పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/338

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వారా హడ్సను అభాతములోనికి ప్రవహించును. పెద్ద సరస్సులనుండి ప్రవహించు సెంటులారెన్సునది అట్లాం టిక్ సముద్రములో పడుచున్నది. ఈ రెండవశాఖకు చెందిన ప్రధానమయిన ఈ నదులన్నియు కెనడాలో నే ఉన్నవి. మిస్సిసిపీ సుహానదియు దాని ఉపనదులును మధ్య మైదానముల దక్షిణమునుండి ప్రవహించుచున్నవి. ఆ ఉపనదులలో ఆర్కన్ పస్, మిస్సౌరీ పశ్చిమ పర్వతముల నుండియు, ఓహియో పెన్నెసీనదులు తూర్పు ఉన్నత భూముల నుండియు ప్రవహించుచున్నవి. అఫ్లాషియనుల యందు పుట్టి అట్లాంటిక్ సముద్రములోనికి ప్రవహించు చిన్న నదులు అనేకము లున్నవి. వానిలో హడ్సను, డెలా వేరు, పోటోమాక్ అనునవి ముఖ్యములై నవి. రియో గ్రాం డి డినార్టీయు దాని ఉపనదులును మెక్సికో సింధుశాఖలో కలియు చున్నవి. రాకీ పర్వతములందును అచ్చటి పీఠభూములందును పెక్కు సరస్సు లున్నవి. వానిలో పెద్ద ఉప్పు సరస్సు మిక్కిలి ప్రసిద్ధమైనది. గ్రేటు బేరు, గ్రేటు స్లేవు, అత బాస్కా, విన్ని పెగ్ సరస్సులును సుపీరియరు, మిచి గాన్, హ్యూరన్, ఈరీ, అంటారియో మొదలగు మహా సరస్సులును ఒక పెద్ద సరఃపంక్తిగా ఏర్పడి యున్నవి. ఇవి వాయవ్యమునుండి ఆగ్నేయము వరకును వ్యాపించి యున్నవి. ఇవన్నియు కెనడాలోనే ఉన్నవని చెప్ప వచ్చును. కాని పై మహాసరస్సులు కెనడా సంయుక్త రాష్ట్రముల సరిహద్దునందున్నవి. ఈశాన్య భాగమున పెద్ద వియు, చిన్న వియు అగు అనేక సరస్సు లున్నవి. శీతోష్ణస్థితి : శీత కాలములో క్వినుచార్లటి ద్వీపము నకు దక్షిణముననున్న పడమటి తీరము, మధ్య అ మెరి కా, మిసిసిపీ తీరమునందలి నెంట్ లూయీకి దక్షిణము నందలి పల్లపు భూములు, న్యూయార్కు వరకును గల తూర్పుతీర ప్రదేశములు తప్ప మిగిలిన ఉత్తర అమెరికా అంతయు నీరు ఘనీభవించు ఉష్ణోగ్రతకు (Free- zing Point) క్రిందుగా ఉండును. పడమటి తీరము, బ్రిటిషు కొలంబియా తీరము చేరుచున్న ఉత్తర పసిఫిక్ ఉష్ణజల ప్రవాహముచే ఆవరింపబడి యుండును. అచ్చట అది చీలి దక్షిణమున శీతజల ప్రవాహముగను, ఉత్తర మున ఉష్ణజల ప్రవాహముగను మారుచున్నది. 277 అమెరికా ఖండము . ఉత్తరము (భూగోళము) ఈ ఉష్ణ ప్రవాహముయొక్క ప్రభావము పడమటి తీరమున అట్లాంటిక్ తీరమునకంటే మిక్కిలి ఉత్తరము వరకును కానబడుచున్నది. ఈశాన్య తీరమునకు దూర ముగా ప్రవహించు శీతల లాబ్రడారు ప్రవాహము అచ్చటి భూములను చల్లగా ఉంచును. ఈ ప్రవాహము ఉపజల ప్రవాహము (Gulf stream) తో కలిసినప్పుడు ప్రమాదకరమైన పొగమంచు ఏర్పడుచుండును. ఏ పర్వత పంక్తి చేకొని అడ్డబడని శీతల ధ్రువమండల వాయువులు దక్షిణమున రియో గ్రాండ్ డీనార్టీ, సెంట్ బాయీల వరకునుగల ఖండ భాగమును చల్లగా ఉంచును. న్యూయార్కు సున్నా (0°) డిగ్రీలకు క్రిందుగా ఉండును. ఖండమునకు పడమటినుండి తూర్పునకు అడ్డ ముగా పెక్కు వాయుగుండములు సంచరించుచు గాలి వాలుగల రాకీపర్వత భాగమునకు వర్షమును ఇచ్చును. కాని ఖండములో అవి పొడిగానే ఉండును. ఉత్తర పసిఫిక్ తీరమున సంవత్సరమంతయు వర్ష పాతము ఉండును, కాని గాలి కొట్టువైపున గల లోయ అన్నియు శుష్కములుగా ఉండును. ఉత్తర పసిఫిక్ ప్రవాహమునుండి వీచువాయువులు ఉష్ణములై నీటి ఆవిరితో గూడి పడమటి తీరమున అధిక వర్షము కలి గించును. అవి ఒక్కొక్కప్పుడు రాకీ పర్వత పంక్తిని దాటి మైదానములోనికిదిగి ధ్రువమండల వాయువులు చల్లదనమునకు కొంత ఉపశాంతిని సమకూర్చును. ఈ వాయువులకు "చినూక్సు" అని పేరు. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టునున్న ప్రదేశము వెస్టర్లీ వాయువుల ప్రభావమునకు గురియై శీతకాలమున దక్షిణముగా తిరుగును. వేసవిలో ప్రదేశముపై వాటి ప్రభావము ఉండదు. అందుచే ఈ స్వల్ప ప్రదేశమున మధ్యధరా శీతోష్ణస్థితి కాన • బడును. వేసవిలో, వాయవ్యమున మెకంజీ ముఖద్వారము వరకును, సరఃపంక్తి వరకును, నేరుగా లాబ్రడారు రాష్ట్రము వరకును గల ఖండమునందలి చాలభాగము నందు ఉష్ణోగ్రత 60° F కంటె అధికముగా ఉండును. మెక్సికన్ పీఠభూమిలో తాపక్రమము 90° F కు పైగా మండును. మధ్య మైదానములు మిక్కిలి ఉష్ణములగును, శీత కాలములో నీరు గడ్డకట్టు ఉష్ణోగ్రతకు (0°C)