పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/370

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధ్యాయుడు అరవిందునికి స్వయముగా గ్రీకుభాషను బోధింప మొదలిడెను. సత్వరముగ ప్రధానోపాధ్యాయుని చే ఉన్నత తరగతులలో ఆరవిందునకు ప్రవేశము కల్పింప బడేను. ఇట్లు అరవిందుడు బాల్యముననే గ్రీకు, లాటిన్ భాషలలో పాండిత్యము సంపాదించుకొనేను. లండనునందలి కింగ్స్ కళాశాలలో ప్రవేశించెను. అచ్చట అతనికి సంవత్సరమునకు 80 పౌనుల చొప్పున విద్యార్థి వేతనము లభించేను. పిదప ఆంగ్ల సారస్వత మండలి పద్యకవితను, కల్పనాత్మక వాఙ్మయమును, ఫ్రెంచి సారస్వతమును, ఐరోపా యొక్క ప్రాచీన - మధ్య - ఆధునిక యుగముల చరిత్రమును చదు వుటయందు అరవిందుడు ప్రత్యేక శ్రద్ధను వహించెను. కింగ్స్ కళాశాలయందు గ్రీకు, లాటిను భాషలలో పద్య రచనా విషయమున సంవత్సరమునకుగల బహుమతుల నన్నింటిని అతడు పొందెను. 1895 సంవత్సరములో గ్రీకు, లాటిన్ భాషలలో ఉత్కర్షవధిక అంకములను కూడ అతడు పొం దెను. పిదప ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షయందు ప్రతిష్ఠతో ఉత్తీర్ణుడయ్యెను. కాని, ఆ విష యమున అతనికి సహజమైన అభినివేశము లేద య్యెను. అందుచే ఆ బంధనము నుండి విముక్తిని బొందదలచి స్వయముగ ఐ. సి. యస్. పరీక్షను నిరాకరింపక యుక్తి యు క్తముగ గుఱ్ఱపు స్వారియందు తనకు యోగ్యత లేదను విషయమును అధికారుల దృష్టికి తెచ్చెను. అరవిందుడు ఇరువది సంవత్సరముల ప్రాయమున నే అసాధారణమయిన విద్యాయోగ్యతలను గడించుకొనెను. జర్మను, ఇటాలియను మున్నగు ఇతరములయిన ఐరోపా భాషల యందు కూడ అతడు గొప్ప ప్రావీణ్యమును పొం దెను. సంగ్రహముగా చెప్పవలయునన్న అసంఖ్యాకము లయిన పాశ్చాత్య సంస్కృతి నిధానములను స్వవశ మొనర్చుకొనుటకు అవసరమయిన ఉత్తమ జ్ఞాన సాధన ములను అతడు ఆర్జించెను. తండ్రి యొక్క ఆర్థిక దౌర్బల్యమును బట్టి అరవిండుదు ఉద్యోగ సంపాదనము కొరకు యత్నింపవలసి వచ్చెను. ఇంతలో బరోఓ మహారాజు ఐన స్వర్గీయ శ్రీ సాయాజీ రావు గాయక్వాడ్ ఇంగ్లండునకు వచ్చుట తటస్థించెను. అయ్యవకాశమును పురస్కరించుకొని జేమ్సుకాటను 309 అరవిందుడు సహాయమున అరవిందుడు గాయక్వాడ్ తో పరిచయ మును ఏర్పరచుకొనెను. ఇంగ్లండులో నుండగనే అర విందునిచే ఆంగ్లములో రచింపబడిన పద్య సముదాయము అతడు భారత దేశమునకు వచ్చినతోడనే పుస్తకరూపమును ధరించెను. అరవిందుడు రచించిన కావ్యములలో మిక్లిటా గీతములు, విషాదాంత ప్రేమ అనునవి పేర్కొనదగిన వై యున్నవి. బరోడాలో రాజకీయోద్యోగిగను, కళాశాలా చార్యుడుగను ఉన్నపుడు అరవిందుడు బహునిధములగు సారస్వత రచనలను కావించెను. రాజకీయ జీవితము : మొట్టమొదటి నుండియు వ్యక్తి గత మోక్షము గాని, వ్యక్తి సంపత్తిగాని, శ్రీ అరవిందు నకు ఉన్నత లక్ష్యముగా తోచలేదు. మిక్కిలి అవమాన కరమగు సేవా ధర్మమునుండియు, అజ్ఞానాంధకారము నుండియు, స్వదేశీయులను విముక్తులను ఒనర్చుటకై యత్నించుట తన ముఖ్య కర్తవ్యముగా అతడు గుర్తిం చెను. తన పేరు వెల్లడించకుండ ప్రజాపత్రికలలో రాజకీయ విషయములను గురించి అతడు వ్రాయుచువచ్చెను. 1902 మొదలుకొని శ్రీ అరవిందుడు రాజకీయాందోళనము లలో ప్రవేశించుటకై యత్నించెను. రాజకీయ చర్యలకై సంఘములను నిర్మించుటకు ఉద్యుక్తులైయున్న పురోగాములగు నాయకులతో అతడు చేతులు కలిపెను. బహిరంగముగా ఆతడు చేయగలిగినది తక్కువగా నుండెను. ఈ రహస్య రాజకీయ సంస్థ యొక్క కార్య క్రమమునందు స్వరాజ్య సంపాదనము, విదేశవస్తు బహిష్కరణము, స్వదేశోద్యమము అనునవి ప్రధాన లక్ష్యములై యుండెను. స్వరాజ్యమనగా శ్రీ అరవిందుని దృష్టిలో మితవాదుల భిక్షుక విధానము కాదు. సంపూర్ణ స్వాతంత్య్రమే జాతీయ సంస్థ యొక్క ప్రధానలత్యము కావలయు నని అతడు విశ్వసించెను. లార్డుకర్జను యొక్క వంగవిభజన రూపమైన దురహంకార చర్య వంగదేశము నంతటిని ఏక ముఖముగ కలవరపరచెను. ఈ వంగదేశ విభ జ న విషయక మైన శాసనము రద్దగువరకు పోరాటమును సాగించుటకై నిశ్చయింపబడెను. 1905 వ సం॥రం అక్టోబరు 16 వ తేది ఉపవాసములతోను, శోకములతోను, ప్రతీకార సూచకమగు దినముగా జరుపబడెను. శ్రీ అరవిందుడు