పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/361

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరబ్బీ భాషాసాహిత్యములు (ghassanid) వంశ పరిపాలితము. ఈ రాజ్యము అరేబియా యొక్క ఈశాన్య భాగమున వ్యాపించియుండెను. మరి యొకటి “లఖ్మిద్” వంశ పరిపాలితము. ఈ రాజ్యము యూఫ్రటిస్ నదికి పడమటి దిశయందు వ్యాపిం చియుం డెను. ఘస్సనీదుల సంస్కృతీ సభ్యతలు రోమను ప్రభావ ముల తాకిడికి గురియైయుండగా, లఖ్మిదులు పారసీక (సస్సేనియ౯) సంస్కృతిచే ప్రభావితులయిరి. ఈ రెండు రాజ్యములు పెర్సియా, రోము దేశముల మధ్య జరిగిన యుద్ధములందు ఘనమైన పాత్రను వహించెను. రాజాస్థానములకు ఏతెంచు కవులను, ఈ రెండు రాజ్య ముల ప్రభువులును సత్కరించుచుండిరి. తమ ఇస్లాం పూర్వయుగ కవితనుబట్టి, ఈ 'డారి ప్రజలు తమతమ విశ్రమస్థానముల (encampment) కనువగు గడ్డి మైదానములను, సారవంతములగు భూములను వెదకుచు దేశద్రిమ్మరులుగా తిరుగుచుండెడివారని తెలియుచున్నది. వీరు ప్రకృతి పరీక్షయందు నిపుణులై వాస్తవిక దృష్టిగల వారై యుండిరి. ఇస్లాం పూర్వయుగ కవితలో వేదాంతధోరణి గాని, గంభీర ధార్మిక చింతనగాని లేదు. బిదూయీజా అరబ్బులు నీతిప్రవర్తన యందును, సాంఘికజీవనము నందును తమ తెగసంప్రదాయములనే గౌరవించిరి. శౌర్యము, ప్రేమ, ఇష్టజన వియోగముచే నైన దుఃఖము, అవమానము, ఘనత, ఆతిథ్యము అనునవి వారికవితకు వర్ణనాంశములు. ఇవి ప్రజారంజకములగు విషయములై యుండెను. వీటిని గూర్చియే వారెక్కుడుశ్రద్ధ గనుపరచుచుండిరి. · అయినను, ఇస్లాం పూర్వయుగకవితలో యుద్ధములు; సాహసకార్యములు, ఆతిథ్యనిరతులగు దాతల సంకీర్తన ములు,పిసినిగొట్టుల యొక్కయు, పిరికిపందల యొక్కయు నిందాపూర్వక వర్ణన లేయున్నవి. ఈ విధముగా ఈ కవి త్వము అప్పటి సాంఘిక పరిస్థితులను స్పష్టము చేయు మూల సాధనముగను, అరబ్బుల జాతిలోని తెగల చరిత్రను జాటు నదిగాను ఉపకరించుచున్నది. కొన్ని ఉపన్యాసక్రమములును, సోదెకాండ్రు వచించు అనుప్రాసయు క్త ములగు మాటల ధోరణులును తప్ప ఇస్లాము పూర్వయుగమున వచన వాఙ్మయమున్న జూడ కనుపించదు. ఖగోళశాస్త్రము, శీతోష్ణస్థితిశాస్త్రము 890 (climatology) ముఖలక్షణ (సాముద్రిక శాస్త్రము (physiognamy), వంశానుచరితము (geneology) ఈశా శాస్త్రములతో అరబ్బులకు పరిచయమున్నట్లు తోచు చున్నది. ఏమైన నేమి ? అరబ్బీ వాఙ్మయములో మొదటి గ్రంథముగా మనకు కనబడునది ఖురాను గ్రంధమే. ఈ గ్రంథములో న్యాయ్యముగను, దైవచింతనముతోను జీవితము డపుటకు వలయు ధార్మిక నీతిసూత్రములును, సాంఘిక నియమములును ప్రవచింపబడినవి. సాహిత్య దృష్టిలో ఉదాత్త గ్రంథముగా ఖలరాజు విశిష్టతను కలిగి యున్నది. మహమ్మదు ప్రవక్త జీవించియున్న కాలములో ఇస్లాం పవిత్రగ్రంథము నిర్మితమైనప్పుడు అరబ్బీ లిపి దోషభూ యిష్ఠముగా నుండెను. గ్రంథ విషయములు భ్రష్టము కాకుండ కాపాడ.టకు తగు లిపిని, వ్యాకరణ సూత్రము లను వినిర్మించుట అత్యవసర కార్యమయ్యెను. ఖురాను వాక్యార్థనిర్ణయమునలు వ్యాకరణశాస్త్ర పఠనము, శబ్ద రాశి జ్ఞానము అవసరమయ్యెను. పదముల యొక్క సరి యైన అర్ధము ఇస్లాం పూర్వయుగ కవుల రచనల సమస రించి నిర్వచింపబడుచువచ్చెను. ఇందుమూలమున ఇస్లాం పూర్వయుగక ుల రచనలను సరిదిద్దుట అవసరమయ్యెను. ఈ విధముగా శబ్దతత్వశాస్త్రము (philology), నిఘంటు నిర్మాణము ఆవిర్భవించెను. మహమ్మదు ప్రవక్త యొక్క ఉపదేశములు, కృత్యములు మనస్సునకు తెచ్చుకొని, తదనుసారముగా ఖురాను సిద్ధాంతముల ఆచరణ విధా సము నిర్ణయింపబడెను. తత్ఫలితముగా "పవిత్ర సంప్ర వాయ" మనబడు శాస్త్రము (Hadith) ప్రచలిత మయ్యెను. మొదటి నలుగురు ఖలీఫాల కాలముముగిసిన తరువాత ఇస్లామీ విజ్ఞాన ప్రబోధ కేంద్రము ధర్మనిష్టాపరులైన ఖలీఫాల రాజధాని అగు మదీనానుండి డమాస్కును పట్టణమునకు మారెను. అప్పుడు డమాస్కసునందు, లౌకిక భావ సమన్వితులును, మక్కా కుటుంబము వారును అయిన "ఉమ్మయ్యీదు"లు, అంతకుముందున్న ప్రజా రాజ్య విధానమును నెట్టివైచి, ఆస్థానమున రాజవంశ పరిపాలనా విధానమును నెలకొల్పిరి. ఉమ్మయ్యీదులు రాజ్యాధికారము వహించినప్పటినుండియు ఇస్లాం పూర్వ