పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/334

ఈ పుటను అచ్చుదిద్దలేదు

షెర్వుడ్ యాన్డర్ సను వ్రాసిన నవలలలో ప్రతిబింబిం చిన సహజత్వ సిద్ధాంతమునకు కారణభూతమయినది. జాక్ లండను, ఛార్లెస్ మేజరు, మేరీజాన్టను, యస్. వీక్ మై కేల్, పాల్ లీ స్పర్ ఫోర్డు, ఎఫ్. మేరియన్ క్రాఫర్డు విన్స్టన్ చర్చిలు, ఓవెన్్వస్టరు మున్నగువారు ఈలోపల కాల్పనిక తాయుతమైన నవలారచనను పెంపొందించిరి. పందొమ్మిదవ శతాబ్ది చరమకాలమున అమెరికను సాహిత్యమునందు హాస్యయుత కావ్యరచయితలకు ఒక ప్రముఖస్థానము చేకూరెను. వారిలో మార్క్ ట్వెన్ అగ్రగణ్యుడు. హాస్యరచనారంగమున ఆక్టిమస్ వార్డు, పెట్రోలియమ్ బి. నస్బీ, పిన్లేపీటర్ డన్నీ, జాన్ బిల్లింగ్సు, సీబాస్మిత్తు మున్నగువారును; జార్జి ఆడె, డాన్మార్క్విసు, యూ నేఫీల్డు, ఆగ్డన్ నామ, జేము ధూర్బరు మున్నగు వారు వార్తాపత్రికా- వ్యాసరచనా- పత్రికారచనా రంగములందును క్రీ. శ. 1940, 1950 సం. ప్రాంతమున కృషి యొనర్చిరి. ఇరుపదవ శతాబ్దిలో, నవలా రచయితలకు ప్రాంతీ యత్వమునందు అభిరుచి హెచ్చయ్యెను. మేరీ ఎల్లెన్ ఛేజు, విల్లా కేథరు, బూత్ టార్కింగుటను, సింక్లేర్ లెవిసు, జె. పి. మార్క్వర్డు, ఎడ్గా ఫెర్బరు, జాన్ స్టీన్ బెక్ అను కవులు యీ జాతి రచనకు ఉత్తమ ప్రతినిధులు. పందొమ్మిదవ శతాబ్ది ప్రప్రథమ దశయందు జేమ్సు పెన్నీ మోర్ కూపరు అను నాతడు చారిత్రక నవలలను రచించెను. అంతకుపూర్వముననే ఇట్టి రచనలయందు అమెరికాలో పాఠకలోకమునకు విశేష ప్రీతి ఉదయించి ఉండెను. ఆ దేశమున ఇట్టి అత్యుత్తమమైన నవలలను, హెర్వే ఎల్లెన్, మార్గరెట్ మిఛెలు, స్టెఫెన్ విన్సెంటు హెర్వేఎల్లెన్, బినెటు, ఈస్టర్ పోర్బ్బు, జేమ్సుబోయిడు, కెన్నెత్ రోబర్టు, మాక్ కిన్లే కాన్ రు, స్టార్క్ యంగు అను కవులు రచియించిరి. యండు అమెరికా సంయు క్త రాష్ట్రములలో కథానికా రచన అగ్రగణ్యులుగా వెన్నబడిన వారు డొరోత్ పార్క్్కరు, విలియం డేనియలు స్టీలు, కేథరైన్ అనీ పోర్టరు, విలియం సారోయన్ అను కవులైయున్నారు. నేడు అమెరికన్ సాహిత్య జీవితములో కవిత్వమునకు గొప్ప గౌరవమేర్పడియున్నది. క్రీ.శ. 1912 వ సం. లో 35 273 P అమెరికను సాహిత్యము హారియట్మన్రో అనునామె “పొయిట్రీ" అను పద్యమయ మైన పత్రికను స్థాపించెను. అందు ఆనాటి కవికయందలి క్రొత్త లెన్నులు మూర్తీభవించేను. ఈ పత్రికా ప్రచురణము కవిత్వమునందు గాఢ మయిన ఆసక్తిని కల్పించెను. ఆ పతిక యందు పెక్కు మంది రచయితలకు తమ రచనలను ప్రచురించుటకు అవకాశములఖించెను. స్వల్పపరిమాణము అల్పజీవితము గల పత్రిక లనేకములు వెలువడెను. అంతకుమున్ను తమ కవితను ప్రచురించు భాగ్యమెరుగని రచయితలకు కూడ తమ రచనలను వాటియందు ప్రచురించుట కవకాశము కలిగెను. ఆ యుద్యమము సృజనాత్మకములయిన అశేష కవితా ప్రక్రియల ఉత్పత్తికి గొప్ప దోహద మొసగెను. ఎమీలో వెలు, వాచెల్ లిండ్సే, కార్ల్ పాండ్ బర్గు, ఎజ్రా పౌండు, టి. యస్. ఇలియట్, జాన్ గోల్డు ఫ్లెచరు, కాన్రాడ్ ఎయికెను, కార్ల్ షరో, వాలెస్ట్ వెన్సు, స్టీ ఇ. ఇ. కమ్మింగ్సు - వీరందరు ఆ శతాబ్ది యందలి అమెరి కను కవిత్వమునందు గణనీయమైన వివిధ సారస్వత ప్రక్రియలకు ప్రతినిధులుగా నున్నారు. ఎడ్గార్ లీమాస్టర్సు, రోబర్టుఫ్రాస్టు, రోబిన్సన్ జెఫర్సు, ల్యూసా రెటు అను రచయితల కవిత్వములలో ప్రాంతీయ త్వము ముఖ్యమైన విషయమయ్యెను. ఈ శతాబ్దియందు అమెరిక నుక విత్వమునందు ప్రముఖ సంప్రదాయవాది యయినవాడు ఇ. ఎ. రోబిన్సను. ఈ సంప్రదాయమునకు చెందిన ఇతరులు విలియమ్ ఎల్లెరీ లీనార్డు, ఎలీనోర్ వైలీ, సారాటిస్ డేలు, హార్ట్లుకేను, ఎడ్నా సెంటు, విల్సెంటి మిల్లే. ఆర్చిబాల్డు మేక్లీషు అను వారై యున్నారు. నీగ్రో కవులు కూడ అమెరికను కవిత్వమును తమ విశిష్టమైన రచనలచే పెంపొందించిరి. పాల్ లా రెన్సుడన్ బారు అను రచయిత యీ వర్గమునకు చెందిన కవులలో విశిష్టతను గన్న వాడు. కౌంటీకల్లైను, జేమ్పు వెల్డెన్ జాన్సను, లాంగ్ స్టన్ హ్యూసు అను వారి ప్రాముఖ్యము గణనీయమైనది, పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరభాగమున. అవామక ముగా పడియున్న అమెరికను. నాటక రంగము క్రొత్త -యుగమున ప్రబలమైన పాత్రను వహించెను. ఇరువదవ