పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/369

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆరవిందుడు (1889-1904) హఫీజు, షోఖి (1888-1982) వంటి ఈ యుగపు కవి శిరోమణులు అరబ్ జాతీయతను గూర్చిన గీతములను గానముచేసి, అరబ్బులకు వారి నాగరికత యొక్క గత వైభవోదంతమును స్మరణమునకు తెచ్చిరి. ఆధునిక కవులు ఛందోరహితమయిన (Blank) కవితను అనుసరించుటకు ప్రయత్నించుచున్నారు. శబ్దాలంకార ములకు గణములకు సంబంధించిన కట్టుబాట్లను త్రెంచి వేయుటకు ఉద్యమించుచున్నారు. ఈ ప్రయత్నములు సఫలమగునా యనునది ఊహకు వదలవలసిన విషయము. కాని అరబ్బీపద్యములకు (ఛందస్సుకు గల ప్రత్యేక లక్షణములు మాసిపోకుండ నిలుపుట, అరబ్బీలోనికి యూరోపియన్ విధానములను ఎక్కువగా ప్రవేశ పెట్టుట ఆధునికో ద్దేశము అయి యున్నవి. డా. ఎం. అ. ఎం. అరవిందుడు :- కొన్నగరు అనునది హుగ్లీ జిల్లా యందు ప్రజాబాహుళ్యముతో గూడిన ఒక చిన్న పట్ట ణము. ఇక్కడనే జగద్విఖ్యాతులయిన రామకృష్ణ పరమ హంస, రాజారామమోహనరాయలు - ఉభయులు జన్మిం చిరి. అందుచే ఈ ప్రదేశము సుప్రసిద్ధి నందినది. ఆ కొన్న గరులో, ఒక సుప్రసిద్ధమగు "ఘోష్” కుటుంబములో, క్రీ. శ. 1840 సం.న కృష్ణధనఘోష్ అనునతడు జన్మించెను. అతడు ఋషి రాజనారాయణ బోసు యొక్క పెద్దకూతురగు శ్రీమతి స్వర్ణ లతాదేవిని వివాహమాడెను. కృష్ణధన ఘోష్ యం. బి. బి. యస్. డిగ్రీని పొందిన తరువాత ఉన్నతతర వైద్య విద్యను సంపాదించు నిమిత్తమై ఇంగ్లాండునకు పోయి అచటి అబెర్డీన్ విశ్వవిద్యాలయమునందు యం. డి. డిగ్రీని సంపాదించుకొని భారతదేశము నకు తిరిగివచ్చెను. ఇతనికి పాశ్చాత్య నాగరకతయందు అత్యంతమయిన ఆదరము, భారతీయ సంస్కృతియందు అనాదరము ఏర్పడెను. జననము :- 1872 సం.రం ఆగస్టు 16 వ తేది గురువారం ఉదయం 5 గంటలకు కలకత్తాలో ఈ దంప 308 తులకు మూడవ కుమారుడుగా అరవిందఘోషు జన్మించెను. కృష్ణధనఘోషు పాశ్చాత్య విద్యావిధానము నంగు సంపూర్ణాభిమానము గలవాడు. అందుచే అతడు అరవిందుని, అతని సోదరులను డార్జిలింగులోని లో రెటో కాన్వెంటు పాఠశాలకు పంపించెను. అప్పటికి అరవిందుడు 5 సంవత్సరముల ప్రాయము కలవాడు. పాఠశాల యందును, భోజనశాలయందును ఘోషు సోదరుల యొక్క స్నేహితు లందరును ఆంగ్లబాలకులై యుండిరి. తన దేశములో నే ఒక విధముగా ప్రవాసియై అరవిందుడు 5 వ ఏట ఇంగ్లీషులోనే తొలిమాటలు ఉచ్చరింప మొద లిడెను. విద్యార్థిదశ :- 1870 సం. న కృష్ణధనుడును, అతని భార్యయు తమతో అరవిందుని, అతని సోదరులను ఇంగ్లండు దేశమునకు తీసికొనిపోయిరి. అచ్చట మాంచెష్టురునందు అరవిందుని, ఆతని సోదరులను డ్రైవెట్సు అను ఆంగ్ల దంప తుల సంరక్షణమునం దుంచిరి. అరవిందునికి ఆ దంపతుల వలన వ్యక్తిగత శిక్షణము లభించెను. డ్రైవేటు లాటిను భాషయందు గొప్ప విద్వాంసుడు. అందుచే అరవిందుని కాతడు లాటినునందు గట్టి పునాదిని నిర్మించేను. డ్రైవేటు దంపతులు ఆస్ట్రేలియాకు పోయిన సందర్భ మున అరవిందుడు అండమునందలి సెయింట్ పాల్ పాఠ శాలకు పంపబడెను. అరవిందుని యోగ్యత, ప్రతిభ, అచ్చటి ప్రధానోపాధ్యాయుని ఆకర్షించెను. ప్రధానోపా