పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/353

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమ్మరాజ విజయాదిత్యుడు రా రాజ్యాధికారము వహించునప్పటికి అమ్మ వయస్సు 10, 12 సంవత్సరములు మాత్రమే. రాజ్య మునకు వచ్చిన వెంట నే ఇతనికి దాయాదియయిన రెండవ యుద్ధమల్లునితో పోరు ప్రారంభమాయెను. యుద్ధములో అమ్మరాజునకే విజయము లభించినది. కాని ఇంతలో అతని కష్టములు కడతేరలేదు. దేశములో బలవంతు లయిన సామంతులు పెక్కురు అమ్మరాజు యొక్క అధి పత్యమును నామమాత్రముగా మాత్రమే గుర్తించిరి. దాయాది మత్సరమువలన ప్రమాదముకూడ పూర్తిగ సమసిపోలేదు. రెండవ యుద్ధమల్లుని కుమారులైన బాద పుడు, రెండవ తైలపదేవుడు. అమ్మ రాజును పదచ్యుతుని చేయుటకు ప్రయత్నించిరి. వీరు అమ్మ రాజు సామంతు అయిన వారిలో కొందరను తమ పక్షమునకు త్రిప్పు మూడవ కొనిరి. అంతేకాక, రాష్ట్రకూట రాజయిన కృష్ణుని సహాయమును గూడ సంపాదించుకొనిరి. రాష్ట్ర కూట సైన్యములు వేంగీ సామ్రాజ్యములో అడుగు పెట్టగానే గండనారాయణునివంటి సామంతులును, పాండురంగనివంటి సేనానాయకులును అమ్మ రాజును విడిచి పారిపోయిరి. యుద్ధములో ఓడిపోయి ప్రాణము రక్షించుకొనుటకై అమ్మరాజు రాజ్యమును విడిచి పారి అమ్మరాజును రాజ్యమునుండి తరిమివేసిన తరువాత. బాదపుడు వేంగీ సింహాసనమును అధిష్ఠించెను. కొంత కాలము రాజ్యముచేసి బాదపుడు మృతినొందిన తరువాత అతని తమ్ముడు రెండవ తైలపదేవుడు విష్ణువర్ధనుడను బిరుదముతో రాజ్యమునకు వచ్చెను. తరువాత కొద్ది కాలమునకే అమ్మరాజు ప్రవాసమునుండి వెలువడి వేంగీ దేశములో ప్రవేశించెను. రాష్ట్రకూటులు వేంగి పై దండెత్తి వచ్చినప్పుడు అమ్మరాజును విడిచి పారిపోయిన సామంతులును సైన్యనాయకులును తిరిగివచ్చి అతని యండ చేరిరి. తైలపదేవుని ఓడించి అమ్మరాజు సింహాస నమును అధిష్ఠించెను, తరువాత కొంతకాలము ఒడు దొడుకులు లేకుండ అమ్మరాజు పరిపాలన సాగినది. క్రీ.శ. 955 లో రాష్ట్రకూటులు తిరిగి వేంగి పైకి దండెత్తి వచ్చిరి. యుద్ధములో ఓడిపోయి అమ్మరాజు కళింగదేశ మునకు పారిపోయెను, 292 అమ్మరాజును పారద్రోలి, అతని సవతి సోదరుడయిన దానార్ణవునకు రాజ్యము కట్టబెట్టి, రాష్ట్రకూట సైన్య ములు వేంగిని విడచి పోయెను. రాష్ట్రకూట రాజునకు సామంతుడుగా కప్పము చెల్లించుచు దానార్ణవుడు కొంత కాలము పరిపాలన సాగించెను. ఇంతలో కళింగము నుండి అమ్మరాజు, పైతృకమయిన సింహాసనము సంపా దించుటకు తిరిగి వేంగిలో ప్రవేశించెను. పోరువల్ల ప్రయో జనము లేదని తెలిసికొని దానార్ణవుడు అమ్మ రాజునకు రాజ్యమును వశపరచెను, అప్పటికిని అమ్మరాజు యొక్క కష్టములు కడ తేరలేదు. తరువాత కొంత కాలము ఒడు దొడుకులు లేకుండ పరిపాలన సాగినను ఆతని రాజ్యావ సానకాలములో తిరిగి అంతఃకలహములు చెలరేగెను. అంతవరకు అణగిమణిగి యుండిన దానార్ణవుడు తిరిగి విప్లవము లేవదీసెను. ఈ విప్లవము యుద్ధముగా పరిణ మించెను. తుదకు యుద్ధములో అమ్మరాజు మరణించెను. అమ్మరాజు తనతండ్రి సింహాసనము నధిష్టించి 25 సం॥రము లయ్యెను, ఒదు కొడుకులతో నిండిన అమ్మరాజు జీవితము ఈ విధముగా యుద్ధరంగములో సమాప్తమయ్యెను. అమ్మరాజ విజఁమాదిత్యుడు గొప్ప యోధుడు. దశత గల పరిపాలకుడు. పరమతసహనము కలవాడు. విధి ప్రాబల్యముచే యుద్ధములో ఓడిపోయి రెండుసార్లు రాజ్యము విడచి పారిపోవలసి వచ్చెను. కాని ఇందులకు కారణము పిరికితనము కాదు. అతని పరిపాలన సాగినంత కాలము దేశము సుభిక్షముగా నుండెను. అమ్మరాజు ఏ మతస్థుడయినది ఇదమిత్థమని నిర్ణయించుటకు తగిన ఆధా రములు లేవు. అతడు అన్ని మతస్థులను సమాసదృష్టితో ఆదరించెను. అటు హిందూమతమునకు చెందిన శాఖలలో ఆ కాలములో ముఖ్యమయిన కాలాముఖ శైవమునకును, ఇటు వివిధ జైనసంఘములకును సమానప్రతిపత్తి నిచ్చి ఇతడు ఆదరించెను. తన సామంతులలో ఒకడయిన దుగ్గ రాజు అనునతడు ధర్మపురికి దక్షిణమున కట్టించిన కటకా భరణ జినాలయమను జైనదేవాలయమునకు అమ్మ రాజు మలియంపూడి అను గ్రామమును సర్వకర పరిహారముగా దానము చేసెను. అమ్మ రాజు యొక్క భోగస్త్రీ అయిన "చామెక" అను వేళ్య కలుచుంబరు అను గ్రామమును సకల లోకాశ్రయ జినభవన మను జైన దేవాలయము