పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/371

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరవిందుడు 1904 - 1906 సం॥లలో జరిగిన కాంగ్రేసు సభలకు హాజరయి, అతివాద పక్షముయొక్క చర్చలయందును, చతుస్సూత్ర ప్రణాళికా నిర్మాణము నందును ప్రముఖ మైన పాత్రను వహించెను. స్వరాజ్యము, జాతీయ విద్య, స్వదేశీయత, విదేశవస్తు బహిష్కరణము అనునవి చతు స్సూత్రములు. 1908 వ సం||లో శ్రీ అరవిందుడు బరోడాయందలి ఉద్యోగమునుండి విరమించుకొని కలకత్తాకు వచ్చి “వందే మాతరం" అను పత్రిక యొక్క సహాయ కత్వమును స్వీకరించి, జాతీయపథమునందు సభ్యుడుగా ప్రవేశించెను. ఆత్మవిశ్వాసములేక చెల్లాచెదరై యున్న కాంగ్రెసు సక్షములలో ఆతడు తన ఉజ్జ్వలాదర్శములను, సంధిషరతుల సంగీకరింపని తన జాతీయ భావములను, కొంతవరకు రగుల్కొలివెను. జాతీయ నాయకులను సమావేశపరచి దేశమునకు ఆతడు ఒక విప్లవాత్మక కార్యక్రమమును సిద్ధపరచెను. శ్రీ అరవిందు డిట్లు ఆకస్మికముగా అతివాద జాతీయత యొక్క మహా తత్త్వ వేత్త అయ్యెను. వంగ విభజనము యొక్క ప్రతి ఘటనము నకు చిహ్నముగా ఏర్పడిన జాతీయ కళాశాల కతడు తొలి ప్రధానాచార్యుడా యెను. కాని త్వరలో ఈ కళాశాలను వదలి సంపూర్ణముగ రాజకీయములలో డయ్యెను. ్క నిమగ్ను తెరమరుగునుండి 'వందే మాతరమ్' అను గీతము బయలు వెడలి ఒక్కుమ్మడిగా వ్యాపించి ప్రతి భారతీ యుని జిహ్వాగ్రమున నాట్యమాడ దొడగెను. నిజమునకు 'వందే మాతరమ్' అను పత్రికకు వెనుకనున్న శ క్తి శ్రీ అరవిందునిదే. ఇతని సంపాదకీయములును, ఇతర రచన లును ప్రజల ప్రశంసల నందుకొనెను. ఆంగ్లో-ఇండియన్ పత్రికలకు నై రాళ్యమును కల్పించెను. కాని ప్రభుత్వమిక 'వందేమాతరమ్' అను పత్రికను ఉపేక్షింపజాలక పోయెను. అందుచే న్యాయవిచారణ సఫలో అరవిందు నివై నేరారోపణము (Prosecution) ప్రారంభమయ్యెను. క్షణకాలములో శ్రీ అరవిందుని పేరు సమస్తజాతి యొక్క పెదవులపైనను నడయాడ దొడగెను, భరత ఖండము యొక్క నలుదెసలనుండియు ప్రశంసలు, అభి నందనములు ప్రతిధ్వనింప సాగెను. స్వర్గీయ టాగూరు " 810 కవియు అతని కభినందనములు వెల్లడించెను. రాష్ట్రీయ ప్రధాన దండనాధికారి శ్రీ అరవిందుని నిర్దోషిగా నిర్ణ యించుచు తీర్పు చెప్పెను. 1907 లో, లోకమాన్య బాలగంగాధర తిలకు యొక్కయు, శ్రీ అరవిందుని యొక్కయు నాయ కత్వములో నడచు జాతీయ పురోగాములకును, మిత వాదులకును మధ్యగల ఆదర్శ విషయక ములయిన భేదములు అంతకంతకు ప్రస్ఫుటములు కాసాగెను. 1907లో సూరతు కాంగ్రెసులో, తుదకీపై షమ్యములు ఒక పరిణతరూపము నొందెను. సూరతు కాంగ్రెసునుండి అరవిందుడు వాస్తవమునకు యావద్భారత నాయకు డుగా వెలువడెను. అప్పటినుండియు ఇతనియందు జనతకు శ్రద్ధాభక్తులు. లక్ష్య గౌరవములు, నస్రుభావము ఇనుమడించెను. వెడలిన చోట నెల్ల ఇతడు మహారాజు చిత మయిన గౌరవ ప్రపత్తులను పొందుచుండెను. తిలకు, లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాలు మున్నగు మహనీయు లతో సరాసరిగా చేతులు కలిపి ఇతడు పనిచేయకడ గెను, రాజకీయ సిద్ధాంతములు :- శ్రీ అరవిందుడు వంగ దేశములో తేజోవంతమును, ఆత్మశక్తి సంపన్న మును అగు ప్రయన్నముయొక్క జ్వాలను రగుల్కొలిపి దానిని విద్యుదుజ్జ్వలితము గావించెను. చాలావర కతడు గాంధీ మహాత్ముని రాజకీయ చర్యా విధానములను, ముఖ్య ముగా సాత్విక నిరోధమును, అతనికంటె ముందుగనే ప్రవేశ పెట్టెను. దేశములో నిద్రాణములై యున్న ఆధ్యా త్మిక శక్తులను మేలుకొల్పెను. కాని, గత్యంతరము లేనిచో "దౌర్జన్యమును ప్రయోగించికూడ స్వేచ్ఛనుపొందు హక్కు జాతికి రలడను స్వాభిప్రాయమును ఆత డెన్న డును దాచియుంచలేదు. శ్రీ అరవిందుని ఈ భావము లోకమాన్యతిలకు యొక్క భావముతో తుల్యమైనదిగా నుండెను. "అత్యున్న తాదర్శములో 'శాంతి' ఒక భాగము; కాని, అది ఆధ్యాత్మికముగాని, కనీసము మానసికము గాని అయిన మూలము పై ఆధారపడియుండవలెను. మానవ స్వభావము మారనిచో శాంతిమార్గ మేమాత్రము ఫలప్రదము కాజాలదు. జనులు శాంతిమార్గమును ఒక మానసిక సూత్రముగాగాని, అహింసాతత్త్వముగాగాని అనుష్ఠింప బూచిననాడు అది అపజయమును పొందును.