పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/350

ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధములో ముఖ్యముగా పసిఫిక్ మహాసముద్రము మీద జరిగిన పోరాటములో, మిత్రరాజ్యముల వారికి విజయము లభించుటకుఅమెరికా ముఖ్యకారణమయ్యెను. 1945 సెప్టెంబరులో యుద్ధము అంతమైన తరువాత అంతకు పూర్వము జరిగిన మిత్రరాజ్యములవారి సంప్ర దింపులలో అమెరి కా ప్రధానపాత్ర నిర్వహించెను. మొదటి ప్రపంచయుద్ధానంతరము అమెరికా అధ్యక్షుడు విల్సను కృషిఫలితముగ ప్రపంచములో శాంతి స్థాపన కొరకు ఏర్పడిన నానా రాజ్యసమితి స్థానములో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి స్థాపింపబడినది. ఈ సంస్థను స్థాపించు టలో ఉద్దేశము కూడ భవిష్యత్తులో యుద్ధములను అరి కట్టి ప్రపంచములో శాంతి భద్రతలను సుస్థిరము చేయు టయే. ఈ సమితి స్థాపన విషయములో కూడ అమెరికా ప్రముఖ పాత్రను వహించినది. - యుద్ధము ముగిసినప్పటినుండియు క్రమక్రమముగా అంతర్జాతీయరంగములో అమెరికా ఒక విధమైన ఆదర్శ మునకు, రష్యా మరియొక ఆదర్శమునకు చిహ్నములై వైషమ్యమును పెంపొందించుకొనుచు వచ్చినవి. ఒక వైపున రష్యా తనకు అందుబాటులోనున్న రాష్ట్రముల లోను, ముఖ్యముగా యుద్ధములో నష్టపడిన రాష్ట్రముల లోను, కొన్ని శతాబ్దుల కాలము పాశ్చాత్యదేశముల సామ్రాజ్యవాద శృంఖలములలో బంధింపబడి యుండుట వలన ఆర్ధిక ముగాను, రాజకీయముగాను వెనుక బడియున్న రాష్ట్రములలోను సామ్యవాద సిద్ధాంతములను, నిర్మాణ విధానమును వ్యాపింప జేయుటకు ప్రయత్నము చేయు చుండగా, ఇంకొక వైపున అమెరికా ఇట్టి దేశముల కే కోట్లకొలది ద్రవ్యము సహాయముచేయుచు అవి కమ్యూ నిస్టుల వళము కాకుండునట్లును, తమ శక్తిపై తాము ఆధార పడియుండునట్లు చేయుటకును ప్రయత్నించు చున్నది. ఈ ప్రయత్నముల ఫలితము ఎట్లుండునో నిర్ణ యించు అధికారము భవిష్యత్తునకు మాత్రమేకలదు. ఆర్. ఎన్. ఆర్. అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము) : క్రీ. శ. 778వ సంవత్సరము జులై 4వ తారీఖున 18 రాష్ట్రాలు తమ స్వాతంత్ర్యమును ప్రకటించుకొనిన నాటి నుండి అ మెరి కా సంయు క్త రాష్ట్రాలు ఏర్పడి ఉత్తరఅ మెరి 37 289 అమెరికా సంయుక్త రాష్ట్రములు (భూగోళము) కాలో విశిష్ట స్థానమును ఆక్రమించి ఉన్నవి. క్రమ ముగా విశాలమై అది నేడు 43 రాష్ట్రాలతో కూడి ఉన్న వి. అలాస్కా, హవాయ్, పోర్టోరికో మొదలైన పరిసర ప్రాంతాలు కూడ చేరిఉన్నవి. ఇవి సుమారు 30 లక్షల చదరపుమైళ్ల వైశాల్యము కలిగి ఉన్నవి. జనాభా 18XÌలో 15 కోట్ల 42ల కుల 33 వేలు ఉండెను. ఇందులో 12 కోట్ల 47 లక్షల 80 వేలమంది తెల్లజాతికి చెందినవారును, 1కోటి 50 లక్షల 42 వేల మంది నీగ్రోలును ఉన్నారు. అందు వలన నీగ్రోలు జాతిభేదముకలవా రగుటచే వారి సమస్యను అమెరికావారు శ్రద్ధతో పరిష్కరించుకొనుచున్నారు. పరిపాలన : అ మెరికా ప్రజాస్వామ్య దేశము. అధ్యముని పరిపాలనలో ఉండును. 1787 లో ఏర్పడిన రాజ్యాంగ చట్టము ఈనాటివరకు ఎన్నో సవరణలను పొందుచు పరి పాలనను అభివృద్ధి చేయుచున్నది. రాజ్యపాలనాధికారము అధ్యక్షుని చేతిలో ఉండును. ఈయనను, ఉపాధ్యముని, ప్రతి రాష్ట్రములోను శాసనసభ్యుల సంఖ్యకు సమానమైన ఓటర్లు ఎన్నుకొందురు, జాతీయపతాకములో 48రాష్ట్రాల గుర్తులు ఇమిడ్చినారు. అది 7 ఎర్ర గీతలు, 6 తెల్లగీతలతో కూడిఉన్నది. 1814 లో యఫ్.యస్.కి. రచించిన జాతీయ గీతము అవలంబించినారు. అధ్యక్షుడు కాక మిగతావారు కార్యదర్శులని పిలువబడుచున్నారు. రాష్ట్ర కార్యదర్శి (Secretary of State), కోశ కార్యదర్శి (Secretary of the Treasury), రక్షణకార్యదర్శి (Secretary of Defence) పోస్టుమాస్టరు - జనరల్, అటార్నీ జనరల్, ఆంతరంగిక కార్యదర్శి (Secretary of the Interior), వ్యవసాయ కార్యదర్శి (Secretary of Agriculture), వ్యాపార కార్యదర్శి (Secretary of Commerce), కార్మిక కార్య 8505 దర్శి (Secretary of Labour) మొదలైన వారితో కూడిన మంత్రాంగము (Cabinet) ఉండును. శాసనాధికారము కాంగ్రెసు అను సంస్థ చేతిలో ఉన్నది. ఇందులో ఉన్నత నభ (సెనేటు), ప్రజాప్రతినిధి సభ (House of Repre sentatives) అను రెండు సభలున్నవి. సెనేటులో ప్రతి రాష్ట్రమునకు ఇద్దరు ప్రతినిధులుందురు. వారు 8 సం.లు అధికారములో ఉందురు. శాసనములు చేసే అధికార ముతోపాటు, అధ్యక్షుడు ఇతర దేశాలతో చేసికొనెడు అన్ని ఒడంబడికలను 2/8 వంతు ఓట్లతో ఆమోదించవలేను.