పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/351

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా సంయుక్త రాష్ట్రములు (భూగోళము) ఎన్ను అది లేనిచో ఆసంధిచెల్ల నేరదు. అధ్యక్షుడుచేసెడు నియామ కాలను ఆమోదించవలసి ఉండును. దీని క్రింద నేడు 15 స్థాయీ సంఘాలు (Standing Committees) పనిచేయు చున్నవి. ప్రజాప్రతినిధిసభ (House of Representatives) కు ప్రతిరాష్ట్రము ఓటు చేయ నర్హతగల వారితో కొని ప్రతినిధులను రెండేండ్ల అధికార పరిమితితో పంపు కొనును. ఓటుచేయు అధికారాలు ఆయా రాష్ట్రాలలో వేరు వేరు విధముల నిర్వచింపబడి ఉన్నవి. 1952 లో అమెరికాలో 9కోట్ల 84లక్షల మంది ఓటర్లుగా నిర్ణయింప బడిరి. 1958-55 సంవత్సరాలకు ఎన్నుకోబడిన మొత్తము ప్రతినిధులు 485 గురు ఉన్నారు. శాసనసభలలో ఉన్న వారు ఉద్యోగములో ఉండకూడదు. 1924 సంవత్సర ములో ఇండియను లనబడు స్థానిక వాసు లందరికిని ఓటు హక్కు ఇయ్యబడినది. రాష్ట్రాలలో కూడ రెండు శాసన సభలు ఉన్నవి. వాటిని కూడ ఉన్నత సభ (నెనేటు) ప్రజాప్రతినిధిసభ (House of Representatives) అందురు. రాష్ట్రాలన్నియు కేంద్ర ఫెడరలు రాజ్యానికి కేటాయింప బడిన విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల మీద శాసనాధి కారము కలిగిఉండును. ప్రజలలో ఓటుచేసేడు వారందరు కలిసి గవర్నరును ఎన్నుకొందురు. వీరి అధి ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి ఉండును. సాంఘిక పరిస్థితులు : అమెరికాలో 1951 లో 38,489,54 గురు జన్మించినారు. 14,31,119 గురు మరణించినారు. 15,94,904 వివాహాలు జరిగినవి. అందులో 3,71,000 రద్దుఅయినవి. ఇప్పుడు 1000 కి జన్మించెడివారి సంఖ్య 245, మరణించెడువారి సంఖ్య 9.7 మాత్రమే. 1052 లో 2,65,520 మంది ఇతర దేశాల నుండి వచ్చి యిక్కడ ఉండిపోయినారు. పురుషులలో 1950 లో 100కి 29.2 మంది అవివాహితులున్నారు. స్త్రీలలో 19.8 మంది అవివాహితలు. అయినను నూటికి 66-2 మంది మాత్రమే సంసారము చేయుచున్నారు. 1940 లో 2,50,000 కు మించిన జనాభా గల పట్టణ ములు 87 ఉన్నవి. ఒక లక్ష జనాభాకు పైగా ఉన్నవి 55 ఉన్నవి. ప్రొటిస్టెంటు శాఖకు చెందిన క్రైస్తవులు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. విద్యాప్రచారము ఎక్కు 290 6 వగా ఉన్నది. 7 మొదలు 16 సంవత్సరాల బాలబాలికలకు చదువు నిర్బంధముగా నేర్పబడుచున్నది. 1951 లో 1859 కళాశాలలు పనిచేసినవి. ఇవిగాక వృత్తివిద్యలు వేర్పెడు పాఠశాలలున్నవి. విద్య యావత్తు రాష్ట్రము చేతులలో ఉండును. మత ప్రసక్తి తో కూడిన విద్యాలయా లకు ప్రభుత్వ విరాళాలు ఉండవు. అట్టి విద్యాలయాలలో 100 కి 10మంది చేరి ఉన్నారు. 1951 లో 1773 ఇంగ్లీషు దినపత్రిక లున్నవి. న్యాయస్థానాలు రాష్ట్ర సంబం సులు గాను, కేంద్ర ఫెడరలు సంబంధులుగాను ఉన్నవి. సర్వో న్నత న్యాయస్థానము కూడ ఉన్నది. అపీలు న్యాయ స్థానాలు 11 ఉన్నవి. 1951 లో 6,820 హత్యలు, 5,510 పొరపాటు హత్యలు, 115,801) మానథంగా, 52,090 దొంగతనాలు జరిగినవి. 1950 లో 2,09,040 మంది డాక్టర్లున్నారు. 1951లో 6,1597 ఆసుపత్రులున్నవి. సైన్యము : 1951 లో 15,61,219 మంది సై నికు

లున్నారు. 20 డివిజనులు, 18 రెజిమెంట్లు ఉన్నవి. పదాతి సైన్యము, వాయు విమాన సైన్యము, కవచ సైన్యము అను మూడు రకాల సైన్యము లున్నవి. నావీకా సైన్యములో 9,20,000 ఆఫీసర్లున్నారు. 1952 లో వాయువిమాన వాహని తరకలు ఆ పెద్దవి. 11 చిన్నవి, 5 ఇంకను చిన్నవి ఉన్నవి. 10 పంబడించు నౌకలు, 4 యుద్ధ నౌకలు, 15 బగువు ఓడలు, తేలిక ఓడలు 450 విధ్వంసక నౌకలు, 100 జలాంతర్గాములు, 880 ఇతర రకాల ఓడలు ఉన్నవి. 1951 లో * 7,87,000 మంది విమానబలములో ఉండిరి. సుమారు 16,800 విమానము లున్నవి. అర్థికపరిస్థితులు ; "ఫెడరలు ప్రభుత్వము 1953 లో 88,738 లక్షల డాలర్లు ఆదాయమును, 78,028 అడల డాలర్ల ఖర్చును కలిగి ఉన్నది. 48 రాష్ట్రాలు 28,083 లక్షల డాలర్ల ఆదాయమును కలిగి ఉన్నవి. ఆర్థిక సంపద: ప్రపంచములో భాగ్యవంతమయిన దేశాలన్నిటిలోను అగ్రగణ్యమయినది సంయుక్త రాష్ట్ర ప్రాంతము. 1950 లో 5,95,92,000 మంది కష్టపడి పనిచేయుచుండిరి. వ్యవసాయము : ఆధునిక పద్ధతులమీద చేసెడు వ్యవ సాయమువల్ల వ్యవసాయఫలితము అత్యధిక ముగా ఉన్నది