పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/358

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చుండెడిది. 3.(అనగా ఇనుము,ని కెలు, మణిశిల లేక కోబాల్టు.) 1845 సం. లో ఫారడే, వేరొక ఫలితము కొరకు ప్రయో గములు జరుపుచుండగా అయస్కాంత క్షేత్రమునందు ఉంచబడిన గాజు, ఇనుము కనబరుచుచున్నట్టి అయస్కాంత ధర్మములకు వ్యతి రేకముగా నుండు ధర్మములను చూపిం చుటను కనుగొనెను. బిస్మత్ అను లోహము కూడ ఎక్కువ బలముగా అట్టి ధర్మములనే ప్రదర్శించినది. అతడు ఘన, ద్రవ, వాయు స్థితులలో నుండు చాల పదా ర్థములను వానికి గల అయస్కాంత ధర్మములకై పరీ ఉంచి, అన్ని పదార్థములును మూలకములైనను సంయో గములైనను, ఇనుమువంటి లేక గాజువంటి అయస్కాం తత్వములు పొందియున్నవని వివరించుచు, అయస్కాంత రసాయన శాస్త్రమునకు పునాదివేసెను. అతడు ఈ క్రింది విధముగా వర్గీకరించెను. 1. ఇనుము, మణిశిల (కోబాల్టు), నికెలు స్ఫటము (అల్యూమినియం,)క్రుమము(క్రోమియం), పొటాసియం, సోడియం, మగ్నము(మగ్నీషియం), మాంగనము(మాంగ నీసు), తగరము, ఆమ్లజని మొదలగు పదార్థములను అయ స్కాంత క్షేత్రమునం దుంచిన, అవి క్షేత్రమునకు సమా నాంతరముగా నుండునట్లు ఏర్పాటగును. అట్టి పదార్థము లను ఏకాధిచుంబక (Paramagnetic) పదార్థములందురు. 2. సీసము, బంగారము, రజతము, కర్బనము, తామ్రము, గంధకము, అంజనము (ఆంటిమొని), బిస్మత్, నీరు మొదలగు పదార్థములు, అయస్కాంత క్షేత్రము నం దుంచబడినవుడు, క్షేత్రమునకు లంబముగా ఉండునట్లు ఏర్పాటుకావించుకొనును. (ప. 6) అట్టి పదార్థములను ఏకోనచుంబక (డయామాగ్నెటిక్) పదార్థములందురు. అట్టి పదార్థములు అయస్కాంతముచే వికర్షింపబడును. పేరామాగ్నటిక్ పదార్థములు అయస్కాంతముచేత ఆకర్షింపబడునవి. ఇనుము, కోబాల్టు, నికెలు మొదలగు పటము - 6. ఆయస్కాంతక్షేత్రమున ద్రవము నవి అయస్కాంతము చేత గాఢంగా ఆకర్షించబడును. అట్టి పదార్థములను ఫెర్రోమాగ్నటిక్ (ferromagnetic) పదా 38 297 అయస్కాంత శాస్త్రము ర్థములందురు. ఈ విధముగా ఫారడే, ప్రతి పదార్థమును ఏదోఒక రూపములో కొంచెముగనో, ఎక్కువగనో చుంబ పటము 7 -క్షేక ఇనుప కడియము వలన ఏకరూప 'ఒత్రము చెందుమార్పు కీయ పదార్థమని చూపించెను. అతడు ఇంకను డయా మాగ్నటిక్, పేరామాగ్నటిక్ పదార్థములు, వాటి అయ స్కాంతత్వమును, బయట నుండు క్షేత్రప్రభావము వలననే ఉంచుకొనగలవని నిర్ణయించెను. (ప.7) అయస్కాంతత్వవిషయములో అతి విజయవంతము లగు పరిశోధనలలో నొకటి, మేరీక్యూరీ భర్తయగు పీరీ క్యూరీ చేసినది గలదు. 1895 సం. లో అతడు అధిక సంఖ్యాకములగు పదార్థముల యొక్క అయస్కాంత గ్రహణ శక్తులను, ఉష్ణోగ్రతల వలన వానికి కలుగు మార్పును కొలిచెను. అతడు ఈ పనిని డయా, పేరా, ఫెర్రో మాగ్నటిక్ పదార్థముల పై ఉష్ణోగ్రతా ప్రభావము, వాటియందుండు అయస్కాంతత్వము మూడు రకములా లేక, భౌతికముగా ఒకేరకమా అనువిషయము నిర్పారణ చేయవలయు నను అభిప్రాయముతో ప్రారంభించేను. క్యూరి యొక్క ప్రాథమిక పరిశోధనలవలన ఈ విషయములు సిద్ధాంతీకరింపబడేను. క్రింది 1. డయామాగ్నటిక్ గ్రహణశక్తులు సామాన్యముగా ఉష్ణోగ్రత పైనను, అయస్కాంత క్షేత్ర బలము పైనను ఆధారపడియుండవు. 2. పేరామాగ్నటిక్ గ్రహణశక్తులు నిరపేక్షిక ఉష్ణో గ్రత (absolute temperature) తో వి లో మముగా నుండును. (దీనినే 'క్యూరీసూత్రము' అందురు.) 8. అధిక ఉష్ణోగ్రతలలో, ఫెర్రోమాగ్నటిక్ పదార్థ ములతో చేసిన ప్రయోగములవలన, అతడు, ప్రతి ఫెర్రో