పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/339

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా ఖండము - ఉ త్తరము (భూగోళము) క్రిందుగాఉండు న్యూయార్కు ఇప్పుడు దక్షిణభారత దేశము యొక్క పశ్చిమతీరమువలె అధికమైన ఉష్ణము నకు గురిఅగును. మెక్సికో సింధు శాఖనుండి ఉష్ణవాయు వులు (సాధారణ పవనములు) ఖండము యొక్క పై భాగ మునకు వీచి, ఉత్తరమునుండివచ్చు శీతల వాయు సమూ హములపైగా ప్రయాణించుచు, మధ్య మైదానములో వేసవి కాలమున వర్షము కలిగించును. ఈశాన్య వ్యాపార పవనములు పడమటి ఇండియా ద్వీపములకును, మధ్య అ మెరి కా తూర్పుతీరమునకును, సంవత్సరముపొడుగునను అధిక వర్షమును కలుగ జేయును. మెక్సికన్ పీఠభూమి అధికమగు ఉష్ణోగ్రతకు తావయిన కారణమున, స్థానిక మైన ఋతుపవన మొకటి బయలు దేరి మెక్సికో, పడమటి తీరమునకు వర్ష మునొసగును. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపట్ల గల ప్రదేశమున శీత కాలమున వర్షము కురియును. మధ్య మైదానములందును, మెక్సికో ఆగ్నేయ పశ్చిమతీరము అందును, వేసవిలో వర్షములు కురియుచుండును. సంవ త్సరము పొడుగునను వర్షము కురియు ప్రదేశములు మూడు ఉన్నవి. 1. ఉత్తర పసిఫిక్ తీరము 2. పడమటి ఇండియా ద్వీపములు. మధ్య అమెరికా తూర్పుతీరము, 8. ఈశాన్య- ఉన్నతభూములు, రాకీ పర్వతపంక్తి వర్ష చ్ఛాయ యందును, దానిచే ఆవరింపబడిన పీఠభూము లందును, చాల తక్కువ వర్షము కురియును. అందుచే అక్కడ ఎడారులు ఏర్పడినవి. సహజ వృక్షసంపద : ఉత్తర అమెరికా యందలి సహజవృక్షసంపద ఆయా ప్రదేశములందలి శీతోష్ణస్థితుల కనుగుణముగా ఉన్నది. అలాస్కా నుండి లా లాబ్రడారువరకు టండ్రాభాగము వ్యాపించి ఉన్నది. దక్షిణమున కెనడాలో చాలభాగమందును, పడమటి కార్డెలరా దక్షిణభాగ మందును సూచీ (పత్రములైన) వృక్షముల వరుస. కన్పించుచున్నది. తూర్పున సరఃపంక్తికి, చుట్టునుగల అల్ప ప్రదేశములో సూచీపత్రములును, పత్రచమోక ములునగు వృక్షములు కలవు. అప్లొషియను పర్వతము అందలి ఉన్నత ప్రదేశములందు కూడ సూచీపత్రము లున్నవి. అమెరికా సంయుక్త రాష్ట్రముల తూర్పుతీరము నను పత్రమోచక వృక్షములు గలవు. దాని పై భాగ మును నమశీతలమనియు క్రింది భాగమును సమోష్ణ 278 మనియు చెప్పవచ్చును. ఆ అక్షాంశ రేఖలమీద నే పడమటి తీరమున ఇట్టి సహజవృక్ష సంపదగల కొంత భాగమున్నది. సంయుక్త రాష్ట్రములందలి మధ్య మైదానములును, కెనడా మధ్యభాగమందలి అల్ప ప్రదేశమును పచ్చిక బయ ళ్ళచే ఆవరింపబడిఉన్నవి. వీనికి "ప్రయిరి" అని పేరు. ఈ 'ప్రయిరీ' లలో వర్షపాతము ననుసరించి పడమట పొట్టిగడ్డియు, తూర్పున పొడుగుగడ్డియు పెరుగును. ఇవి వ్యవసాయము విస్తృతముగ జరుగుచున్న ప్రదేశ ములు. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టునుగల ప్రదేశమున మధ్య ధరా వృక్షసంపదయు, మధ్య అమెరికా యందలి ఉష్ణ ప్రదేశములందును, పడమటి ఇండియా ద్వీపములందును, ఉష్ణ నిత్యహరితములైన అరణ్యములును గలవు. పసిఫిక్ కార్డి లరా పొడి వర్షచ్ఛాయలందు ఎడారు లున్నవి. యందలి ఉత్పత్తి : కెనడాయందు ప్రయిరీలు — ముఖ్యముగా నందలి తూర్పుభాగములు విస్తృతముగా గోధుమలు ఉత్పత్తియగు ప్రదేశములు. ఇచ్చట ఓట్లు, బార్లీ, రై, అవి సెచెట్లు (నార) (flax) పెరుగును, (flax) పెరుగును, ఈ ప్రదేశ మున వ్యవసాయమును, పశుపోషణమును కలిసి జరుగు చున్నవి. ఇది సంయు క్త రాష్ట్రములందు వసంత కాలమున గోధుమలు పెరుగు ప్రదేశము యొక్క అవశేషము. దీనికి తూర్పున పెద్ద సరస్సుల చుట్టును, ఈశాన్య రాష్ట్రము లందును వ్యవసాయమును, పశుపోషణమును జతగా జరుగు ప్రదేశ మున్నది. దీనికి దక్షిణమున ఖండము యొక్క పూర్వార్ధమందు మొదట ధాన్యము పండు ప్రదేశమును, తరువాత ఖండమున కడ్డుగా ధాన్యము పండునట్టియు, శీతకాలమున గోధుమలు పండునట్టియు ప్రదేశమును కలవు. టెక్సాసునుండి తూర్పుగా దక్షిణ రాష్ట్రము అన్నిటియందును ప్రత్తి విస్తారముగా పండును. ఉన్నతములయిన పశ్చిమ మైదానములలో పందులను, కోళ్లను, పెంచు ప్రదేశములును, ఇంకనుపడమటగా గొజ్జె లను పెంచు ప్రదేశములును ఉన్న వి. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టునుగల మధ్యధరా శీతోష్ణస్థితితోకూడిన ప్రదేశమున మధ్యధరా ఫలోత్పాదక భాగమున్నది. ఉత్తర పసిఫిక్ తీర ప్రదేశములందు మిశ్రవ్యవసాయము సాగుచున్నది. పెద్ద సరస్సులకును, సెంటులారెన్సునకు ఉత్తరమునను