పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/345

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా ఖండము - 2 దక్షిణము (భూగోళము) ట్రినిడాడు దీవిలో విలువగల నూనెగనులు వెనూజులాలో మకరైబో నూనెగనులు కలవు. కొలంబియా యందలి పర్వతభాగములలో నూనెగనులు లభించు ప్రదేశములు కలవు. అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత ప్రాంతములలో ఇటీవల ఏర్పడిన నూనెగను లున్నవి. నెరూ దేశమందలి ఉత్తల పసిఫిక్ తీరమండలమున నూనెగనులు కలవు. బొలి వియాలోని మాంటనా పర్వతములలో నూనెగను లున్నవి. గయానా ఉన్నత భూములలో బంగారము, రత్నములు, బాక్సైటు లభించుతావులు కలవు. పెరూ దేశపు ఆండీస్ పర్వతప్రాంతమునను టిటికాకా లోయ లోను, పశ్చిమ బొలివియాలోను, వెండి, సీసము, బంగారము, రాగి, తగరము లభించును. అటకామా ఎడారిలో నత్రజము, అ యొ డిను, దొరకును. రాగి, వెండి వ్యవసాయమే ప్రధానముగా కలిగి ఖనిజోత్పత్తి యందు ప్రారంభదశయందున్న ఈ ఖండములో వాహక సౌకర్యములు చాలతక్కువ. సమశీతల మండలపు పచ్చిక బీడులయందలి వ్యవసాయపు పంటలను విదేశముల కెగు మతిచేయుటకై బాహియా, బ్లాంకా, బ్యూనస్, ఏయిర్స్ రేవులకు తీసికొనిపోవుటకై అర్జెంటినా దేశమున రైలు మార్గములు పెక్కులు నిర్మింపబడియున్నవి. ఇచ్చట నుండి ఊరుగ్వేదేశమునకును, జనసంఖ్య విశేషముగాగల బ్రెజిలు తూర్పుతీర ప్రాంతమునకు రైలుమార్గ సౌకర్యములు కలవు. ఈశాన్యముననున్న బ్రెజిలులో తీరప్రాంతములకు పోవు సౌకర్యములు అచ్చటి నదులు లోయలగుండా ఏర్పడు చున్నవి. అర్జెం పై నానుండి ఖండాంతర్గతమైన బొలీవియా దేశమునకును, అచ్చటినుండి చిలీలోని పసిఫిక్ రేవగు అరికా పట్టణమునకును, పెరూలోని పసిఫిక్ రేవగు మొలెండో పట్టణమునకును రైలుమార్గములు వేయబడి నవి. అర్జెంటీనానుండి మరి యొక రైలుమార్గము, ఆండీస్ లోని ఉప్పల్లటాక నుమ క్రిందచేయబడిన సొరంగము ద్వారా, చిలీలోనికి ప్రవేశించి వాల్పరయిఱో పట్టణ మునకు పోవుచున్నది. చిలీ దేశములో, పసిఫిక్ తీరము పొడవునను ఉత్తరపు సరిహద్దునుండి దక్షిణమున నున్న వాల్విడియావరకు రైలుమార్గముకలేదు. తక్కిన ప్రాంత ములలో నదులలోని స్టీమర్లపై మంచి ప్రయాణ సౌకర్య 284 ములు ఏర్పడియున్నవి. ఉత్తర అట్లాంటిక్ సముద్రము నుండి అమెజాన్ నది ఎగువన 1000 మై. దూరములో నున్న మన్నావోస్ పట్టణము వరకును స్టీమర్లు పోగలవు. అట్లే వెరానా పెరాగ్వేనదులు దాదాపు పెరాగ్వే దేశమువరకును చిన్న స్టీమర్ల ప్రయాణమునకు అను వుగా నున్నవి. దక్షిణ అ మెరికాఖండము ముఖ్యముగా వ్యవసా యోత్పత్తిని విదేశముల కెగుమతి చేసి వాటిస్థానే తయా రయిన వస్తువులను, యంత్రములను, దిగుమతి చేసికొను చున్నది, అందుచేత దీని విదేశపర్తకము, విశేషించి, అట్లాంటిక్ తీరస్థములయిన పారిశ్రామిక దేశములతోను, జర్మనీతోను జరుగు చున్నది. రాజకీయ విభాగములు :- అమెరికన్ ఇండియన్లు అని పిలువబడు పసుపురంగు జాతివారు, ఈ ఖండమునందలి ఈ ఆదిమనివాసులు. వీరిలో ఇన్కాసులను తెగవారు నాగర కులు. తక్కినవారు చొరరానిదట్టమైన అమెజాన్ అరణ్య ములందు నివసింతురు. ఆదిమనివాసుల సంఖ్య క్రమ ముగా సన్నగిల్లు చున్నది. తోటలలో పనిచేయువారు ఆఫ్రికానుండి తీసికొనిరాబడిన నీగ్రో బానిసలు. దక్షిణాఫ్రికాయందలి శ్వేతజాతులు, శతాబ్దముల క్రిందనే వలసవచ్చిన స్పెయిన్, పోర్చుగలు దేశీయుల సంతతివారు. వీరితరువాత ఇటీవలనే వలసవచ్చిన ఇటాలి యనులు, జర్మనులు, కొలదిమంది హిందూ దేశస్థులు చైనావారుకూడ ఇచ్చటకలరు. అందువలననే బ్రెజిలు దేశమునందు పోర్చుగీసు భాషయు, తక్కిన దేశములందు స్పానిష్ భాషయు మాట్లాడబడును. ఈ ఖండమును కనుగొని ఆక్రమించిన తరువాత 14, 15 వ శతాబ్దములలో పోర్చుగల్, స్పెయిన్ దేశ ములవారు ఈ ఖండమును తమమధ్య పంచుకొనిరి. ఇప్పటి బ్రెజిలు దేశము పోర్చుగల్ వాటాకును, తక్కిన భాగము స్పెయిను వాటాకును వచ్చెను. కాని 19 వ శతాబ్ది ఆరంభములో. వలసవచ్చిన ప్రజలు తమ మాతృ దేశములతో సంబంధమును తెంచుకొని తమ స్వతంత్ర ప్రజాప్రభుత్వమును ప్రకటించుకొనుచుండిరి. అయినప్ప టికీ ఈనాటికికూడ ఉత్తరముననున్న మూడు గయానా రాష్ట్రములు బ్రిటిష్, ఫ్రెంచి, డచ్చి, వలస రాష్ట్రము