పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/362

ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుగ ఆచారములు, ఆదర్శములు తిరిగి తలలెత్తి వ్యాపింపసా గెను. అంతకు ముందుండిన ధర్మతత్పరత్వము యొక్క స్థానమును స్వేచ్ఛావిలాస జీవితము _ ఆక్ర మించెను. గ్రామీణ రాజకీయ పక్షములలో అంతర్యుద్ధ ములు పొడసూ పెను. ఈ అంతర్యుద్ధములు బిూయిజ్ అరబ్బులకు పట్టణ జనులతో సంపర్కము కలిగించినవి. వీరిద్వారా బిడూయిజ్ కవిత యొక్క ప్రాచీన రీతులు పట్టణములలో ప్రవేశించెను. ఈ కవిత సామాన్యముగా ఈ ఉద్రేశాత్మకము, ప్రకోపనాత్మకము అగుటచేత అచ్చట వర్ధమానమగుటకు దాసికి అనుకూల వాతావరణము లభించెను. కాని, విమతస్థుల ఆక్షేప కావ్యములును (Satire=Hija), స్తోత్ర కావ్యములును (Eulogy = Fakhr) ఇప్పుడు రాజకీయ వాసనకలవియై రాజకీయ కవిత్వము, రాజకీయ ఆక్షేప కావ్యములు ప్రత్యక్షము కాజొచ్చెను. విలాస జీవితవిధానము ప్రేమభావ పుష్టమై శృంగా రాత్మక మైన, కావ్యములు ప్రభవించుటకు కారణ మయ్యెను. విశుద్ధ ప్రేమాత్మక కావ్యములు ముఖ్యముగా ఎడారి జనపదములందు వర్థిల్లుచుండెను. నగరవాసుల ప్రేమ కవిత్వమునకు విరుద్ధమైన ప్రేమానుభవములను ఎడారికవి వర్ణించుచుండెను. బుఠానియా ప్రేమికుడగు జమిత్బుసూమరు “ (Jamit-b-Ma'mar. d. 82 A. H.), లు బ్నా ప్రియు డగు ఖైస్భుజారిహ్ (Qais-b-Jarih) ; లై లా వలపుకాడగు మజ్ను - వీరు పవిత్రప్రేమ కవిత్వము నందు నాయకులు. విమతస్థుల కాలములో 'గజల్' అను ఛందస్సు, ఓడ్ అను ఛందస్సునం దంతర్భాగముగ నుండెను. దానికి స్వతంత్ర అస్తిత్వము లేకుండెను. కాని ఉమ్మాయ్యీదుల కాలములో అది యొక స్వతంత్ర ఛందస్సుగా రూపొం దెను. ఇస్లాం మతము సాహితీ సంస్కృతులయొక్క అభి వృద్ధిని పురికొల్పేను. అది క్రమముగా బలపడెను, అప్పుడు విద్వాంసులు ప్రాచీన కవితా గ్రంథముల సేకరణ ప్రయత్నమునకు పూనుకొనిరి. “రావిస్" (Rawis) అను వారు ప్రాచీన కవితాగాయకులు. వీరు ఆ గీతములను వల్లెవేసి గానము చేయుచుండెడివారు. ఈ రావిసులు ప్రాచీన కావ్యసేకరణ భారమును వహించిరి, 301 అరబ్బీ భాషాసాహిత్యములు అరబ్బీ వాఙ్మయ లక్షణములు :- (750-1258) క్రీ.శ. 750లో అబ్బాసిదులు రాజ్యారోహణ మొనరించిన నాటి నుండి అరబ్బుల రాజకీయ, సంస్కృతి జీవితములందు ప్రధానమయిన మార్పులు వచ్చెను. ఖలీఫాల రాజధాని డమస్కసునుండి బాగ్దాదుకు మార్చబడెను. బాగ్దాదులో రాజకీయ, పరిపాలన, సంస్కృతి, జీవితరంగములందు పారసీక ప్రభావము ప్రాబల్యమునొందెను. ఈ విధముగా నూతన విధ మైన వాఙ్మయసృష్టికి రంగము సిద్ధమయ్యెను. అరబ్బుల ప్రాచీన రాజకీయ సంప్రదాయముల నభివృద్ధి పరచుటకు బదులుగా "అబ్బాసిదులు" పద్య గద్యములను ఆదరించుచు, అపార భౌతికశాస్త్ర వాఙ్మయమునుగూడ అభివృద్ధిపరచి "సంస్కృతి" ఆశయమును విశాల పరచిరి. ఈ యుగమందలి వాఙ్మయమును నుతము, భాషా తత్త్వము, గద్యము, పద్యము, చరిత్ర, భూగోళ శాస్త్రము, వేదాంతము, భౌతిక శాస్త్రములు - అను శాఖలుగా విభజింపవచ్చును. ముస్లిముల ప్రథమ కర్తవ్యము ఖురానుతోపాటు మహమ్మదు ప్రవక్త యొక్క ఉపదేశములు, చర్యలు సంపాదించుటయై యుండెను. ఎందుచేతనన ఈ సంప్ర దాయములు మత విశ్వాసముల సంబంధమునను, మత విధుల ఆచరణము నందును ఏది ప్రామాణిక మో, ఏది తప్పక యాచరింపదగినదో తెలుపునవిగా నుండెను. నిత్య జీవితమునందు ఖురాను సిద్ధాంతములను ఆచరణలో పెట్టు విధానమును ఈ సంప్రదాయములు మాత్రమే నిరూపించును. రానురాను హాడిత్తుల (సంప్రదాయముల) సంచయములు పెరుగసాగెను. అల్ప ప్రామాణికము లయిన కొన్ని విషయములుకూడ వాటియందు ప్రవే శించెను. కాబట్టి వాటి నన్నిటిని పరిశీలన పూర్వకముగ విచారణ సల్పి, గాలించి, ఏవి ప్రామాణికములో, ఏవి కల్పితములో నిశ్చయించిరి. ఇట్టి విమర్శనాత్మక పరి శోధనము మూలమున, ఈ సంప్రదాయములను పరం పరగా అందిచ్చుచు వచ్చిన వారి జీవితచరిత్రలు తెలిసి కొని, వారిలో ఎవ్వరు నమ్మదగినవారో, ఎవ్వరు నిరాక రింపదగినవారో గుర్తింపవలసి వచ్చెను. మత ధర్మ వాఙ్మ యమునకు సంబంధించిన ఈ వర్గమునకే ఖురాను వ్యాఖ్యానము (భాష్యము) చెందియున్నది. మూల