పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/352

ఈ పుటను అచ్చుదిద్దలేదు

58,82,162 వ్యవసాయ క్షేత్రము లున్నవి. 1952 లో వేల బుషెల్సులో ఇవ్వబడిన లెఖల ప్రకారము వ్యవసా యోత్పత్తి ఈ విధముగా ఈ విధముగా ఉన్నది. మొక్కజొన్న, 88.06,785; ఓటు ధాన్యము 12,68,280; గోధుమ 12,91.477; బంగాళాదుంపలు 8,47,051; బార్లీ 2,27,008; సోయా 2,91,682. ఇవి దేశము మొత్తము మీద అన్ని రాష్ట్రాలలో పండుచున్నవి. 2,82,83,26,000 పౌనులు పండినది. 1951 లో ప్రత్తి 151,44,000 బేళ్ళు పండినది. 1952 లో 18,864,667,000 డాలర్ల విలువగల పశువులున్నవి. పొగాకు అడవులు : అమెరికా సంయుక్త రాష్ట్రములలో 46,10,44,000 ఎకరాల అడవి ఉన్నది. అందులో నుండి ఏ డేటా 1,600,872,000,000 బోర్డు అడుగుల చెక్కను కో సెదరు. అందులో అన్నిరకాల కఱ్ఱలు ఉన్నవి. D ఖనిజములు : 1951 లో అమెరికాలో ఈక్రింద పరి మాణమున ఖనిజ ఉత్ప త్తి జరిగినది. ఇనుము 1159 లక్షల టన్నులు; వెండి 397 లక్షల ఔన్సులు; బంగారము 17 లక్షల 41 వేల ఔన్సులు; రాగి 9, 28, 329 టన్నులు; సీసము 3,88,148 టన్నులు; జింకు 8,71,525 టన్నులు బాక్సైటు 18,48.676 టన్నులు; పాదరసము 7,298 బుడ్లు ఉత్పత్తి చేయబడినవి. పరిశ్రమలు : 1950 లో అమెరికాలో 2,50,000 ఫ్యాక్టరీ లున్నవి. అందులో 1,17,68,058 మంది పని చేయుచున్నారు. 20 రకాల పరిశ్రమ విభాగాలు ఏర్పాటు చేయబడినవి. అందులో ఆహారపరిశ్రమ, పొగాకు, గుడ్డల నేత, కొయ్యపని, కాగితపు పరిశ్రమ, అచ్చుపనులు, రాసాయనిక పదార్థాలు, గాజుపనులు, యంత్రపు పనులు, రవాణా యంత్రసామగ్రి ఉన్నతస్థితిలో ఉన్నవి. ఇనుప పరిశ్రమ చాల గొప్పది. అమెరికా సంయుక్త రాష్ట్రాల కార్పొ రేషను ప్రపంచములో నెల్ల గొప్పసంస్థ. టినెస్సిలోయ సంఘము : ఇది అమెరికా కంతటికిని ముఖ్యమయిన ఆర్థికాభివృద్ధి ప్రణాళిక గలది. టి. వి. ఎ. అను పేరుగల సంస్థ. 1951 లో టివెస్సీ అనెడు నదికి 18 వ ఆనకట్ట పూర్తి చేసినారు. ఇప్పుడు దానికి 28 పెద్ద ఆనకట్ట లున్నవి. 680 మైళ్ల నీటి ప్రయాణ సౌకర్యము ఉన్నది. 600 మిలియన్ టన్నుల - మైళ్ల మోటారులు, 291 అమ్మరాజు విజయాదిత్యుడు ఇనుము, ఉక్కు, గోధుమ, మొక్కజొన్న, బొగ్గు, పెట్రోలియం మొదలయిన యితర సామగ్రి ప్రయాణము చేసినది. ఇందులో 1500 మిలియన్ కిలోవాట్ల విద్యు చ్ఛక్తి ఉత్పత్తి అయినది. దానిధర 1.35 సెంట్ల ఖరీదు ఉన్నది. ఈ లోయలో ఎరువులు ఉత్పత్తి. బ్రహ్మాండ మైనది. 1850లో ఈలోయ ప్రజల ఆదాయము 5 రెట్లు పెరిగినది. వర్తకవ్యాపారము : 1952 లో 15,642,415,000 డాలర్ల ఎగుమతులు - 10,358,255,000 డాలర్ల దిగు మతులు జరిగెను. ఎగుమతులలో ధాన్యాలు, ధాన్యపు వస్తువులు, వ్యవసాయ యంత్రసామగ్రి, పారిశ్రామిక యంత్రసామగ్రి, మోటారు యంత్రసామగ్రులు, ప్రత్తి, దానివస్తువులు చాల ముఖ్యమైనవి. దిగుమతులలో కాఫీ, ఇనుముజాతికి చెందని ఖనిజవస్తువులు, పెట్రోలియం వస్తువు, వార్తాపత్రిక లకాగితము, రబ్బరు, ఉన్ని ముఖ్య మైనవి. బ్రిటను ముఖ్యమైన వ్యాపారదేశము అయినను అమెరికా వ్యాపారము ఆసియాతో ఎక్కువ జరుగు చున్నది. తరువాత ఆఫ్రికాఖండము ఎన్నదగినది. అమెరి కాతో వ్యాపారముచేయని దేశము లేదని చెప్పవచ్చును. రహదారులు : 1952లో అమెరికా సంయుక్త రాష్ట్రా లలో 3,812,975 మైళ్ల రోడ్లున్నవి. అందులో 1,700,000 మైళ్ళ రోడ్లు సరిగా నిర్మింపబడిన ఉపరిభాగము కలిగి ఉన్నవి. 1950 లో 228,779 మైళ్ల రైలు మార్గము ఉన్నది. ప్రపంచములో అది నూటికి 29 వంతులున్నది. 1951 లో 88,545 విమానాలు వర్తకములో ఉన్నవి. డి. వి. కె. అమ్మరాజ విజయాదిత్యుడు (క్రీ. శ. 945- 970) :- క్రీ. శ. 325 నుండి సుమారు నాలుగు శతా బులకాలము ఆంధ్రదేశమును అతివైభవముతో పరి పాలించిన తూర్పు చాళుక్యవంశజులలో ప్రఖ్యాతిచెందిన వారిలో రెండవ అమ్మరాజు ఒకడు. ఈతడు రెండవ చాళుక్య భీమునకు లోకమాంబిక వలన జన్మించెను. క్రీ.శ. 845 లో తండ్రి మరణానంతరము తనకు అగ్రజుడును, సవతితల్లి కుమారుడును అయిన దానార్ణవుని త్రోసిపుచ్చి విజయాదిత్యు డను బిరుదువహించి అమ్మరాజు. వేంగి సింహాసనమును అధిష్ఠిం చెను.