పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/359

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయస్కాంత శాస్త్రము మాగ్నటిక్ పదార్థమునకు ఒక విధమగు సందిగ్ధ ఉష్ణోగ్రత (critical temperature) కలదనియు, ఆ ఉష్ణోగ్రతయందు అది డయామాగ్నటిక్ గా రూపొందుననియు సిద్ధాంతీక రించెను. ఇంతియేకాక, 5 వ చిత్రములో చూపించబడి నట్లు ఫెర్రోమాగ్నటిక్ పదార్థముల యొక్క గ్రహణ శక్తులు ఉపయోగించబడిన క్షేత్రముల శక్తులను బట్టి మారుచుండును. మరియు అయస్కాంతీకరణము జరిగిన తరువాత అవి మందాయనము (Hysteresis) అను విశేష మును చూపించును. భౌమాయస్కాంతత్వము : భౌమాయ స్కాంతత్వ శాస్త్రము యొక్క పరిజ్ఞానము, భూమి యొక పెద్ద అయస్కాంత మను అభిప్రాయము మీద ఆధారపడి యున్నది. 'భూమి యొక్క ఉపరితలము పై నుండు దిక్సూచి కొనలు సామాన్యముగా ఉత్తర దక్షిణ దిశలకు ఉండు నట్లుగా ఏర్పాటు చేసికొనును. ఆ ధ్రువములు, సరిగా భౌగోళిక ఉత్తరదక్షిణములను చూపించకపోవుట వలన, ఆయస్కాంతిక, భౌగోళిక ధ్రువములు రెండును ఒక దానితో నొకటి కలియవు(ప. 8). ఈ రెండింటికి మధ్యగా అయస్కాంత దక్షిణ ధృవము భూగోళవు ఉత్తరధృవము ఆయస్థాంతపు భూమధ్య పటము - 8. భూగోళపు దక్షిణ ధృవము నుండు కోణము ‘ది కాృతము' (Declination) అని పిలువ బడును. ఒక ఉక్షుసూదిని సన్నని సిల్కు దారముతో మధ్య ప్రదేశమున కట్టి గాలిలో వేలాడదీసిన, అది క్షితిజసమాంత రముగా ఆగును. ఆసూదిని అయస్కాంతీకరణము నొందిం చిన, అది ఇందాకటి స్థితికి ఏటవాలుగా నిలువుగానుండు స్థితిలో అగును, ఆ సూదియొక్క క్షితిజసమాంతరముగా నుండు స్థితికిని, ఏటవాలుగా నిలువుగా నుండు స్థితికిని (దిశలకు) మధ్యనుండు కోణమును 'అవపాతము' ఆ (Dip or Inclination) అందురు. ఒక ప్రదేశ ము నందుందు అవపాతమును, దిక్పాతమును, భూ అయస్కాంతము యొక్క గాఢత (Intensity) ను ప్రదేశమందలి అయస్కాంత మూలకములందురు (Mag- netic Elements). నావికాదిక్సూచి ఉపయోగము, అయస్కాంతపు మూలకముల పరిజ్ఞానముపై సంపూర్ణ ముగ ఆధారపడియుండును. ఆ విషయజ్ఞానము కొరకు క్రమములేని గీతలతో పటములు వ్రాయబడి యున్నవి. ఆ గీతలసుబట్టి భూమిపై ఏయే ప్రదేశములలో ఒకే దిక్పాతముండునో తెలిసికొనవచ్చును. అట్టి గీతలు 'సమ వినత రేఖలు' (Isogonic lines) అని పిలువబడు చున్నవి. శాస్త్రజ్ఞునిచే 18 వ శతాబ్దములో ప్రతి దినము దిక్సూచి యొక్క దిక్పాతము ఆ అయస్కాంతోత్తర ధృవము భూమియొక 'పెద్ద ఆయస్కాంతమని చూపు ఊహాచిత్రము. ఈ భౌగోళిక అయస్కాంత క్షేత్రము భూమ్యు పరిభాగమున చాల ఎత్తువరకు వ్యాపించి యుండును, 298 "గౌసు' అను మారుచుండునని కనుగొనబడినది. ఇది దైనందిన మార్పు (Diurnal vari- ation) అని పిలువబడుచున్నది. ఈ అయస్కాంత మూలకములలో హఠా త్తుగాకూడా మార్పు సంభవించును; అట్టివి 'అయస్కాంతపు తుపానులు' (Magnetic Storms) ఆనిపిలువబడును, తరచుగా సంభవించునట్టి ఇట్టి మా ర్పులు వాతావరణ విద్యుత్ పరిస్థి తులు, సూర్యునియందలి మచ్చలు మొదలగు వానితో సంబంధించి యుండును. ఇట్టి క్లిష్టమగు విషయము లను గ్రహించుటకు గాను, రాత్రిం బవళ్ళు అయస్కాంత శక్తుల యొక్క