పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/363

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరబ్బీ భాషాసాహిత్యములు గ్రంథము యొక్క చారిత్రక సమాలోచనలు, దాని వ్యాకరణ భాష్యములు, దాని సాహిత్యాలం కార గుణ గ్రహణము, దాని నిబంధనల యొక్కయు, న్యాయ సూత్రముల యొక్కయు ప్రాముఖ్యము, సిద్ధాంతముల మత ధర్మ నిరూపణము ఇవియే ముఖ్య పఠనాంశము లయి యుండెను. ప్రారంభమున నిది హాడితు (పవిత్ర సంప్రదాయ) వాఙ్మయ భాగముగా నుండెను. తరు వాత నిది స్వతంత్రము, క్రమబద్ధము నగు శాస్త్రముగా పెంపొందెను. గత పరిశోధన ఫలితముల నన్నింటిని సమీ కరించి, ఒక మహాసంపుటములో క్రోడీకరించిన సుప్రసిద్ధ పండితుడు ఇబ్నుజారిక్ ఆల్ తహరీ అనునతడు. ఖురాను నుండియే విధ్యాత్మకములగు నియమములు ఏర్పరువ బడెను. అవియే ధర్మశాస్త్రముగా పరిణతిచెందెను. ధర్మ శాస్త్ర విధులను గూర్చి షఫాయి; హనఫీ శాఖలవారు పెక్కు గ్రంథములను నిర్మించిరి. భాషా తత్వశాస్త్రము (philology) : అరబ్బులు కానీ వారు ఇస్లాంమత ప్రవిష్టులగుట, అరబ్బులు దూరదూర మందున్న ముస్లిందేళ ప్రాంతములలో స్థిరనివాస మేర్ప రచుకొనుట కారణములుగ నిర్దుష్టమైన ఖురాను గ్రంథ పఠన క్రమమును ఏర్పరచుట అవసరమయ్యెను. ఖలీఫా ఆలీ యాజ్ఞను పురస్కరించుకొని అబుల్ ఆస్వాద్ ఆద్ దుఆలి (Abdul Aswad ad Duali 685) అనునాతడు మొట్టమొదట వ్యాకరణ పద్ధతుల గూర్చి చర్చించినట్లు తెలియుచున్నది. అరబ్బీ భాషా వ్యాకరణ మును గూర్చిన విచారణము ఇరాకులోని కూఫా, జాస్రా అను రెండు పట్టణములలో సాగినది. ఈ చోటులందే భాషా నియమములను గూర్చియు, అరబ్బీజాతీయములను గూర్చియు పండితులకు గల పరస్పర విరుద్ధ భావములను పురస్కరించుకొని వ్యాకరణ విషయములో రెండు వాదములు ఏర్పడెను. భాషా శాస్త్ర విషయములను, నిఘంటు పామగ్రిని సేకరించు పని బెడూయినులు గావించిరి. వన్య మృగము లను గూర్చి యొక గ్రంథము, ఆశ్చర్యములను గూర్చి యొక గ్రంథము, ఒంటెలను గూర్చి యొక గ్రంథము, వర్షమును గూర్చి యొక గ్రంథము, మానవుని నై జమును గూర్చి యొక గ్రంథము రచితములయ్యెను. ఇవి తొలుతటి 802 గ్రంథములు. తరువాత కొంత కాలమునకు క్రమబద్ధమైన విస్తృత నిఘంటువులలోనికి ఈ గ్రంథములు చేర్చబడెను. బాస్రా మతాచార్యుడైన అబూబకర్ ఇబ్ను దురాయిదు (Abu Bakar ibn Duraid) అనునతడు జమ్హరా, కితాబ్ ఆల్ ఇష్తఖాఖ్ అను బృహత్కోళమును సంకలనము చేసి అందు శబ్దముల మూలములను, వాటి నుండి ఏర్పడిన అవాంతర రూపములను వివరించెను. ఈ వర్గమునకు చెందిన వాడే అల్ ముబార్ రాదు (al-mubarrad 898). ఈతని రచన యగు కితాబు అల్ కామిల్ (Kitab al Kamil) అను గ్రంథము అరబ్బీ భాషా, సాహిత్యములను గురించియే గాక, ప్రాచీన చరిత్ర, సంప్రదాయములను గురించి కూడ వివరించు నొక విజ్ఞాన సర్వస్వము. గద్యపద్యములు : అబ్బాసీదులు విజ్ఞానాత్మక కృతుల యెడ తమ ఆదరాభిమానములను జూపుచుండుటయేగాక పద్యవాఙ్మయాభివృద్ధికిని తగు ప్రోత్సాహము కల్పించిరి. ఒకవంక పూర్వ ధోరణిలో ఖసీదా ప్రక్రియలతో విమ తానుసారములగు రచనలు సాగుచుండగా, మరి యొక వంక పద్యరచనలలో క్రొత్త ఫక్కీ కవనము తలయెత్త సాగెను, ఈరానుప్రభావమున మారిన పరిస్థితుల కనుగుణ ముగా మృదుత్వమలవడినను కవితారీతిమాత్రము పూర్వ ప్రమాణమునే యనుసరించెను. విదేశ ప్రభావము వలన ప్రబలిన మతవ్యతి రేకోద్యమములు కవుల నెక్కుడుగ ప్రభావితులగావించెను. ఇట్టివారిలో కొందరు జిండిక్కులు (నాస్తికులు) అని పిలువబడిరి. ఈరానులు అద్వైతసంప్ర దాయముచే ప్రభావితులయిన కవులు బాషా రు ఇబ్ను బాషారు బుర్డు (783), సాలీ ఇబ్నె అబిల్ ఖుద్దును (813) అను వారలు. పూర్వకవులు కొందరు మాత్రమే గాక, ఈ యుగమున అత్యంత ప్రసిద్ధికి చెందిన కవులు అబునవాస్, ఆబుల్ అతాహియా, ఆబూతమ్మమ్, ఆల్ బహుతూరి అనువారలు. ఆబుల్ వాస్ (810) రచించిన “దివ్యా-" అను గ్రంథమునందలి జుహుదియాత్ (పవిత్ర) ప్రకరణ మునుబట్టి వృద్ధాప్యములో నీతడు గభీరవిషయ తత్త్వా న్వేషి యైయుండినట్లు కనబడుచున్నను, ఈతడు విశృంఖలు డగు కవి. అయినను, ఈతని ఈతని త్రాగుబోతు పాటలు, శృంగార పద్యములు గొప్పకీర్తిని గడించినవి. ఇక అబుల్ అతాహియా (828) కవి జుహుద్ (పవిత్రత), పవిత్ర