పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/364

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వర్తనములను గూర్చిన రచనల యెడ ఎక్కుడు అభినివే శముకలవాడై నీతిబోధక పద్యములను సరళ భాషలో ప్రబోధాత్మకముగ రచించెను. పద్యకవిత్వముతో సరి సమానముగ సంగీత విద్యయును వృద్ధిచెందెను. సంగీత శాస్త్రముమీద, వాద్యసాధనములమీద గ్రంథములు రచింపబడెను. సంగీత పాఠకులు ప్రత్యేక రాగఫణుతులు, వారి జీవచరిత్రలు సుప్రసిద్ధమైన కితాబై-అల్ అఘాని యందు నిక్షిప్తములైనవి. అబ్బాసీదు ఖలీపాల ఆధిపత్యము ఛిన్నాభిన్నమయిన తరువాత ఇస్లామీ సామ్రాజ్యమున నెలకొనియున్న అల్ప రాజ్య సభాస్థలులు విద్యావ్యాసంగములకు కేంద్రము అయి వెలసెను. అలెప్పోయందలి సైపుదౌలా యొక్క హందానిద్ సభాస్థానము అరబ్బీ వాఙ్మయ కేంద్ర రాజ ములలో నొక్కటిగా విలసిల్లెను. ఇచ్చటనే అల్ ముతా సబ్బీ (985) అను కవిపుంగవుడు వర్ధిల్లెను. ఈతని కవితకు ప్రజలు ముగ్ధులయి, దానిని పఠించుచు, వ్యాఖ్యానించు చుండెడివారు. పండిత మండలిలో దానికెక్కుడుగ మాన్యతలభించుచుం డెను. సైఫుద్దేలా అలెప్పో రాజ్యాధి పతిగా గ్రీకులతో నలుబది యుద్ధములు సల్పినవాడు. ఈ సై పుద్దేలా దండయాత్రలనుగూర్చి అల్ ముతానబ్బీ, తన సమకాలిక కవియగు అబు ఫిరాస్ ఆల్ హందానితో కవితాగానము చేయుచుండెడువాడు. పూర్వ సంప్రదాయసిద్ధమయిన కవిత్వ విధానము "అల్ మా అర్రి" (1054) అను అంధకవితో అంతమొందెను. ఈ అంధకవి ఇస్లామీ శాస్త్రములందును, గ్రీకు, హిందూ తత్వశాస్త్రములందును విశేష జ్ఞానపంపన్నుడై సిరియా, బాగ్దాదులందు గణుతికెక్కెను. సారస్వత పత్రలేఖనము చేత నేగాక, “సఖత్ అల్ జందు; లుజుం మా లాయఱ్ఱుం" అనెడు రెండు పద్యకావ్య రచనల చేగూడ నీతడు ప్రసిద్ధి కెక్కినాడు. ఈ కావ్యములందు అల్మా అర్రి. సమ కాలికుల భావములను, సంఘజీవనమును, ప్రభుత్వమును, మతమును మొగమోటము లేకుండ, ధైర్యముగా ఖండించినాడు, జుహదునందు (పవిత్రతా సూత్రములు) ప్రతిపాదించిన ఆదర్శములను అల్ మా అర్రి తన జీవితము నందు కార్యరూపమున ప్రవేశ పెట్టినాడు. ప్రవేశ పెట్టినాడు. మాంసా హారమును, వివాహమును వ్యతిరేకించుటకుగూడ వితడు 303 అరబ్బీ భాషాసాహిత్యములు పూనెను. అతని భావములందు బౌద్ధమత ప్రభావము కూడ కనబడెను. అరబ్బీ వాఙ్మయమున రమణీయ వచనరచనా ప్రారంభమునకు అబ్బాసీదు, ఖలీఫాలే ముఖ్యకారకులు. వీరు పెర్షియన్, గ్రీకు, సిరియా భాషలనుండి అరబ్బీ లోనికి అనువాదములను చేయుటను మిగుల ప్రోత్స హించిరి. పారసీనుండి కాల క్షేప య ము ను, (Light Literature), గ్రీకు నుండి తత్త్వశాస్త్ర గ్రంథము లను, భౌతికశాస్త్ర గ్రంథములను, ఇండియానుండి గణిత శాస్త్రమును అనువాదము చేయు మద్యమము ముమ్మ రముగ సాగెను. సంస్కృత గ్రంథమగు పంచతంత్రము అరబ్బీలోనికి అనువదింపబడెను. దీనికి అరబ్బీలో "కలిలా వ దిమ్మా" అని పేరు. ఈ అరబ్బీ అనువాదము పరిష్కృత పహ్లవీ గ్రంథమునుండి చేయబడినది. అనువా దకుడు ఇస్లాము మత ప్రవిష్టుడును, పర్షియా దేశీయుడు నగు “ఇబ్నె అల్ ముఖప్పా" (757) అను నాతడు. ఇతడు పారసీక చరిత్ర గ్రంథమగు “ఖుదాయినామా" అను దానినిగూడ అరబ్బీ భాషలోనికి అనువదించినాడు, ఇట్లు వివిధ విషయములను గూర్చి కళాత్మక మైన వచన శై లిలో రచింపబడిన పెద్ద గ్రంథములేగాక, ప్రజలలో సామాన్య విజ్ఞాన ప్రసారమున కుపయోగించెడు విజ్ఞానకోశ (సర్వస్వ) గ్రంథములుకూడ ప్రచారము లోనికి వచ్చెను. ఇట్టి వానిలో “ఇబ్దు అల్ వరీద్" అను గ్రంథమొక్కటియై యున్నది. దీనిని "ఇబ్నె అబ్దు రబ్బీ" (989) అను స్పెయిన్ దేశీయుడు రచించెను. ఇందు 25 అధ్యాయములు కలవు. ఈ అధ్యాయములలో ప్రాగి స్లామిక చరిత్రము, ఇస్లామిక చరిత్రము, కవిత్వము (Poetry), ఛంద శ్శాస్త్రము, సామెతలు, సారస్వత, ఐతి హాసిక గాధలు మున్నగునవి కూర్పబడినవి. ఇట్టి రచనా విధానము కలవియై తరువాతి కాలమునకు చెందినవి రఘబ్ అల్ ఇఫహాని (1108) రచించిన “ముహదరాత్, అవ్ ఉదబా", అజ్ జమతరి (1148) రచించిన “రబీ అల్ అబరుహొ" అను గ్రంథములు. పరిపాలకుల రాజకీయ వ్యవహారపత్రములు, రాజ్య విషయక లేఖావళులు పెరిగిన కొలది, అందమయిన వచన రచన యొక్క ఆవశ్యకత అధికము కాజొచ్చెను. ప్రాత