పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/333

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికను సాహిత్యము రికా రాజ్యములలో నాటి ప్రముఖములయిన చారిత్రక రచన అన్నింటియందును, యూరోపియన్ విద్యా సంప్ర దాయము యొక్క ప్రభావము కనిపించును. కారణము అమెరికా యందలి నాటి రచయితలలోను, యువకు లయిన పండితులలోను పెక్కురు, యూరపునందు విద్యో పార్జనము చేసియున్న వారయి యుండుటయే. విలియం హిర్లింగు ప్రెస్ కాటు, జాన్ లాద్రోవ్ మాట్లే, ఫ్రాన్సిస్ పార్కు మెను, జార్జి బాన్ క్రాఫ్టు మొదలైన వారి అనంత రియములైన చారిత్రక రచనలలోను యూ రపియన్ విద్యాప్రభావము గోచరించును. క్రొత్త అంతర్యుద్ధము లయిన పిదప స్థానిక వాతావరణమును వర్ణించునట్టి లేక ప్రాంతీయ సాహిత్యము వ్రాయునట్టి రచయితలు వెలువడిరి. వారి రచనలు ప్రజలలో కొంద రికి గాఢమైన అభిరుచిని పుట్టించెను. దేశములోని క్రొ త్త ప్రాంతములను గురించి వ్రాయబడిన కథానికలు, కావ్య ములు, నవలలు ముఖ్యముగా పశ్చిమమునుండి శీఘ్ర ముగా వెలువడినవి. పశ్చిమమునందలి ఎడ్వర్డు ఎగిన్స్టన్, జాక్విన్ మిల్లరు, బ్రెట్ హాల్టే దక్షిణమునందలి జార్జి డబ్ల్యు కేబులు, థామస్ నెల్సన్, పేజి, జోయెల్ చాండ్లెర్, హారిసు, జేమ్సు లేన్ ఎల్లెన్; న్యూ ఇంగ్లండునందలి సారా ఆర్నె జ్యూయెటు, ల్యూసాయమ్ ఆల్ కాటు మేరీ, యి. ఫ్రీమను ; మధ్య పశ్చిమ దేశము నందలి జేమ్సువిట్, కూంబ్లే మున్నగు రచయిత వర్గమునకు చెందిన 'వారై యున్నారు. ఆ ఆ శతాబ్ది అంతిమ కాలములో అమెరికను సాహిత్యము నకు ఔన్నత్యము చేకూర్ప సమర్థులయి రాజకీయ ఆర్థిక ధృక్పథములు కలిగిన నవలా రచయితలు కొందరు ఉద్భ వించిరి. ఎడ్వర్డు బెల్లమీ, రెబెక్కా హార్డింగు, డేవిసు హెలెన్, హంటి జాక్సను, హెరాల్డు ఫ్రెడరికు, డేవిడ్ రాస్ కె మున్నగువారు ఈ కవిబృందమునకు చెందిన వారు. ఈ కవిబృందపు రచనలు బలవత్తరమైన ప్రభా వము అప్టన్ సింక్లేరు, ప్రాంక్ నారిసు, థియోడార్ డ్రీజరు వ్రాసిన నవలలపై ప్రసరించెను. హెన్రీజేమ్సు, ఎడిత్ వార్ట్లను అనువారు వ్రాసిన నవల లొకజాతికి చెందినవి. వాటియందు నిశితమైన పాత్ర పరిశీలనము కాననగును. అందుచే నవి సాదరముగ జనులచే పఠింపబడెను. 272 అంతర్యుద్ధానంతరము వ్యాప్తిచెందిన పత్రికా రంగ మున కథానికా రచనకు గిరాకీ ఏర్పడెను. ఇట్టి అవసర మును గురించి కథానికలు రచించినవారు ఓహెన్రీ, రిచర్డ్ హార్డింగ్, డేవిను, ఏంట్రోసు, బియర్సు, బ్రైట్ హార్పే అను కవులై యున్నారు. పందొమ్మిదవ శతాబ్ది అంత్యకాలమునందును, ఇరువ దవ శతాబ్ది ప్రథమ దినములలోను, ప్రముఖ సాహిత్య సంపాదకుడుగాను, నవలారచయితగాను, డేన్హో వెల్సు సుప్రసిద్ధి నొందెను. కా విలియమ్ క్రీ.శ. 1890 సంవత్సర ప్రాంతమున వాస్తవిక వాదు లును, ప్రకృతి (తత్త్వ) వాదులునయిన కవులు రచిం చిన నవలా వాఙ్మయము 20 వ శతాబ్ది ఆరంభమునుండి రచింపబడిన నీరసమును, వాస్తవికతాయుతమును ఐన నవలా రచనకు పూర్వరంగముగ నుపకరించెను. అందు పాత్రల మానసిక వృత్తి పరిశోధనము ఉపలక్షిత మగు చుండును. ఇట్టి సాహిత్యపు తెన్నులు జాన్ డాస్ పాససు, ఎర్స్కిన్ కాల్డ్వెల్లు, విలియమ్ ఫాక్రు, జేమ్సు టి ఫారెలు, ఎఫ్స్కట్ ఫిడ్జి గెరాల్డ్, ఎర్నెస్బు హెమింగ్ వే, థామస్ వుల్ఫు మున్నగువారి రచనలలో గోచరించును. ఆ కవుల రచనలయందలి పాత్రల మానసిక వృత్తి చిత్ర ణములు, పాత్రల సంభాషణములు అత్యుత్తమములు. అమెరికను విప్లనమునకు పూర్వమునందే ఆరంభమయిన అమెరికను సాహిత్యమునందలి వ్యాసరచన పందొమ్మి దవ శతాబ్ది ఉత్తరభాగమునందు జాన్ బట్టోసు, జాన్ మ్యూరు అను కవుల రచనలద్వారమున అభివృద్ధిచెంది ఉన్నతస్థాయిని పొందెను. ఇరువదవ శతాబ్దియందు డొనాల్డుకల్రాసు పిట్టి అను నాతడు వ్యాసరచనమున ఈ రంగములో విశిష్టమైన రచనలు కొనసాగించెను. 1 జార్జినం తాయనా, విలియం జేమ్సు, జోసియారోయిస్, జాన్ డ్యూయీ మున్న గువారి రచనలు వేదాంతశాఖ యందు అమెరికను సాహిత్యమునకు ఔన్నత్యమును చేకూర్చెను. క్రీ. శ. 1880, 1890 ప్రాంతమున కొన్ని అమెరికను నగరములలో నేర్పడిన దుష్ట రాజకీయ పరిస్థి తులపై విప్లవరూపముగా వ్యాపించిన ఒక మూఢమైన వాస్తవికతయే, హేమ్లిన్గారెండు, స్టెఫీన్ క్రేన్ రచనల లోని అల్పవాస్తవికతకును, తరువాత థియోడార్ డ్రీజరు,