పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/332

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్ద్ లో వర్జీనియా దేశీయుడై న కప్తానుజాన్స్మిత్తు, గవర్నరు విలియం బ్రాడ్ ఫర్డు, జాన్ విన్ డ్రాఫ్ అనువారు వ్రాసిన చారిత్రక కథలు కలవు. ఇంతకుముందే ప్రప్రథమమున ఏ నీబ్రాడ్ స్ట్రీటు, మైకేల్ విగిలే వర్తు, ఎడ్వర్డు టైలరు అనువారు కవిత్వమును వ్రాసిరి. వలసరాజ్యములపై క్రీ. శ. 1640 లో మొట్టమొదట ప్రచురింప బడినది “బేసామ్” అను గ్రంథము. ఆ దేశములోని మొదటిగొప్ప భావకవియైన ఫిల్ ఫ్ ఫ్రెన్యూ నాడు ప్రఖ్యాత మైన పత్రికా రచయితలలో నొకడు. 1704 లో బోస్టన్ లో "బోస్టన్ న్యూ లెటర్" అను మొట్టమొదటి వారపత్రిక వెలువడెను. 1788 లో మొట్ట మొద టిసారిగా "ఫిలడల్ఫియా ఈవినింగ్ పోస్టు” అను దినపత్రిక స్థాపింప బడెను. “సాటర్ డే ఈవినింగుపోస్టు" అనుదానికి స్థాపకు డైన బెన్ జమిన్ ఫ్రాన్ క్లిన్, సాహిత్యమునందు, పత్రికా రచన యందు ఉన్నతస్థానమును ఆక్రమించెను. థామస్ పైనీ, థామస్ జఫర్ సన్, అలెగ్జాండర్ హేమిల్టను, జార్జివాషింగ్టను అనువారు వ్రాసిన వచనరచనలు నాటి రాజకీయ రచనలను వృద్ధిచేసెను. విలియమాల్ బ్రౌన్ మొట్టమొదటి అమెరికను నవల వ్రాసిన గౌరవము పొందియున్నను, చార్లెస్ ట్రాక్ట నుబ్రౌన్ అనునాతడు ఆ దేశపు మొదటి కవితావృత్తికి చెందిన యితగా పరిగణింపబడెను, కథలు, సంక్షేప చిత్రణములు అనువాటి ద్వారమున అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన మొదటి అమెరికను రచయిత వాషింగ్టను ఇర్వింగు అను నాతడు క్రీ. శ. పందొమ్మిదవ శతాబ్ద్యారంభమున విలియమ్ కల్లెన్ బ్రయాంటు కవులలో నగ్రేసరుడుగా పేరుపొందెను. ఎమర్సన్, లాంగ్ ఫెలో, విట్టర్, పో, మొదలగు కవుల రచనలు చాలవరకు ఆనాటి సాహిత్యా న్నత్యమునకు దోహద మొనర్చెను. నవలా రచ అమెరికా దేశవు మొట్టమొదటి గొప్ప చారిత్రక నవలారచయిత జేమ్స్ ఫెనీ మోర్ కూపరు. క్రీ. శ. పందొ మ్మిదవ శతాబ్ది ఆదిమ కాలములో విలియంగిల్ మోరు సిమ్సు, రోబర్టుబర్డ్ అను కవులు కూడ చారిత్రకము లయిన నవలలను వ్రాసియుండిరి. అమెరికను సాహిత్యము యొక్క అభివృద్ధి విషయ మున అనాటి ఆధ్యాత్మిక తత్త్వవాదులు చాలవరకు 271 అమెరికను సాహిత్యము ప్రాముఖ్యమును వహించిరి. వారిలో రాలు వాల్డో రాలువాల్డో ఎమర్సను, బోన్సన్ ఆల్ కాటు, హెన్రీ డేవిడ్ ధోరూ, మార్గరెట్ పుల్లరు, థియోడర్పార్కరు అనువారు ప్రముఖులు. వారు తమవర్గపు వేదాంతమును దాని ప్రభావమును విశేషముగా వ్యాప్తినొందించుటకు మిక్కిలి కృషి చేసిరి. నెథేనియల్ హాథారన్ అరాచకమైన, తీవ్ర సమాలోచనాయుతమైన ప్రాచీన భావములను, హెర్మన్ మెల్విలి అనునాతడు కల్పనాపరములైన భావములను, తమ వివిధ విషయక మైన నవలాపరంపరలో ప్రతిపా దించిరి. నవలలు, పద్యములు, వ్యాసములు అను సార స్వత ప్రక్రియలందు ఆలివర్ వెండెల్ హోమ్సు అను కవి ఆంగ్లేయుల యొక్క మతజీవిత విధానమును చాలప్రస్ఫుట ముగ చిత్రించెను. సంపాదకుడుగా, ఉపాధ్యాయుడుగా, కవిగా పేరుగన్న జేమ్సురస్సైలులో వేలు తన “బిగ్లో- పేపర్సు" అను రచనలలో దేశీయభాష నుపయోగించెను. ఆ కాలమున అద్భుత కల్పనాశక్తికల ప్రముఖ కవి హెన్రీ వేగ్సవర్తులాంగ్ ఫెలో, అతడు వ్రాసిన హైయ వథా, ఎవఃజెలైన్ అను రచనలు సర్వులకు ప్రీతి పాత్రములై వెలసెను. జాన్ గ్రీన్అఫ్ విట్టియరు యొక్క కవిత్వము వలనను, హారియట్ బీచెర్ స్టోవ్ యొక్క రచనల మూలమునను బానిసతనపునిర్మూలనోద్యమమునకు ఎక్కువ ప్రోద్బలము చేకూరెను. హారియట్ వ్రాసిన “అంకుల్ టామ్స్ కేబిన్ " అను నవల బహుళ వ్యాప్తి నొందెను. ఆధునిక కథానికా రచనకు సృష్టికర్తగా ప్రశంసింప బడిన ఎడ్గార్ ఎల్లెన్పో అను కవి ఈ కాలములో నే న్యూయార్కు, రిచ్మండులలో నివసించుచు రచనలు సాగించుచుండెను. పందొమ్మిదవ శతాబ్ది యొక్క పరార్ధమునకు పిదవ అమెరికను కవులలో అగ్రగణ్యుడయిన వాల్ట్టను ఆవాటి అంతర్యుద్ధములను అత్యుత్తమమైన కవితా రూప మున వర్ణించెను. 1886 సంవత్సరములో చనిపోయిన ఎమిలీ డికెన్సను అను నామె గణనీయములయిన గేయ కావ్యములు ఆ దినములలో వ్రాయుచుండెను. కాని క్రీ. శ. 1915 సంవత్సరమువరకు ఆమె రచనలు పాఠక లోకమునకు లభించలేదు. అంతర్యుద్ధానంతరము. ఆమె