పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/337

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా ఖండము - ఉత్తరము (భూగోళము) విభజించుట మేలు. ఇట్టి విభాగమువలన అచ్చటి శీతోష్ణ స్థితిని, వృక్ష సంపదను, ఇతర పరిస్థితులను సులభముగా అర్థము చేసికొనుటకు వీలగును. ఇతర వివరములును, స్థానిక భేదములును, ప్రధానములైన ఈ అంశముల నుండి, సహజముగా ఏర్పడినట్టివే. 1. పసిఫిక్ పర్వతపంక్తి : ఈ పర్వత పంక్తి పసిఫిక్ తీరమునంటి ఉత్తరమునుండి దక్షిణమువరకు వ్యాపించు టయే కాక ఇంకను దక్షిణముగా దక్షిణ అమెరికాలోనికి కూడ కొనసాగుచున్నది. ఇది పసిఫిక్ సముద్రతీరము నంటియున్న పసిఫిక్ పర్వత మేఖలలోని ఒక భాగము. ఈ పర్వత పంక్తి హిమాలయము లేర్పడిన కాలముననే ఏర్పడినది. ఈ మడత పర్వతములలో పలువిధములైన గుట్టలు కనబడుచున్నవి. వీటి ఇరుపార్శ్వములందును బంగారము, వెండి, రాగి సీసము, నూనె కలవు. పర్వతపంక్తిలో పెక్కు పర్వతములు సమానాంత రముగా వ్యాపించి, దక్షిణమున విస్తృతములై, తిరిగి మధ్యఅ మెరికాలో కలియుచున్నవి. ఉత్తరమున కెనడాలో ఈ పర్వములు తీరభూమినుండియు కలవు. వీటికి తీర పర్వతములు, సెలకర్కు పర్వతములు, రాకీ పర్వతములు అని పేర్లు. దక్షిణమున వాని పరిశిష్టములు తీరపర్వత ములు, కాస్కేడు, సిరానివాడా, రాకీ పర్వతములు అని పిలువబడును. వీటిలో రాకీ పర్వతములు ప్రధానము లైనవి. ఈ పర్వత పంక్తులు నడుమ కొలరేడో, పెద్ద అమెరికా ఎడారి, (గ్రేటు బేసిన్ మున్నగు మైదానములు, ఎడారులు, కాలిఫోర్నియాలోయ మొదలగు సుందరము లైన లోయలు కనబడుచున్నవి. 2. తూర్పు ఉన్నతభూములు : తూర్పు తీరమున ఉత్త రమునుండి దక్షిణమువరకును గ్రీనులు రెండు పీఠభూమియు కెనేడియనుషీల్డును, అస్లాషియను పర్వతములును, వ్యాపించియున్నవి. కెనేడియను షీల్డనునది కఠినస్ఫాటిక శిలామయ ప్రదేశము. ఇది పసిఫిక్, పర్వతపంక్తి కంటెను ముం దేర్పడి నది. ఇందు ఇనుము, రాగి, వెండి, బంగారము, కోబాల్టు, నికెలు కలవు. అస్లాషియను పర్వతముల పడమటి పార్శ్వ మున ఖండమునకు సంబంధించిన ముఖ్యమైన బొగ్గు గనులును, నూనె గనులును గలవు. షీల్డుపై ఇప్పు డేర్ప డిన పెక్కు సరస్సులు గొప్ప హిమయుగములలో హిమ ఫలకములచే చేయబడిన వివరములు. మధ్య మైదానము లకు ఉత్తరముగా పారు మంచుప్రవాహములు, కరగిన హిమఫలక ములవలన ఏర్పడినవి. ఉత్తరాన హడ్సన్ లోయ నుండినై రృతిదిక్కుగా టెన్నీసులోయవరకును వ్యాపించు అప్లొషియనులలో కొండలును, పీఠభూములును కలవు. ఈ కొండలు పీడ్మంటు అనబడు వెడల్పయిన పీఠభూమి రూపమున అట్లాంటిక్ తీరమువరకును వ్యాపించుచున్నవి. అట్లాంటిక్ సముద్రములో పడు వేగవంతములైన నదు లచే ఈ పీఠభూమి విభక్తము చేయబడుచున్నది. వేగ వంతములై న నదులును, జలపాతములును విస్తారముగా గల ఈ పంక్తికి జలపాతపంక్తి (Fall Line) అని పేరు. నీలపర్వతపంక్తి (Blue Mountain ridge) పీడ్మంటుకు పడమటి సరిహద్దు. దానికి దానికి పడమట విశాలములయిన 'బొగ్గుగనులకు ప్రసిద్ధివడసిన ఆలిఘనీ పీఠభూమి కలదు, 276 మధ్య మైదానములు : పడమటి పర్వతపంక్తి కిని తూర్పు ఉన్నతభూములకును నడుమ ఉన్న ప్రదేశమంతయు చదు నయిన భూములతో కూడియున్నది. హడ్సను అఖాతము నకును, పెద్ద సరస్సులకును, మిసిసిపీ సెంటులా రెన్సు నదులకును, అట్లాంటిక్ తీరమునకును చుట్టును పల్లపు భూములు గలవు. మధ్యనున్న పల్లపుభూములనుండి అచ్చటి నేల పడమటగా ఎత్తుగా పెరిగి రాకీ పర్వతములతో కలియుచున్నది. ఈ ప్రదేశమునకు పెద్ద మైదానము అని పేరు. కెనడా షీల్డుప్రాంతమునందుతప్ప మిగిలిన మధ్య మైదానముక్రింద భూగర్భములో ఇటీవలి కాలమున ఏర్ప డిన మెత్తని పిండి రాళ్ళ కొండలు కనుపట్టును. ఈ ఖండమునందలి నదులను రెండు గొప్పశాఖలుగా విభజింపవచ్చును. (1) పడమటి పర్వతపంక్తులనుండి పసి ఫిక్ సముద్రములో పడు నదులు (2) మధ్యమైదానముల నుండి ఆర్కిటికు సముద్రములో కాని అట్లాంటికు సము ద్రములో కాని వడు నదులు. అలాస్కాలోని యూకను, కెనడాలోని ఫ్రేజరు, కొలంబియా నదులు, సంయుక్త రాష్ట్రము లందలి స్నేకు, కోలిరేడో నదులు మొదటిశాఖకు చెందును. మెకంజీనది ఆర్కిటిక్ సముద్రములోనికి ప్రవహించును. సాస్కెచ్చివానాయు ఎఱ్ఱనదియును విన్ని పెన్ సరస్సు