యునా? లేక దీనికంటే అధికతరమైన అభివ్యక్తి యేదేని భవితవ్యమునందు గలదా?' అనునది. ఈ ప్రశ్న కొసగ దగిన సమాధాన విషయముననే అరవింద దర్శనము పూర్వమతములకంటె భిన్నమై గోచరించుచున్నది. మనస్తత్త్వమున కూర్వమునందున్నది విజ్ఞాన తత్త్వము. (Super mind). విజ్ఞానశబ్ద మిచట ప్రత్యే కార్థముతో, తాను వివరించిన లక్షణములు గల భూమికను తెలుపుటకై, శ్రీ అరవిందునిచే వాడబడు చున్నది. ఇది మానవునియం దభివ్యక్తము కావలసి యున్నది. ఈ అభివ్య క్తిని సాధించుటయే మానవజీవితము యొక్క పరమోద్దేశము, మరియు ఇచటి ఈ పరిణామ గతియొక్క చరితార్థత. మనోభూమికను పూర్తిగా దాటినగాని ఆత్మ యొక్క సమగ్రజ్ఞానము సాధింపబడదు. సచ్చిదానందముల యాసంత్యమును మనోభూమిక పై నొక విధమైన ప్రతిబింబముగా గాని, లేక చైతన్యము నందు మనోమయస త్త తన్ను దాగోల్పో యెడు నిమజ్జన ముగా గాని యెరుగ వీలుపడును. కాని ఈ జ్ఞానము క్రియాసమర్థము కానేరదు. దివ్యకర్మలను బ్రవర్తింప జేయలేదు. మనోమయ సత్తయందలి ఉనికికి కేంద్రమై ఇచటి కర్మలకు ప్రవర్తకమగుచున్న 'అహంశ' పృథక్త్వ మును అవలంబించి యుండుటచే, పూర్వో క్తములయిన అనుబంధము లందు విలీనమగుచున్నది. దివ్యస త్తతోడి ఐక్యమునందుండి దివ్యకర్మల నాచరింపగల సామర్థ్యము విజ్ఞాన సత్తయందలి దివ్యవ్యక్తికి గలదు. మన 'అహంత' దాని మలిన ప్రతిబింబము. ఈ ప్రతిబింబము తన స్వరూపములోనికి పరిణమింపవలయును. విజ్ఞాన భూమికలోని దివ్య వ్యక్తి యందు తన వ్యక్తిత్వానుభవ ముతో పాటు సర్వాతీతత్వ-సర్వాత్మ్యానుభవములు ఏక కాలికములై సామంజస్యము నొందగలవు. విజ్ఞానమయు డైన పురుషుడు అవంత సచ్చిదానందములను అనుభవిం చుటయే గాక వాటి శక్తి చే తన మనః ప్రాణ శరీరముల ధర్మమును మార్పగలడు. వీటిని గూడ దివ్యసత్తయొక్క ప్రకారములనుగా పరిణమింపజేయగలడు. నిత్యముక్త మును, నిత్య శుద్ధమును, అనంతమును, అమృతమును అగు ఆత్మ యొక్క స్వరాట్య సంరాట్వములను బడయ