పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/349

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా సంయుక్తరాష్ట్రములు (చరిత్ర) చేర్చెను. దక్షిణ రాష్ట్రములు క్రమక్రమముగా సమా ఖ్యలో తిరిగి చేర్చుకొనబడినను, బానిసల విషయములో కొన్ని భేదములను పాటించుచునే వచ్చెను. దీనికి ప్రతీకా కా రముగా కాంగ్రెస్, రాజ్యాంగ ప్రణాళికను మరియొక సారి సవరణచేసి సమాఖ్య అధికారములోనున్న భూభాగ ములో పుట్టినవారందరికిని, చిరకాలముగా నివసించు చున్న వారందరికినికూడా సమాఖ్యలోను, ఆయా రాష్ట్ర ములలోను కూడ వర్తించు పౌరసత్వమును ఇచ్చెను. క్రీ.శ. 1870 లో మరియొక సవరణద్వారా జాతివర్ణ విభేద ములు పురస్కరించుకొని పౌరులెవ్వరికిని ఓటింగు హక్కు నిరాకరింపబడకూడదని కాంగ్రెసు తీర్మానించెను. దీనితో నీగ్రోలకు తెల్ల వారిలో సాంఘికముగను, రాజకీయము గను, శాస్త్రరీత్యా సమానత్వము ప్రాప్తించెను. సమానత్వము వాస్తవముగా కూడ వర్తించునట్లు చేయు టకై అప్పటినుండి ప్రయత్నములు జరుగుచున్నవి. ఈ మువరకు అంతర్యుద్ధము నుండి మొదటి ప్రపంచయుద్ధము గల మధ్యకాలములో అమెరికా సంయుక్త రాష్ట్రములు చాల అభివృద్ధిచెందెను. ఈ కాలములో అనేక క్రొత్త యంత్రములు, పద్ధతులుకనీ పెట్టబడి వస్తూత్పాదన బాగుగ ఈఅభివృద్ధి చెందెను. ఆ కారణముగ పరిశ్రమలు, వాణి జ్యము అభివృద్ధిచెందెను. ఈ అభివృద్ధికి ముఖ్య కేంద్రము లైన నగరములుకూడ నంఖ్యలోను, సంపదలోను చాల వృద్ధిపొం దెను. అదేవిధముగ సాగుబడిలో నున్న భూమి కూడ రెండు రెట్లు ఎక్కువయ్యెను. వంట ఆరురెట్లు పెరిగినది. రాష్ట్ర పరిమితి పడమటి సముద్రము వరకు వ్యాపించెను. ఈ మార్పుల ఫలితముగా పరిస్థితులు తారుమారై అన్యోన్య సంబంధములను సంస్కరించ వలసిన అవసర మేర్పడెను. ఈ సంస్కరణోద్యమమునకు పురోగమవాభి లాషులైన అమెరికా అధ్యక్షుడురూజు వెట్టు మొదలయినవారు దోహదమిచ్చిరి. ఇది ఇట్లుండగా క్యూబా ద్వీపమును గురించి అమెరికాకు స్పెయినుతో యుద్ధము తటస్థించెను. ఇందులో అమెరికా విజయము పొంది తత్ఫలితముగా క్యూబా, పోర్టోరికో, గువమ్, ఫిలిప్పైన్స్లను సంపాదించెను. మొదటి ప్రపంచయుద్ధము క్రీ.శ. 1914 లో ప్రారంభ మైనప్పుడు అమెరికా దీనిలో దిగుటకు సంసిద్ధముగను, . సుముఖముగను లేకుండెను. కాని జర్మనులు విచక్షణ లేకుండ సాగించిన నిర్దాక్షిణ్యయుతమైన జలాంతర్గాముల యుద్ధము తటస్థ రాష్ట్రములకు కూడ అపారనష్టము కలి గించుటతో జర్మనుల ఆగడములను అరికట్టు నిమి త్తము, అమెరికా యుద్ధములో దిగవలసివచ్చెను. దిగిన తరువాత జర్మనీయొక్క ప్రతికూల రాష్ట్రములకు విజయము లభించు టకు ఈదేశము తీవ్రకృషి చేసెను. దీనికి ఫలితముగా యుద్ధా నంతరము జరిగిన సంప్రదింపులలో అమెరికాకు ప్రముఖ స్థానము లభించెను. భవిష్యత్తునందు ప్రపంచ శాంతిభద్ర తలను సుస్థిరముచేయు నుద్దేశముతో స్థాపించబడిన నానా రాజ్య సమితి, అమెరికా అధ్యక్షుడైన విల్సను యొక్క ప్రత్యేక కృషికి ఫలితము. అయినప్పటికిని అమెరికా క్రమక్రమముగా అంతర్జాతీయ రాజకీయములనుండి తొలగి తన దృష్టిని తన అభివృద్ధిమీదనే కేంద్రీకరిం చెను. 288 యుద్ధానంతరము దశాబ్దుల కాలము అమెరికాఅభివృద్ధి కరముగానే సాగెను. వాణిజ్యములో, పరిశ్రమలలో, వ్యవసాయములో పెక్కు మార్పులు వచ్చి ఉత్పత్తి చాల అభివృద్ధిచెం దెను. క్రీ.శ. 1980 లో ప్రపంచమంతట వ్యాపిం చిన ఆర్థికమాంద్యము వలన అమెరికా కూడ చాల నష్ట పడెను. తరువాత రూజు వెల్టు అధ్యక్షత క్రింద బహు ముఖమైన సంస్కరణ కలాపము జరిగెను. దీనికి ఫలిత ముగా అమెరికా సంయు క్తశాష్ట్రముల ఆర్థిక స్థితిగతులు చక్కబడినవి. ఇంతవరకు అంతర్జాతీయ రాజకీయములతో తన కేమియు సంబంధము లేనట్లుగా నున్న అమెరికాను ఇప్పుడు తిరిగి విదేశాంగ నీతి ఎక్కువగా ఆకర్షించినది. దీనికి కారణము జర్మనీ, ఇటలీ, జపాను దేశముల నియం తృత్వములు విదేశాంగ విధానము వలన ప్రపంచ శాంతి భద్రతలకు ప్రమాదము కలిగించు పరిస్థితి ఏర్పడుట యే, ఐరోపాలో జర్మనీ ఇటలీల ఆధ్వర్యవమునను, ఆసియా లో జపాను ఆధ్వర్యవమునను ప్రబలిన నియంతృత్వ విధానము, వీని విదేశాంగ విధానమునకు ఫలితముగ సంభవించిన రెండవ ప్రపంచయుద్ధము మొదట అమెరికా దృష్టి నంతగా ఆకర్షించలేదు. కాని క్రీ.శ. 1940 జనవరి 7 వ తేది జపాను ఆసియాలోని అమెరికా సైన్య స్థావరము ముఖ్యమైన పెరల్ హార్బరుపై బాంబులు వేయు టతో అమెరికా యుద్ధములోనికి దిగవలసి వచ్చెను. ఈ లో