పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/367

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరబ్బీ భాషాసాహిత్యములు నట్లుగనే లిఖించుట ఒక విధముగాను, స్థానిక విషయ ములు, మహాపురుషుల జీవిత పరిశీలనములు మొదలుకొని ప్రపంచ చరిత్రలవరకు కాలక్రమానుసారముగా కధనము చేయుట మరియొక పద్ధతిగా నుండెను. ఆ కారణమున మంగోలుల దండయాత్రల ఫలితముగ 1258 లో బాగ్దాదు పతనము చెందిన తరువాత, సంస్కృతీ కేంద్రము తిరిగి సిరియా, ఈజిప్టులకు మారెను. వాఙ్మయ స్వరూప స్వభావములునుమార్పులనుబొందెను. రాజకీయ కల్లోలములు, అశాంతికర పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికిని విద్వాంసులయినవారు పూర్వకవి ప్రణీత గ్రంథములను పరిశీలించుచు, వాటిపయి వ్యాఖ్యానము లను రచించుచునే యుండిరి. ఈ యుగము నూతన రచనాసృష్టికిగాక క్రోడీకరణమునకు ఎక్కువగ ప్రఖ్యాతి చెందియున్నది. హిజరి 8 వ శతాబ్దములో నూత్న భావము లను, నూతన విధానమును అరబ్బీయ చరిత్ర - భూగోళ రచయితలకు చూపిన చరిత్ర కళానిపుణుడు ఇబ్ను ఖాల్డూన్ (1406) అనునతడు. చరిత్ర సంఘటనలను ఎట్లు పరిశీలించవలెనో ఇతడు కొన్ని నిబంధనలను ఏర్పరచెను. సాంఘికశాస్త్ర విషయ సిద్ధాంతములను ప్రతిపాదించెను. ఈ సిద్ధాంతముల ననుసరించి ప్రాచ్యులెగాక పాశ్చాత్యు లును ఇప్పటికిని నడచుచున్నారు. . ఇండియాలో ప్రభవించిన అరబ్బీ సాహిత్య స్వభా వము :- ప్రాగిస్లామిక కాలమందును, ఐస్లామిక కాల మందును ఇండియా దక్షిణ తీరములు అరేబియాతో వ్యాపార సంబంధములను కలిగియున్నను, సింధు, ముల్తాన్, బెలూచిస్థానము తప్ప, ఇతర భాగములు అరబ్బీ భాష మాట్లాడువారి ప్రభుత్వములో ప్రత్యక్షముగ లేకుండెను. కావున పారసీ మాతృభాషగా గల ప్రభువుల పోషణ భాగ్యము అరబ్బీ భాషకు లభించలేదు. ఏడవ శతాబ్దమునాటికే అరబ్ సామ్రాజ్యమునకు చేర్చబడిన ఇండియా ఉత్తర భాగములుకూడ ఎంతో కాలము వారి రాజకీయాధిపత్యమున నుండలేదు. ఈ కారణమునను, దక్షిణ భారతములోని అరబ్బుల వా స స్థానములు ను వ్యాపారములును వర్తక వాణిజ్యములవరకే పరిమితము లగుటచేత, ఆ నాటివారి విద్యావివేక పరిశ్రమములను గూర్చి ఏమియు తెలియదు. కాని స్థానిక భాషలలో నుండి 306 తీసికొనబడి అరబ్బీ భాషలో చేరిపోయిన కొన్ని పదములు మాత్రము కనబడుచున్నవి. భౌగోళిక, రాజకీయ అవరోధము లెన్నియున్నను, భారతీయ ముస్లిములలో మత సంస్థల యొక్కయు, మతాధ్యయనము యొక్క యు భాషగా అరబ్బీ భాషయే వాడుకలో నుండెను. ఉమయ్యీద్ అబ్బాసీదుల కాలములో కొందరు భారతీయ . మహమ్మదీయులు అల్-హిజాజుకును, ఇరాకురును పోయి అచ్చట స్థిరనివాస మేర్పరచుకొని కవులుగా, గద్య రచయితలుగా ప్రసిద్ధికెక్కిరి. ఇట్టి వారిలో అబు అతా అల్్సంధి యను నతడు కవి; హసజా అల్ సఘాని (1252) అను నతడు శబ్దశాస్త్రవేత్త (Philologist); సఫీ యుద్దీన్ అల్ హింది (1915) అను నతడు న్యాయశాస్త్ర పారగుడు. అట్లే అరబ్బు విద్వాంసులును ఇండియాకు ఏతెంచి, అరబ్బీ భాషలో అమూల్య గ్రంథములను రచించిరి. అల్బెరూని హిందువుల సంస్కృతిని, విద్వత్తును, గ్రహించుటకును, తాను వ్రాయదలచిన కితా అల్- హింద్ అను పుస్తకమునకు విషయసేకరణార్ధము ఇండియాకు వచ్చెను. ఇండియాలో హాడిత్ ప్రవచనము లను వ్యాప్తికి దెచ్చుటకు షంసుద్దీ అనువాడు ఈజిప్టు నుండి ముల్తానుకు వచ్చెను. అయినను, సుజన వీడ్ (888 క్రీ.శ.) మొదలుకొని మొగలు వంశము (1539) వరకును ఇండియాలోని ముస్లిం ప్రభుత్వముల కాలములో భారతీయ ముస్లిములు అరబ్బీ వాఙ్మయములో ఎట్టి ఉపఖాయుతములయిన గ్రంథములను రచింపలేదు. వచనము, పద్యము, త త్త్వశాస్త్రము, భౌతికశాస్త్రములు మున్నగువానికి సంబంధించిన అరబ్బీ వాఙ్మయ శాఖలలో హైందవ ముస్లిములు ప్రసిద్ధిపొందలేదు. ఈ వాఙ్మయ శాఖా గ్రంథములమీది వ్యాఖ్యానములను సమీకరణ చేయుటయే తమ కర్తవ్యముగా వీరు పరిగణించుకొనిరి. భారతీయ ముస్లింల హృదయమునకు తర్కశాస్త్రము నచ్చినది. ముహిబుల్లా బిహారి (1707) సుల్లం అల్ ఉలూం అను గ్రంథమును వ్రాసెను. ఇది యిప్పటికిని తర్క శాస్త్రమున ప్రామాణిక గ్రంథముగా పరిగణింపబడు చున్నది. సద్ బె సాలము నిజాముద్దీగా, ఆలియా, నాసిరుద్దీగా చిరాగ్ దిహిలెవి, షిహాబుద్దీన్, అమీరు ఖుస్రు అనువారి