పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/344

ఈ పుటను అచ్చుదిద్దలేదు

డును. వాయవ్యముననున్న కొలంబియా దేశపు పసిఫిక్ ప్రాంతమునను, పశ్చిమ పవనముల వలన దక్షిణ చిలీ దేశమునను, సంవత్సరమంతయు వర్షము తక్కిన బ్రెజిలు దేశమందును, ఉత్తరముననున్న దేశము లందును, ముఖ్యముగా వేసవిలోనే వర్షము పడును. ఉత్తర పసిఫిక్ తీరము ఆండీస్ పర్వతములకు పశ్చిమ మున వ్యాపార పవనములకు చాటున నున్నది. అందుచే నిది పొడిగనుండును. అందుచేత అటకామా (Atacama) ఎడారి యేర్పడెను. అదే విధమున పశ్చిమ పవనముల మార్గములో ఆండీస్ పర్వతముల చాటుననున్న ఖండపు దక్షిణ ప్రాంతము వర్షములేక ఎడారిగా నున్నది. దీనినే యెడారి యందురు. వాల్పరయిజో పట్టణమునకు దక్షిణముగా మధ్య చిలీ దేశములో కొంతభాగమున్నది. అది సూర్యాను గుణముగా శీత కాలములో నుత్తరముగా చలించు పశ్చిమ పవనములు కును వాటి వర్షపాతమునకును శీతకాలమున లోనగు చుండును. ఈ ప్రాంతమున మధ్యధరా శీతోష్ణస్థితి కని పించును. సహజ వృక్ష సంపదగాని, సహజమండలములుగాని, శీతోష్ణస్థితిపై ఆధారపడియుండును. అమెజాను పరీ వాహక ప్రాంతములయందును బ్రెజిలు తూర్పు తీరము నందును ఖండపు టుత్తర తీరములయందున సెల్వాస్ అని పిలువబడు ఉష్ణమండలారణ్యములు వ్యాపించి యున్నవి. అల్ప వర్షపాతముగల ప్రాంతములలో ఉష్ణ అల్పవర్షపాతముగలప్రాంతములలో మండలపు పచ్చిక బీడులు వ్యాపించి యున్నవి. వీటికే ఒరినాకో పరీవాహక ప్రాంతమున 'సవనా' లనియు, గయానా ఉన్నత ప్రాంతముల 'లానాలు అన్నియు, బ్రెజిలు ఉన్నత ప్రాంతముల 'కాంపోవ్' అనియు ప్రాంతీ యముగా పేర్లుగలవు, కాంపోసుకు దక్షిణముగా వెరానా- వెరుగ్వేనదీమండలములో సమశీతోష్ణ మండ లారణ్యములు గలవు. వీటికి దక్షిణముగా వెరానా - ఉరుగ్వే నదీముఖమండలముల చుట్టూ అర్జంటీనాలో పంపాస్ అని పిలువబడు మధ్య ఆక్షాంశపు పచ్చికబీడులు కలవు. దక్షిణచిలీలో సమశీతోష్ణమండల పత్ర విసర్జక (Deciduous) అరణ్యములు వ్యాపించి యున్నవి. దీనికి ఉత్తరమున మధ్య చిలీలో మధ్యధరా వృక్ష సంపద 289 అమెరికా ఖండము - 2 దక్షిణము (భూగోళము) కలదు. ఇంకను ఉత్తరముగా చిలీ పెరూ దేశపు పిసిఫిక్ తీరములు ఉష్ణమండలపు ఎడారులుగాను వక్షిణ అర్జం నాలో పెటగోనియా సమశీతలపు ఎడారిగాను ఉన్నవి. ఇవికాక ఆండీస్ పర్వతములలోని సహజవృడు సంపది శీతోష్ణస్థితి, దాని ఎత్తు, అందలి వర్షపాతము పీఠభూము లును నియమించుచుండును. ఉత్పత్తి ; దక్షిణ అమెరికా, వ్యవసాయము ముఖ్య ముగాగల ఖండము. వృత్తులనుబట్టి ఈ ఖండమును రెండు ప్రత్యేక ముండలములుగా విభజించవచ్చును. విరివిగా ఖనిజములను కలిగిన ఆండీస్ పర్వతములు, తూర్పుననున్ని ఉన్నతభూములు ఒక భాగము; వ్యవసాయము, వ్యవసాయపరిశ్రమలు ప్రధానముగా గల అట్లాంటిక్ తీరప్రాంతములు, పెరానా పెరాగ్వే నదీమండలము, పసిఫిక్ తీరపు మధ్యధరా మండలము మరియొక భాగము. దక్షిణ అమెరికాలో పెక్కు ప్రాంతములు జన సమ్మర్దము లేనివి. ఈ క్రింది ప్రాంతములు ఖండమున అక్కడక్కడ చెదరియున్నవి. వ్యవసాయము గాని గనుల త్రవ్వుటగాని అందలి జనుల వృత్తులు, ఆండీస్ పర్వతపు లోయలలోను, పీఠభూములలోను, వెనుజులా దేశములోను, కొలంబియాలోని పర్వత భాగ ములలోను కాఫీ, మొక్కజొన్న పండును. కొలంబియా యందలి కాకా, మాగ్డలీనా నదుల లోయలలో కోకో, చెరకు, ప్రత్తి, అరటిపండ్లు పండును. గయనాతీర భూములందు చెరకు, వరి పండును. బ్రెజిలు దేశపు తూర్పుతీరములలో ప్రత్తి, చెరకు, రబ్బరు, కాఫీ, పండును. దక్షిణ బ్రెజీలులో ఊరుగ్వే వంటియున్న ప్రాంతములలో పశుపోషణము జరుగును, వెరానా... ఐరాగ్వే నదీమండలముల యందలి ఉష్ణమండ లారణ్య ప్రాంతములలో, స్వల్పముగా ప్రత్తిపండును. అర్జెంటీనా లోని పంపాస్ ప్రాంతములో గోధుమ విరివిగాపండును. అచ్చట ధాన్యపు మరలు, మాంసమును టిన్నులలో నమర్చు కార్ఖానాలు, నూలు వస్త్రముల మిల్లులు కలవు. అర్జెంటీనాలోని పంపాసకు పశ్చిమప్రాంత మున చెరకును. ప్రత్తిని, పొగాకును, జనపనారను పండింతురు. వ్యవ సాయ పరిశ్రమలు ఉరుగ్వేలోను, పెరాగ్వేలోను కలవు. చెరకు, ప్రత్తి, వెరూ దేశపు పసిఫిక్ తీరమునందలి వంటలు.