పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/355

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయస్కాంత శాస్త్రము దిక్సూచి యొక్క స్థానము మార్చినచో అది చూపు దిశ కూడా మారుచుండును (ప. 1) అట్లు దానిని త్రిప్పు పటము 1. అయస్కాంతక్షేత్రము, అయస్కాంత శక్తి రేఖలు. N S= శ క్తిమంతమగు దండాయస్కాంతము N S= దిక్సూచియొక్క సూది ఉండు దిశ. శక్తిగల ప్రదేశమును 'అయస్కాంత క్షేత్రము' అందురు. ఆవిధముగా అయస్కాంతము చుట్టును అయస్కాంత క్షేత్రము ఉండును. దాని యొక్క గాఢత, వైశాల్యము, NS అను దండాయస్కాంతము యొక్క బలముపై ఆధారపడియుండును. స్వేచ్ఛగా తిరుగు అయస్కాంతపు సూది ప్రతిబిందువుదగ్గర తిరిగినదిక్కుగా గీతలను గీసినచో ఆ గీతలు ‘అయస్కాంత శక్తిరేఖ' లనబడును. ఈ గీతలు వాస్తవముగ లేనప్పటికి అవి నిజమైనవనియు, అవి కొన్ని ధర్మముల ములను కలిగియున్న వనియు ఊహించుకొనుట మంచిది. ఉత్తర ధ్రువమునుండి దక్షిణధ్రువము వైపు అవి ఎల్లప్పుడును వచ్చుచున్నట్లుగా ఊహింపబడుచున్నవి. ఆ రేఖలకు ఒక విధమగు బిగువు కలదనియు, అవి ఒక దానినొకటి వికర్షించు శక్తికలవనియు భావించుట అను కూలముగా నుండును. ఒక బిందువు దగ్గర ఉంచబడిన ప్రమాణ ధ్రువముపై గల శక్తి చర్యను, ఆ క్షేత్రమునకు లంబముగా ఉండు ఉపరితలముపై ఒక చదరపు సెంటి మీటరులో గీయబడిన రేఖల సంఖ్య వలన, కనుగొనుట ఆచారముగా నున్నది. ఒక ప్రమాణపు అయస్కాంత క్షేత్రమును, ఒక ప్రమాణధ్రువముపై దాదాపు ఒక మిల్లీగ్రాము బరువుగల ఒక 'డైను' శక్తి చూపునట్టి క్షేత్ర ముగా నిర్వచింతురు. నిత్యజీవితము నందలి ప్రయోగాత్మక విషయములలో అయస్కాంతపు చర్య యొక్క ప్రాముఖ్యము చాలవరకు 294 విద్యుత్ప్రవాహపు దృగ్విలాసముతో దానికిగల సన్నిహిత సంబంధమును బట్టి యున్నది. ఎట్టి పరిస్థితులలో నైనను, నిజముగా అయస్థాంత క్షేత్రము ఉత్పత్తి కాకుండ ఒక వాహ కమునందు విద్యుత్ప్రవాహమును ప్రవహింపచేయుట సాధ్యముకాదు. విద్యుత్ప్రవాహమును తీసికొనిపోవు పొడుగైన తిన్నని తీగలో అయస్కాంత రేఖలు వలయా కారముగ ఉండి, ఆవృత్తముల యొక్క కేంద్రములు తీగ యొక్క ఇరుసుపై పడుటయు, వాని సమతలములు దానికి లంబముగా నుండుటయు సంభవించును. (2) పటము 2. S విద్యుత్ప్రవాహముకల తీగను చుట్టియుండు అయస్కాంత క్షేత్రము, తరచుగా నాళాథము (solenoid) అని పిలువబడు తిన్నని స్తూపాకారములో చుట్టలుగా చుట్టబడిన తీగగుండా ప్రవాహమును పంపినపుడు, కడ్డీ అయస్కాంతముతో తయారైన క్షేత్రము యొక్క సాదృశ్యము కల క్షేత్రము ఉత్పత్తియగును. (స. 3) ఆ శక్తిరేఖలు పూర్తిగా గాలిలో నుండుటయు, ఇనుము యొక్క వింశధర్మములచే మార్చ బడకపోవుటయును మాత్రమే భేదము. పటము 8. దట్టముగా చుట్టబడిన నాకాభముయొక్క అయస్కాంత క్షేత్రము.