పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/356

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్యుత్ప్రవాహపు బలమును వృద్ధిచేయుటచేతను, తీగ యొక్క చుట్లసంఖ్య పెంచుటచేతను, బలతరమైన విద్యుత్ క్షేత్రము కేంద్రమునందు ఉత్పత్తి చేయబడును. ఆ తీగ చుట్టలోనికి మెత్తటి ఇనుపముక్కను ప్రవేశ పెట్టినచో అది శక్తిమంతమగు తాత్కాలికాయస్కాంతముగా మారుమ. పదును చేయబడిన ఇనుప ముక్కలను గాని ఉక్కు ముక్కలనుగాని ఉంచిన, అవి అదేవిధముగా బల మైన శాశ్వతాయస్కాంతములుగా నగును. నవీన విద్యుత్ - విధానములయొక్క అవసరములను బట్టి విద్యుత్ శక్తి ఉత్పత్తికిని, ప్రచారమునకును సంబం ధించి ఇనుము యొక్క అయస్కాంత ప్రవర్తనములు జాగ్రత్తగా పరిశీలింపబడినవి. ప్రధానమగు లక్షణములను గూర్చి సంక్షేపముగా మాత్రమే ఇచట వివరింపబడును. విద్యుత్ ప్రవాహము, పొడుగైన నాళాథము (సాలి నాయుడు) ద్వారా ప్రవహించుచున్నదనుకొనుము. నాళాథము లోపలనుండు అయస్కాంత క్షేత్రము యొక్క బలము, ఆ తీగచుట్టల సంఖ్యలను విద్యుత్ప్రవా హపు విలువనుబట్టి తెలిసికొనవచ్చును. ఇనుపముక్క లేనపుడు ఆ అయస్కాంత క్షేత్రబలమును తెలుపుటకు సాధారణముగా H గుర్తుగా ఉపయోగించబడును. ఇది 0.4 mni కి సమానముగా నుండును. ('n' అనగా 1 సెంటి మీటరునందు తీగచుట్ల యొక్క సంఖ్య. i' అనగా విద్యుత్ ప్రవాహము విలువ అంపియరులలో) ఇప్పుడు ఒక ఇనుపముక్క నాళాథములోనికి ప్ర వేశ పెట్టబడినపుడు, అయస్కాంత క్షేత్రము వృద్ధిచెందినట్లు తెలియును. ఇనుప ముక్కగాని, మరి యే ఇతర అయస్కాంత పదార్థము యొక్క సమక్షమునగానీ అయస్కాంత క్షేత్రము యొక్క బలము, B చేత గుర్తింపబడును. ఇనుము సమక్ష ములో H కన్న B అధికముగా నుండును. B, H ల నిష్పత్తి ప్రవేశ్యత అని పిలువబడును. ఈ ప్రవేశ్యత, ఇనుము యొక్క స్వభావముపైనను, అయస్కాంత తే శక్తిపైనను ఆధారపడి మారుచుండునట్టి కారణరాశి. ప్రథమ క్షేత్రమగు H, 'అయస్కాంతీకరణ క్షేత్ర ' మనియు, రెండవదియగు B 'అయస్కాంత ప్రేరణము' అనియు పిలువబడుచున్నవి. అనగా, ఒక చదరపు సెంటి మీటరు వైశాల్య ప్రమాణముగల గాలి యందలి అయ 295 అయస్కాంత శాస్త్రము స్కాంతశక్తి రేఖల సంఖ్యను H గాను, ఒక్క చదరపు సెంటిమీటరు వైశాల్యముగల ఇనుము లేక మరి ఇతర అయస్కాంతపదార్థములోని అయస్కాంతపు శక్తి రేఖలు సంఖ్యను B గాను, వివరింపనగును. H పరిమాణముల సమమగు అయన్కాంత క్షేత్రమునందు ఒక పదార్థము పెట్టబడినపుడు, ఆ పదార్థము అయస్కాంత ప్రేరణము వలన, అయస్కాంతీకరణము చేయబడునని చూపింప నగును. పదార్థముగుండా పోవునట్టి అయస్కాంత శక్తి రేఖల మొత్తపు సంఖ్యను 'B' వలన తెలియనగును. B=H+4nI. I అయస్కాంతీక రణముయొక్క గాఢత్వము ను సూచించురాశి, (m అనునది అయస్కాంత ధ్రువము యొక్క శక్తిగాను, 1 అనునది అయస్కాంత ధ్రువముల మధ్యదూరముగాను తీసికొనిన, 'ml' అను గుణిజము అయస్కాంతబిభ్రమిష " (Magnetic moment) గా పరిగణించనగును.) పై సూత్ర మొత్తమును H చేత 64 విభజించిన B H AB ఎడల మనకు =1+4 H అను నిష్పత్తి ప్రవేశ్యత గాను, I అగును. H I H అను నిష్పత్తి గ్రహణశ క్తి 'K' గాను, పిలువబడుచున్నవి. అందువలన అయస్కాంతపు ప్రవేశ్యతకును గ్రహణశక్తికిని గల మధ్య సంబంధము = 1+47K గా నుండును. అయస్థాంత తటస్థస్థితిలోనుండు ఇనుమును, ఒక నారా భములో నుంచి, క్రమముగా సున్న నుండి విద్యుత్ ప్రవా హమును వృద్ధిచేసిన ఆ ఇనుము యొక్క అయస్కాంత క్షేత్రము క్రమముగా పెరుగుచుండును. B, H లకు గల విలువల తారతమ్యములను బట్టి కొన్ని చిత్రమైన ఫలిత ములు వచ్చును. B, H సంబంధమును చూపు గ్రాఫ్ చిత్రమును అయప్రాంతీకరణ లేఖ్యము అందురు (ప.4). H= సున్నగా నున్నవుడు, B సున్నగాను, H పెరుగు కొలది B విలువ తొలుత క్ర మేణ పెరుగుచు, తరువాత అతి త్వరితముగా వృద్ధియగు క్షేత్రముతో, విరివిగా కోబాల్టు (cobalt) కు 80 అగునంతవరకు పెరుగును. 80 వచ్చిన తరువాత, B యొక్క వృద్ధియందలి వేగము Hతో, త్వరితముగాను, కొలదిగాను పడిపోవుటకు ప్రారంభించి, అంతకంటె ఎక్కువ యగుటకు వీలులేనట్టి విలువను