పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/354

ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోని భోజనశాలను బాగు చేయించుటకు దానము చేసి నట్లు ఒక శాసనమునల్ల తెలియవచ్చుచున్నది. అమ్మరాజు సామంతవర్గములోని వారైన భీముడు, నరవాహనుడు అను ప్రభుసోదరు లిరువురు విజయవాటిక అనుచోట రెండు జైనదేవాలయములు కట్టించినట్లును, ఆ దేవా లయముల పోషణార్ధము అమ్మరాజు ఇప్పటి తెనాలి తాలూకాలోనున్న పెద్దగా విడిపర్రు అను గ్రామమును దానము చేసినట్లును మరియొక శాసనమువల్ల తెలియ వచ్చుచున్నది. ఈ విధముగా తన రాజ్యములోని అన్ని మతముల వారిని సమానముగా ఆదరించి దేశము యొక్క సర్వతో ముఖాభివృద్ధికి సర్వదా పాటుబడుచు అమ్మ రాజ విజయా దిత్యుడు క్రీ. శ. 970 లో వీరస్వర్గమందెను. ఆర్. ఎన్. ఆర్. అయస్కాంత శాస్త్రము :- కొన్ని ఇనుప ముడి ఖనిజములయందు తొలుత కనుగొనబడిన ఒక వింతయగు గుణమును అయస్కాంతత్వ మందురు. క్రీ. పూ. 470సం. దాపులో, ఏషియామైనరు దేశములో నొక భాగమగు మాగ్నిషియా అను ప్రదేశములో 'మాగ్ని టైటు (స్కాంతాయితము) అను ఖనిజము కనుగొనబడినట్లు ఊహింపబడుచున్నది. స్వేచ్ఛగా వ్రేలాడతీయబడిన ఈ ఖనిజపు ముక్క. ఎల్లప్పుడును సామాన్య ఉత్తర దక్షిణ దిశలను చూపుచుండుట పరిశీలించిరి. ఒకేకొన ఎల్లప్పుడు ఉత్తర దిశను చూపుచుండుట వలన అది 'దిక్సూచిక శిల ' (Lode Stone) అని పిలువబడినది. ఉత్తర దక్షిణ దిశలను చూపుకొనలు 'ఉత్తర ధ్రువము' అనియు 'దక్షిణ ధ్రువము' అనియు పిలువబడుచున్నవి. ఈ విషయ మెప్పు డావిష్కరింపబడినదో చెప్పుట కష్టముకాని, 1800 సం.లో డాక్టర్ గిల్బరు అను వైద్య శాస్త్రజ్ఞుడు ప్రచురించిన డిమాగ్నెట్ (Demagnete) అను గ్రంథము ప్రాచీనగ్రంథ ములలో నుత్కృష్టమైనది. స్వాభావికముగా అయస్కాం తత్వము కలిగియుండనీ పదార్థములు, ఏదైన ప్రత్యేక విధానము వలన ఆధర్మమును పొందినచో అట్టి పదార్థము లను కృత్రిమఅయస్కాంతము లందురు, అయస్కాంతత్వము, ఇనుములో గాని, ఉక్కులో గాని వివిధ పద్ధతుల వలన ఉత్పత్తిచేయవచ్చును. ఉదా: 293 అయస్కాంత శాస్త్రము ఈ రెండు లోహపు కడ్డీలలో దేనినైనను శక్తిమంతమగు అయస్కాంతముతో రుద్దినపుడు, అది అయస్కాంతీకర ణము చేయబడును. ఒక ఇనుప ముక్కకు, విద్యుత్ప్రవా హము గలిగి విద్యుద్బంధముచేయబడిన తీగ చుట్టుటవలన దానిని అయస్కాంతముగా చేయవచ్చును. అప్పుడు ఇనుపముక్కను 'విద్యుదయస్కాంత' మందురు. పదార్థ ములు, అయస్కాంతీకరణము చేయబడినపుడు వానికిగల ప్రవేశ్యతను, అయస్తాంతత్వ ధారణ శక్తిని బట్టి అవి వివిధ ములుగా నుండును. ఉదా: మెత్తని ఇనుము ఎంత సులభ ముగా అయస్కాంతీకరణము నొందునో అంత సులభ ముగా దానిని కోల్పోవును. కొన్ని ఉక్కులు, అట్లుకాక అతి కష్టముతో అయస్కాంతీకరణము చేయబడి, ఆధర్మ మును చాల కాలము నిలువ బెట్టుకొనగలవు. అట్టి ఉక్కుతో తయారుచేయబడిన అయస్కాంతములు 'శాశ్వతాయ స్కాంతము'లని పిలువబడును. సామాన్యముగా అట్టివి కడ్డీరూపమున గాని, లేక గుఱ్ఱపునాడ ఆకారమున గాని, పట్టీరూపములో గాని చేయబడును. ఒక కడ్డీ అయస్కాం తము, ఇనుప రజములో ముంచబడినప్పుడు, దాని కొనల చుట్టును చాల ఇనుపరజము అంటుకొనును. కాని మధ్యభాగము నందు అట్లుగాక చాల కొద్ది అయస్కాంత చర్య మాత్రమే కనబడును. దీనిని బట్టి అయస్కాంతము యొక్క కొనలు ‘అయస్కాంత ధ్రువములు' అని నామ కరణము చేయబడినవి. అవి ఉత్తర దక్షిణ దిశలను చూపు టచే ఉత్తర దక్షిణ ధ్రువము అనియు పిలువ బడును. ప్రయోగముల ఫలితముగా ఈ క్రింది విషయములు తెలియును : 1. '1' పొడవుగల అయస్కాంతపు కడ్డీలో రెండు ధ్రువముల మధ్య దూరము దాదాపు శ్రీ / ఉండును. 2. సజాతి ధ్రువములు (రెండు ఉత్తర ధ్రువములు, మరియు రెండు దక్షిణ ధ్రువములు) ఒక దానిని ఇంకొకటి వికర్షించును. విజాతి ధ్రువములు (అనగా ఉత్తర దక్షిణ ధ్రువములు) ఒకదానిని ఇంకొకటి ఆకర్షించును. దిక్సూచిసూదివంటి అయస్కాంతీకరణము చేయబడిన వస్తువును ఒక శక్తిమంతమగు దండాయస్కాంతము దాపులో నుంచిన, 1 వ పటమునందువలె ఒక ప్రత్యేక దిశకు మరలును,