పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/348

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వృద్ధి, జాతీయాభివృద్ధి, స్త్రీ స్వాతంత్ర్యోద్యమ ప్రారం భము ఈ కాలములోనే జరిగెను. వ్యవసాయములోను, పరిశ్రమలలోను యంత్రములను ప్రవేశ పెట్టుటవలన దేశ మార్థికముగా అభివృద్ధిచెంది సామాన్య ప్రజల జీవితము సుఖకరముగా సాగజొచ్చెను. క్రీ. శ. 1812 వ సం॥ మొదలు 1852 వరకు గల మధ్యకాలములో అమెరికా సంయుక్త రాష్ట్రముల జనసంఖ్య 72 లక్షల నుండి 230 లక్షల వరకు పెరిగినది. వ్యవసాయ యోగ్యమయిన భూమి యూరపు ఖండమంత విస్తీర్ణతకు వృద్ధిచెందెను. ఇవి యన్నియు ఈ కాలములో అమెరికా రాష్ట్రము పొందిన అభివృద్ధిని సూచించుచున్నవి. యుద్ధకాలములో తటస్థ దేశముల హక్కులు, అధికార ములు ఈవిషయములపై కొన్ని భేదాభిప్రాయములు కలి గెను. ఈ కారణమువలన క్రీ. శ. 1812 లో ఇంగ్లండు అమెరికాల మధ్య ఒక యుద్ధము ప్రారంభమయ్యెను. ఈ యుద్ధము మూడు సంవత్సరముల కాలము జరిగెను. తుదకు క్రీ. శ. 1815లో అమెరికాకు విజయము లభించెను. ఈ యుద్ధఫలితముగా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజ లలో జాతీయ భావము, దేశభక్తి బాగుగా ప్రబలుటయే కాక అంతర్జాతీయ రంగములో అమెరికాకు కొంత ప్రాముఖ్యము లభించెను. క్రీ. శ. 1788 లో అమెరికా సంయుక్త రాష్ట్రములు స్వతంత్ర మైనప్పటినుండియు ఈ రాష్ట్రములకు దక్షిణ ముగానున్న లాటిన్ అమెరికన్ వలసలలోని ప్రజలలో కూడ స్వాతంత్ర్యకాంక్ష ప్రబలి విప్లవమునకు దారితీ సెను. .శ. 1824 సం॥ నాటికే లాటిన్ అమెరికాలోని వలసలు చాల భాగము స్వాతంత్ర్యము సంపాదించుకొనెను. వీరి స్వాతంత్ర్యమును అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము గుర్తించెను. ఇది ఇట్లుండగా యూరపులో రష్యా, ఆస్ట్రియా మొదలైన కొన్ని సామ్రాజ్యవాద రాజ్యములు కలిసి హోలీ ఎలయన్స్ (Holy Alliance) అను పేరుతో క్రీ.శ. 1815 లో ఒక సంస్థను స్థాపించెను. ఈ సంస్థను స్థాపించుటలో ముఖ్యమగు ఉద్దేశము అభ్యుదయ శ క్తులను అణగద్రొక్కి అభివృద్ధి నిరోధక సామ్రాజ్యవాద తత్త్వమును సుస్థిరము చేయుటయే. ఈ సంస్థ లాటిన్ అమెరికా విషయములలో జోక్యము కలిగించుకొని 287 అమెరికా సంయుక్తరాష్ట్రములు (చరిత్ర) అచ్చటి స్వాతంత్రోద్యమములను అణగద్రొక్కుటకు ప్రయత్నములు చేసెను. ఈ ప్రయత్నములను ప్రతిఘటిం చుచు అప్పటి అమెరికా సంయుక్త రాష్ట్రముల అధ్యక డుగానున్న జేమ్సుమన్ ఒక సిద్ధాంతమును ప్రతిపా దించెను. ఈ మన్రో సిద్ధాంతము జాతుల స్వయం నిర్ణ యాధికారము, ఒక దేశము ఇతర దేశముల వ్యవహార ములలో జోక్యము కలిగించుకొనకుండుట. మొదలైన కొన్ని ముఖ్య సూత్రములను, పునరుద్ఘాటించెను. ఈ మన్రో సిద్ధాంతమే అమెరికా సంయుక్త రాష్ట్రముల విదేశాంగ నీతికి పునాదిగా పరిణమించినది. ఈవిధముగా క్రీ. శ. 19 వ శతాబ్ది మధ్యకాలమునకు అమెరికా రాష్ట్రములలో పై చూపులకు సర్వతోముఖాభి వృద్ధి కానిపించినను రాష్ట్రము లోలోపల విభేదములు బయలు దేరెను. వ్యవసాయ ప్రధానమై, బానిసవృ త్తిని అమలుపరచు దక్షిణరాష్ట్రమునకును, పరిశ్రమలు ప్రధాన ముగా కలిగి బానిసత్వము నిషేధించు ఉత్తర రాష్ట్రముల కును నావాటికిని వై షమ్యము ప్రబలసాగెను. దీని ఫలిత ములు సమ కాలిక రాజకీయములలో కూడ కనిపింపసాగెను. రిపబ్లికన్ పార్టీ అను పేరిట ఒక రాజకీయపక్షము బయలు దేరి బానిసత్వమును నిర్మూలించవలెనని ఆందోళనము ప్రారం భించెను. బానిసల దుర్భరజీవితమును చిత్రించుచు 'అంకుల్ టామ్స్ కాబిన్' వంటి పుస్తకము' లి యాందోళనమునకు చాల దోహద మొసంగెను. బానిసతనమును నిర్మూలింప బూనిన ఈఉద్యమమునకు అబ్రహాంలింకను నాయకత్వము వహించి, బానిసల పాలిటి దైవముగా ప్రసిధ్ధికెక్కెను. క్రీ.శ.1861 సంవత్సరములో లింకను అమెరికా సంయుక్త రాష్ట్రములకు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడుటలో, ఏడు దక్షిణ రాజ్యములు ఏకమై బానిసత్వ సమస్యను పురస్క రించుకొని తిరుగుబాటు చేసెను. ఇది ఒక యుద్ధముగా పరిణమించి, 4 సంవత్సరముల కాలము సాగెను. తుదకు బానిసత్వము ఉండకూడదను ఉత్తరరాష్ట్రములకు విజ యములభించుటతో ఈ అంతర్యుద్ధము సమాప్తమయ్యెను. యుద్ధము సాగుచుండగనే క్రీ. శ. 1888 లో లింకను బానిసత్వమును నిర్మూలించు ఒక ప్రకటనచేసెను. యుద్ధా నంతరము అమెరికా కాంగ్రెమ 18 వ సవరణ ద్వారా యీ బానిసత్వ నిర్మూలనమును రాజ్యాంగ ప్రణాళికలో