పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/360

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అసంఖ్యాకములగు ఒడుదుడుకులను రికార్డుచేయునట్టి అతిసున్నితములగు పరికరములతో అయస్కాంతావ లోకనశాలలు ఏర్పాటుచేయబడి యున్నవి. ఏ. యమ్. 83. అరబ్బీ భాషాసాహిత్యములు :- అరబ్బీ భాష సెమెటికు భాషా కుటుంబమునకు సంబంధించినది. ఇందు హీబ్రు, ఫినీషియన్, అరమెయిక్, అస్సీరియన్ మున్నగు ఉత్తర, దక్షిణ ప్రాంతములు భాషా సమూహములు చేరి యున్నవి. పురాతత్త్వశాఖవారి పరిశోధనల ఫలితముగా క్రీ. పూ. 4000 సం.ల నుండియు అరబ్బుల నాగరికతా చరిత్ర కనబడుచున్నది. హిమ్యరిటిక్ అనబడు దక్షిణ అ రేబియా ప్రాంతమునందలి శాసనములు క్రీస్తు పూర్వము నుండి మొదలుకొని క్రీస్తు తరువాత 6 వ శతాబ్ది వరకును లభించుచున్నవి. ఇవి అత్యంత వికాసవంతమయిన వారి సంస్కృతిని, వారి ఆర్థిక సంపదను, హిందూ దేశమువరకు వ్యాపించిన వారి విశాల వాణిజ్య సంబంధములనుగూర్చి తెలుపుచున్నవి. ఈ శాసనములు, వా రుపయోగించు చుండిన భాష ఉత్తమ సంస్కార భూయిష్ఠమైనదనియు, క్రీ. పూ. 1500 ప్రాంతమునందే లేఖనకళ వారిలో పరి పూర్ణ వికాసము చెందినదనియు, రుజువు చేయుచున్నవి. అదే విధముగా ఉత్తర అరబ్బీ భాష నగర సంస్కృతిని (Urban culture) పెంపొందించెను. అజ్ఞాత కాలము నుండియు మక్కా పట్టణము వాణిజ్యమునకును, మతము లకును కేంద్రముగా నుండెను. దక్షిణ అరబ్బీ తెగలవారి యొక్కయు, మెసపుటేమియాలోని పారసీక ప్రభా వితు అయిన అరబ్బుల యొక్కయు ప్రభావము, ఉత్తర అరబ్బీభాషలో భాషాభివృద్ధికిని, ఉన్నతమైన నాగరకత కును దోహద మొసగినది. అరబ్బీ భాషలో ఇప్పుడు వాడ బడుచున్న అరబ్బీ అక్షరములు క్రీ. శ. 8 వ శతాబ్దపు శాసనములందు మాత్రమే కనబడుచున్నవి. ఏడవ శతాబ్దము మొదలుకొని, ఇస్లాం మత వ్యాప్తితో బాటు ఉ త్తర అరబ్బీ భాష ప్రజాజీవనమునందును, నాగర కత యందును ప్రగాఢముగ నెలకొనెను. ఇట్లిది అరే బియా ద్వీపకల్పమునందేకాక ఆసియా దేశములలోను, ఆఫ్రికాలోని ప్రొగుత్తర ప్రాంతములలోమ, స్పెయిన్, సిసిలీ మున్నగు పాశ్చాత్య దేశములలోను కూడ వ్యాప్తి దేశములలోను కూడ వ్యాప్తి 299 అరబ్బీ భాషాసాహిత్యములు ఈ ప్రాంతములలో అరబ్బీ భాష వాడుక భాషగా నుండుటయేగాక అది ఈజిప్టు, మాల్టా, ఈరాన్, జావా మొదలగు దేశములందును, ఏదో విధమున స్థానిక భాష ల ను కూడ త్రోసి రాజని పైకి వచ్చెను. దూర దూరములందున్న విశాల ప్రాంతములయందు వ్యాప్తి చెందినందున ఆయా స్థానిక ప్రభావములు కారణముగా అరబ్బీ భాషయందు పెక్కు మాండలిక భేదములు (dialects) రూపొందెను. కాని ఈ దేశము లన్నింటిలోను గ్రంథ భాష ఒకేవిధముగా నిలచియుండెను. పదమూడు శతాబ్దముల వెనుకనుండియు అది ఖురాను శైలిని, రచనా క్రమమును ఆధారముగా గొనుటయే యిందు లకు కారణము. ఇది మధ్యప్రాచ్య దేశములలో పెక్కిం టికి మాతృభాషగా నుండుటయేగాక ముస్లిం ప్రపంచము లోని మత వ్యవహారములకును ప్రకృతి శాస్త్ర విజ్ఞాన ప్రసారమునకును వాడబడుచుండెను. అరబ్బీ వాఙ్మయోత్పత్తి వికాసము (క్రీ.శ. 500-750):- ప్రపంచములోని మహావాఙ్మయము లన్నింటి యందు వలెనే ఇస్లాము మత ప్రారంభమునకు పూర్వపు అరబ్బుల విజ్ఞానవిలసితజీవితము పద్యరచనలలో ప్రత్యక్షమయ్యెను. అరబ్బీ పద్యములు అంత్యానుప్రాసాత్మకమగు గద్యగా ప్రారంభించెను. ఈ గద్య విధానమునే విమతారాధకు లగు (Pagans) గణాచారులు (సో దెచెప్పు వారు. Oracles) తమ మంత్రోచ్చాటనా సందర్భములందు ఉపయోగించు చుండిరి. రానురాను అదియే అధికముగ లయానుబద్ధమైన రూపమును పొం దెను. తరువాత నిది పదునారు ఛందస్సు లుగా విభ క్తమయ్యెను. ఈ ఛందస్సుల మారు రూపము లీ పరిగణనలో చేరలేదు. ప్రాచీన కాలములో ఉకాజు పట్టణము నందును, మక్కా పట్టణమునందును జాతరలు జరుగుచుండెను. అప్పుడు కవులు సమావేశమయి ఒకరి నొకరు మించునట్లుగా కవిత లల్లి పోటీపడుచుండిరి. వారు అల్లిన పద్యకవిత్వమును ఖసీదా (గేయగీతిక) అందురు. ఈ గేయగీతికలు ఆంగ్లభాషలోని ఓడ్స్ (Odes) వంటివి. ఇందు 60 నుండి 100 వరకు పంక్తు లుండ వచ్చును. ఇస్లాము మతమునకు పూర్వయుగమున రెండు రాజా స్థానములు అరబ్బులకుండెను. “ఇందొకటి "