పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/335

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా ఖండము . ఉత్తరము (భూగోళము) శతాబ్దినుండి ఈ సారస్వత కళారూపము అత్యున్నత స్థానము నాక్రమించుకొనెను. యూనీ ఓనీలు అనునతడు నాటక రచయితలలో నగ్రగణ్యుడు. మాక్స్ వెల్ యాండర్ సను, ఫిలిప్ బారీ, మార్కు కోనల్లీ, బెన్ హెక్టు, రాచల్ క్రాధర్సు, సిడ్నే హోవర్డు, జార్జియస్, కాఫీ మను, క్లిప్ఫర్డ్ ఆడెట్సు, ఎల్మర్ రైను, టెన్నెస్సీ విలియమ్సు, థారనైన్ వైల్డరు అను వారుకూడ ఉత్తమమైన నాటక ములను వ్రాసిరి. ఇరువదియవ శతాబ్ది మొదటి దశకములో, ఇర్వింగ్ బాబిటు, పాల్ ఎల్మర్ మోరు, డబ్ల్యు. సి, బ్రాంవెలు అనువారి నాయకత్వమున హ్యూమనిస్టు సంప్రదాయము పెంపొం దెను. అదికారణముగా సాహిత్యవిమర్శనము విశే షముగా పాఠకులదృష్టి నాకర్షించెను. వాళ్లావిక్ బ్రూక్సు, హెచ్. ఎల్. మెం కెను, రాండాల్ఫుబోర్ను, హెన్రీ సీడెల్ కానీ బీ మొదలగు వారితో కూడిన ప్రతిపక్ష వర్గము, వైవారి హక్కులతో పోటీ యొనర్చిరి. లూయీమమ్ఫర్డు, మాల్కోమ్ కౌలే, ఎడ్మండ్ విల్సను నూతన వాస్తవికతో ద్యమమునకు సుముఖులుగానుండి, (అమెరికా) జాతీయ సాహిత్యమునందలి సాంఘిక భావముల విషయమున మార్క్సిస్టు దృక్పథమును అవలంబించిరి. క్రీ.శ. 1980 సం. ర ప్రాంతమున ఈ దృక్పథమును, మాక్స్ ఈస్ట్ మను, వాల్డోఫ్రాంకు, గ్రాన్ విల్లిహిక్సు అనువారు బరి పరచిరి. తరువాతి దశాబ్దిలో వెలువడిన రచనలందు విమర్శనకళయే ప్రధానవిషయమయ్యెను. ఈ కాలములో ఎజ్రాపౌండు, టి. యస్. ఇలియటు, ఆర్. పి. బ్లాక్ మూరు, ఐ. ఎ. రిచర్డు అనువారు ప్రధానముగా విమర్శ నాత్మక రచనలు కావించిరి. ఇరువదవ శతాబ్దిలో జూన్ ఫిస్కీ, హెన్రీ ఆడమ్సు, థియోడార్ రూజ్వెల్టు, వుడ్రో విల్సను అనువారు వ్రాసిన రచనల ద్వారమున (అమెరికను) చారిత్రక వాఙ్మయము మిక్కిలి అభివృద్ధి చెంచెను. కాలక్రమమున చారిత్రక సంఘటనలను, సాంఘిక ...మానసిక త త్త్వరూపముల వ్యాఖ్యానించుటకు చరిత్రకారులు ఎక్కుడు ప్రాముఖ్యము నొసగిరి. • ఈ కాలమునందు ఛార్లెస్ బీర్డు, ఫ్రెడరిక్ జాక్సన్ టర్నరు, జేమ్సు హార్వే రోబిన్సను అను కవులు విస్తార ముగా చారిత్రకరచన లొనర్చిరి. క్రీ. శ. 1920 వ సం. 274 మొదలుకొని చరిత్ర రచనయందు అగ్రగణ్యులుగా వెలువడినవారు, కారల్ టన్ జే. హెచ్. హేసు, ఆల్లన్ నేవిన్సు, ఆర్థర్ ప్లేసింగరు, ఆర్థర్ ప్లేసింగరు జూనియరు. హెచ్. యస్. కామ్మాగరు, యస్. ఇ. మా రి స ను మున్నగువారై యున్నారు. • డా. ఓడెల్ అమెరికాఖండము - ఉ త్తరము(భూగోళము): శ. 1492 లో అమెరికా కనుగొనబడుట కొలంబసు యొక్క పశ్చిమ నౌకాయాత్రలకు ఫలితము. కాని, అమెరి గో వెస్పూసి, మధ్య బ్రెజిలుకు వచ్చినప్పు డాఖండమును మొదట కని పెట్టినట్లు తలంపబడుటచే, క్రీ.శ. 1541 లో మెర్కేటరు ఆ భూభాగమునకు అతని నామమును అనుస రించి అమెరికా అను పేరు పెట్టెను. ఖండము యొక్క ఆక్రమణమును, అంతరప్రవేశమును, అట్లాంటిక్ సముద్ర తీరదేశస్థుల ప్రయత్నములచే అభివృద్ధి చెందెను. ఉత్తరఅమెరికా, ఆసియా ఖండమునుండి సన్నని బేరింగు జలసంధిచే వేరు చేయబడియున్నది. ఇందలి చాల భాగము మకర రేఖకును, ధ్రువ రేఖకును నడుమ 100° పశ్చిమ రేఖాంశమున కిరుప్రక్కల సమానముగా వ్యాపించియున్నది. ఇది పెద్దఖండములలో మూడవది. దీనిపై శాల్యము 80 లక్షల చ. మైళ్ళు. దీనికొలత ఉత్తరమునుండి దక్షిణమునకు 6,000 మైళ్లు. సంయుక్త రాష్ట్రములు ఉ త్తరమున మధ్యధరా సముద్రమువరకును వ్యాపించిఉన్నను, పెక్కు విషయములలో మధ్యధరా సముద్ర ప్రాంత దేశములకన్న భిన్నములుగా నున్నవి. సంయు క్త రాష్ట్రములకు ఉత్తరమున ఉన్న కెనడా సుమారు అంతే విస్తృతమైనది. సంయుక్త రాష్ట్రములకు దక్షిణమున మెక్సికోయును, ఇతర ప్రజాస్వామ్యము లును ఉన్నవి. గ్రీములాండు ప్రధాన ఖండమునుండి బాఫిన్ అఖాతము చేతను, డేవిసు జలసంధిచేతను, వేరుచేయబడి యున్నది. బాఫిన్ ద్వీపము గ్రీములాండుకును ప్రధాన ఖండమునకును మధ్య ఉన్న ధ్రువమండల ద్వీప సమూహమునం దెల్ల పెద్దది. ఇది ప్రధానఖండముమండి బూతియాహడ్సను సింధుశాఖల చేతను, హడ్సను జలసంధిచేతను విభజింపబడి యున్నది. బాంక్సు, గ్రాంటు, విక్టోరియా, బూతియా