పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/341

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా ఖండము - ఉత్తరము (భూగోళము) 6. పడమటి ఇండియా ద్వీపములలో (అ) క్యూబా ప్రజాస్వామ్యము. (అ) రెండు నీగ్రో ప్రజాస్వామ్యముల నడుమ విభక్తమైన హిస్పానియోలా. (ఇ) బ్రిటిషు (జనతారాజ్యము) నకు చెందిన జమైకాయు ఇతర ద్వీపములు - చేరియున్నవి. అమెరికా వ్యాప్తి - ఆక్రమణములు: జాతీయ రాజ్య ప్రదేశవ్యాప్తి అమెరికా ప్రాథమిక చరిత్రలో స్థిరమైన పద్ధతిగా నుండెను. కొన్ని అపవాదములున్నను దీనికి ప్రకృతిశక్తులలో ముఖ్యమైన ఇతర సమస్యలు కారణ ములై ఉండెను. అంతరములైనట్టియు, వైదేశిక ములై నట్టియు కష్టములను ఎదుర్కొనుటయు, రాజకీయార్థిక సమస్యలును ఆకారణములని చెప్పవచ్చును. ఆ వ్యాప్తి బహుళ అపరిహార్యమై ఉండెను. ఆక్రమణపద్ధతి కృత కములైన కుట్రలకు కాక, వ్యవసాయమువలన శాంత జీవితమును సంపాదించు ప్రజల సహజమైన ఆర్థిక సాంఘికాభివృద్ధికి ఫలితముగా ఏర్పడెను. ఏదో యొక యూరపు రాజ్యము యొక్క ఆలోచనలను గురించిన భయమో, ఈర్ష్యయో ఆక్రమణ పద్ధతిపై అధిక మైన ప్రభావము ప్రదర్శించియుండెను. ఆక్రమణములు చాల మట్టుకు పాలనాధికారులతోడి సంప్రదింపులకో, యుద్ధము వలననో, అవసరము వలననో, భూమిని కొనుటకో ఫలితములై ఉండెను. ప్రతి ఆక్రమణమును స్వదేశీయ విదేశీయ వైరుద్ధ్యమునకును, సంకుఛితములైన భవిష్య దాలోచనలకును, తావొసంగెను. కాని కాలము గడచిన కొలదిని సింధుశాఖవరకును దూరమునందలి పసిఫిక్ వరకును వ్యాప్తిచెందుట దానికి ఎక్కు వపుష్టి చేకూర్చె నని నిరూపింపబడినది. వ్యాప్తి ఈ క్రింది పద్ధతుల ననుస రించి కొనసా గెను. (1) క్రీ. శ. 1808 లో నెపోలియనునుండి లూయి సియానాను. కొనుటవలన యూనియనుకు 1,171,981 చ. మై. వైశాల్యముగల ప్రదేశము చేకూరెను.. - (8) క్రీ., 1819-1821 లో ఫ్లోరిడా సంధివలన స్పెయినునుండి 59,288 చ. మైళ్ళ ప్రదేశము సంపా దింప బడెను,

(B) క్రీ.శ. 1845 లో, సమ్మతిమీద టెక్సాసు (976,188

చ.మై) చేర్చబడెను. (4) క్రీ. శ. 1847 లోని యుద్ధములో. న్యూమెక్సి కోయు, ఉత్తర కాలిఫోర్నియాయు (545788 చ.మై) మెక్సికోనుండి గ్రహింపబడి ఆక్రమింపబడెను. (5) క్రీ. శ. 1858 లో మెక్సికో ప్రభుత్వమునుండి గాడ్సడను కొనుటవలన దక్షిణ అరిజోనా న్యూమెక్సికో లలో (45,585 చ. మై.) ప్రదేశము సంపాదింపబడెను. (6) క్రీ.శ. 1867 లో రష్యానుండి అలాస్కా (590,584 చ.మై) ప్రదేశము కొనబడెను. s (7) క్రీ. శ. 1898 లో హవాయి లిలియు కాలనీ ఆనునామెకు పరిహార మొసగి 6740 చ. మైళ్ళ వైశాల్యముగల పసిఫిక్ సముద్ర ద్వీపమైన హవాయి (Hawaii) ద్వీపము కలుపుకొన బడెను. (8) క్రీ. శ. 1888 లో స్పెయినుతో జరిగిన యుద్ధము నకు ఫలితముగా మొత్తము (150,000 చ. మైళ్ళ వైశా ల్యముగల పోర్టోరికో, ఫిలిప్పైన్ ద్వీపములు, లాడ్రోను ద్వీపములందలి గాము (Gaum) గ్రహింపబడినవి. (8) క్రీ. శ. 1899 లో గ్రేటు బ్రిటను జర్మనీలతో జరిగిన సంధివలన మొత్తము (54 చ. మైళ్ళు) వైశా ల్యముగల పామోను వర్గమునకు చెందిన ఔ, ఒన్సింగా ఓఘ అను చిన్న ద్వీపములతో గూడిన టుట్యులా (Tutuila) సంపాదింపబడెను. eng (10) క్రీ. శ. 1918 లో డెన్మార్కు నుండి వర్ణిను ద్వీపములు కొనబడినవి. (11) పైవానికి తోడు భిన్న కాలములందు పసిఫిక్ ద్వీపమునందలి అచ్చటచ్చటి అచ్చటచ్చటి ద్వీపములు ఆక్రమింప బడినవి. క్రీ. శ. 1908 లో జరిగిన హేవరిల్లా సంధివలన వేనామా ప్రజాస్వామ్యము, సంయుక్త రాష్ట్రములకు కెరీబియన్ తీరమునందలి కొలోనునుండి పసిఫిక్ తీరము నందలి పెనామా వరకుగల పదిమైళ్ళ వెడల్పుగల ప్రదేశ మును శాశ్వతముగా ఉపయోగించుకొను హక్కు ఒసర్ గేను. సంయుక్త రాష్ట్రములకు పోలీసు, న్యాయము మున్నగు ఇతర ప్రయోజనముల విషయమున ప్రత్యేకాధి కారము కలదు. కాలువ మధ్యస్థమై ప్రపంచ వాణిజ్యము నకు ఉపయోగించునదిగా నుండవలెను. జి. స. 280