పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/342

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికాఖండము-2దక్షిణము (భూగోళము): దక్షిణ అమెరికా ఖండము ఉత్తరమున వెడల్పుగాను, దక్షిణమున సన్నముగాను, మేకుకొనవలెనున్నది. ఇది 70 లక్షల చ. మై. వై శాల్యముకలిగి ఇండియాకన్నను 54 రెట్లు పెద్దదిగానున్నది. పుదుచ్చేరియున్న అంశము పైన దీని ఉత్త రపుఅంచు, 55 దక్షిణ అక్షాంశముపైన దీని దక్షి ణపు కొన ఉన్నవి. ఉత్తర అమెరికా సరస్సుల యొక్క తూర్పుఅంచులను తాకుచుపోవు 80° పశ్చిమ రేఖాంశము పై ఈ ఖండపు పశ్చిమపు అంచును, తూర్పు గ్రీన్లాండు గుండాపోవు 35° పశ్చిమ రేఖాంశముపై దీని తూర్పు అంచును కలవు. భూమధ్య రేఖ దాదాపు మెజాన్ నదీముఖ ద్వారమునంటి పోవుచున్నది. ఈ ఖండము యొక్క ఎక్కువభాగము ఉష్ణమండలములోనున్నది. కొద్దిభాగము మాత్రము భూమధ్య రేఖకు ఉత్తరముననున్నను, ఖండము దక్షిణార్ధగోళమున కుచెందినది. ఈ గోళములో నున్న భూభాగము లన్నింటికంటే ఈ ఖండమే ఎక్కువ దక్షిణమునకు వ్యాపించియున్నది. ఈ ఖండములోని పెంటాఎరినాస్ (Penta Arinas) అను పట్టణము దక్షి ణార్ధగోళములో నన్నిటికంటె మిక్కిలి దక్షిణమున నున్నది. ఈ నైసర్గిక స్వరూపము : దక్షిణ అమెరికా యొక్క నై సర్గిక స్వరూపము శీతోష్ణస్థితులు, సులభగ్రాహ్యములు. ఆండీస్ పర్వత పంక్తి పశ్చిమతీరమునంతయు 5000 మైళ్లు వ్యాపించియున్నది. ఇందు చిందిరోజో, కొటో పాక్సివంటి అగ్నిపర్వతములును ఎత్తైన పీఠభూములును, సరస్సును కలవు. ఇది మడతలుగానుండును. భూగర్భ శాస్త్రజ్ఞులు ఇది ఇటీవలెనే ఉద్భవించినదందురు. పసిఫిక్ తీర పర్వతపంక్తి చిన్నది. ఇది దక్షిణ చిలీ దేశ మునందలి శిలాద్వీపములలో నంతమగుచున్నది. ఖండమునకు ఈశాన్య భాగమున నున్న బ్రెజిలుగయానా ఉన్న త భూములు ఆండీస్ పర్వతములకంటేను మిక్కిలి పూర్వము ఉత్పన్నమైనవి. ఇవి మిక్కిలి కఠినమైన పురా తన శిలలతో నిర్మితమైనవి. పై రెండింటికిని మధ్య ఉత్తర దక్షిణములుగా, వ్యాపించియున్న మైదానములు మరి యొక విభాగము. ఈ మైదానములను తిరిగి ఒరినాకో. అమెజాన్, పేరానా— పెరాగ్వేనదీపరీవాహక మైదాన 36 281 పీఠభూమి పశ్చిమతీరముననే ఉండుట అమెరికా ఖండము – 2 దక్షిణము (భూగోళము) ములుగా విభజించవచ్చును. వాయవ్యమున కాకా— మాగ్డలీ నా నదీప్రాంతములుకూడ మైదానములే. ఖండపు దక్షిణపు కొననున్న పెటగోనియా ఎడారి ప్రాంతము. ఇదిగాక పసిఫిక్ తీరము నంటియున్న సన్నని తీరపు మైదానము మరియొక విభాగము. ఆండీస్ పర్వతములు వలనను, వర్షమునిచ్చుపవనములు తూర్పుననుండి వీచుట వలనను, ఖండము వెడల్పునను ప్రవహించి ఏకరీతి నదు లన్నియు అట్లాంటిక్ మహాసముద్రమును చేరును. ఇది దక్షిణ అమెరికా యొక్క విశేష లక్షణము. గయానా బ్రెజిలు ఉన్నతభూములు ప్రాంతములుగానున్నవి. నదులు లేవు. నదీమైదానములకు విభజన పసిఫిక్ తీరమున చెప్పదగిన రోష్ణస్థితి - సహజవృక్ష సంపద: పైన పేర్కొన్న విధమున ఆండిస్ పర్వతముల యునికియు, ఖండము చాల భాగము ఉష్ణమండలమున నుండుటయు శీతోష్ణస్థితి పైనను, వర్షపాతముపైనను, ప్రాబల్యమును వహించు చున్నవి. జూలై నెల, అనగా దక్షిణార్ధ గోళపు శీత కాలములో ఈ ఖండపు ఉత్తర భాగము వేడిగా నుండి దక్షిణమునకు పోయినకొలది క్రమముగా వేడిమి తగ్గు చుండును. పర్వతములలోను ఉన్నత భూములలోను ప్రాంతీయ శీతలము వ్యాపించి యుండును. జనవరి నేల అనగా దక్షిణార్ధ గోళపు వేసవిలో ఉష్ణమండలము దక్షిణముగా మధ్య బ్రెజిలు యొక్క పల్లపు ప్రాంతము లకు జరుగును. కాని దావుననేయున్న ఉన్నత భూముల యందు ఆండీస్ పర్వత ప్రాంతములయందు శీతము し కనిపించును. రెండు కాలములయందును పెరూ శీతల జరి నిరంతరము ప్రవాహము వలన పశ్చిమతీరము చల్లగాను, బ్రెజిలు ఉష్ణజల ప్రవాహము వలన తూర్పు తీరము వెచ్చగాను ఉండును. వీచు ఈశాన్య ఆగ్నేయ వ్యాపార పవనములు ప్రధానమైనవి. ఇవి ఆండీస్ పర్వతముల ప్రతిబంధకముచే అమెజాన్ వరీ వాహక ప్రదేశమునకును, తూర్పు ఉన్నత భూముల ప్రతిబంధకముచే అట్లాంటిక్ తీరమునకును, బ్రెజిలు ఆగ్నేయ భాగమునకును సంవత్సరము పొడుగునను వర్షము నిచ్చును. ప్రాంతీయ ఋతుపవనముల వలన