పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/340

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలపవ్యాపారమే ప్రధానమైన వృత్తి. కెనడా తూర్పు పడమర తీరములకు కొలది దూరమున చేపలను పట్టు టకు తగిన ప్రదేశము లున్నవి. మెక్సికో ఉష్ణతీరము లందును మధ్య అమెరికా ప్రజాస్వామ్యము లందును చెరకు, రబ్బరు, పొగాకు, వనిల్లా (Vanilla), జనపనార మొదలగునవి పెంచబడును. సమశీతోష్ణ పర్వత ఓటము లందు కాఫీయు, విస్తారమైన మొక్కజొన్నయు పెరు గును, పీఠభూములందు ప్రత్తి, గోధుమ, మొక్కజొన్న పండును. ఇచ్చట గొజ్జెలును, పశువులును పెంచబడును. క్యూబా పోర్టోరికోలు చెరకును, పొగాకును, విస్తార ముగా పండించు ప్రదేశములు. జమైకా, చెరకునకును. బొంత అరటిపండ్లకును ప్రసిద్ధి, చిన్న ద్వీపములలో వివిధ ములయిన ఉష్ణమండలపు పంటలు పండును. అమెరికా ఖండములో అధికమైన ఖనిజసంపద కలదు. కెనడాలో ఖనిజములుగల ముఖ్యప్రదేశము పెద్ద సర స్సులకు ఉత్తరమున ఉన్నది. ప్రపంచమునందలి మొత్తము నికిల్, రాగి, లోహములలో శేవ వంతు ఇచ్చటనే ఉత్పత్తి అగుచున్నది. సుపీరియరు సరస్సు ఉత్తరతీరము అందును, క్విబెక్ లాబ్రడారు అందును విస్తృతములైన ఇనుప గనులు కలవు. పోర్క్యును, కర్కులాండు సరస్సుల ప్రాంతములలో వెండి, మణిశిల, బంగారము కలవు. ఇవిగాక పడమటి కార్డిలరా పార్శ్వములందు నూనెగను లున్నట్లు తలపబడుచున్నది. కెనడాయందలి ప్రయిరీల క్రింద పెద్ద బొగ్గుగనులున్నవి (1) అఫ్లాషి నా (2) దక్షిణ అప్లాషియన్ (8) ఇలినోయిన్ (4) కన్సాస్ (5) ఓకహామా పెన్సిల్వేనియాలు అమెరికా సంయుక్త రాష్ట్రములందలి ముఖ్యమైన బొగ్గుగనుల ప్రదేశములు. కాలిఫోర్నియా, ఖండ మధ్య రాష్ట్రములు, టెక్సాసు, ఉత్తర అప్గ్రేషియను, సింధుశాఖాతీరము, మెక్సికో యందలి పెంపికో మున్నగునవి నూనెను ఉత్పత్తిచేయు ముఖ్య కేంద్రములు. ఇనుము, బొగ్గులకుతోడు ప్రపం చమునందలి వెండిలో సగము భాగమును, విస్తారమైన రాగియును, మెక్సికోయందలి పీఠభూమి ప్రాంతములలో ఉత్పన్నమగును. అమెరికాలో పడమటి కార్డిల రాభాగ మందురాగి, జింకు, బంగారము, వెండి, సీసము మున్నగు ఖనిజములలో చాల భాగము ఉత్పన్నమగును, అప్లాషి 279 అమెరికా ఖండము - ఉత్తరము (భూగోళము) యను పర్వతములలో అల్యూమినము గనులు త్రవ్వబడు చున్నవి. మిన్నెసోటా, విస్కాన్సిన్ మిచిగాన్, అను ప్రదేశములందు ముఖ్యముగా ముతక ఇనుము కాన వచ్చుచున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములు అభ్ర కము, తగరము, మాంగనీసు, క్రోమియము, నికిలు, టంగ్ ను, సౌపిరము మున్నగు లోహములలో కొర వడి ఉన్నవనుట గమనింపవలసిన విషయము. قي కెనడాలో పెద్ద సరస్సులకును, సెంటులా రెన్సుకును, తూర్పు ప్రదేశమున జలశక్తి ఆధారములు అధికముగా తూర్పు,ప్రదేశమున పెంపొందింప బడుచున్నవి. అట్టివి కొన్ని అంటారియో నైరుతి భాగమున కూడ కలవు. అమెరికా సంయుక్త రాష్ట్రములందలి జలశ క్తి లో అధికభాగము ఉత్తర ఈశాన్య భాగములందును, అప్లాషి యను లందును, జలపాత పంక్తి యందును, టెన్నెసీయందును ఉత్పన్న మగుచున్నది. ప్రజలు - రాజకీయ విభాగములు : యూరోపియనులు రాకముందు అమెరికాలో ఎఱ్ఱుఇండియనులు నివసించు చుండిరి. వీరు దేశ ద్రిమ్మరులయి, వేటాడుచు ముఖ్యముగా యిరీలలో నివసించుచుండిరి. ఆజ్ చెక్కు లన బడు నాగరక ప్రజలు మెక్సికో యందును, మధ్యఅ మెరికా యందును నెలకొనియుండిరి. ప్రస్తుతము అమెరికా ఈ క్రింది దేశములుగా విభజింప బడి ఉన్నవి. 1. కెనడా: ఇది బ్రిటిషు కామను వెల్తునందలి భాగము. న్యూ ఫౌండులాండు లాబ్రడారులు కూడ ఇందులో కూడిఉన్నవి. ఇవి క్రీ. శ. 1949 లో ఇందు కలసినవి. 2. అమెరికా సంయుక్త రాష్ట్రములలో వాయవ్య మున అలాస్కాయు, పోర్టోరికోయు, పెనామాకాలువ ప్రదేశమును కలిసియున్న వి. 8. మెక్సికో ఒక ప్రజాస్వామ్య రాజ్యము. ఇది అమెరికా సంయు క్త రాష్ట్రములకు దక్షిణమున ఉన్నది. 4. గాటెమలా, హండూరాస్, సాల్వడారు, నికరా గువా, కాస్టారికా, వెనామా అనునవి మధ్య అమెరికా యందలి ప్రజాస్వామ్యములు. 5. బ్రిటిషు హొండూరాను బ్రిటిషువారి వలస రాజ్యము.