పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/331

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికను సాహిత్యము (Medicinal men) యొక్క శక్తి మిక్కిలి గొప్పది. ఆ జనుల యొక్క తెగలను బట్టి ఈ భిషక్కుల ప్రాధాన్యము అప్రాధాన్యముగ మారుచుండును. కొన్ని తెగలలో ఈ భిషక్కునకు ఏవిధమైన ప్రాధాన్యము ఉండెడిది కాదు. మరికొన్ని తెగల యొక్క లౌకిక మత విషయములందు ఈ భిషక్కులే సర్వాధికారములు గలిగియుండిరి. ఈభిషక్కు లకు గోప్యకూటములు, గోష్ఠి మందిరములు ఉండెడివి. వీటిలోనికి ప్రవేశమును గోరు ఆరంభకులు యథావిధిగా ప్రవేశ పెట్టబడుచుండిరి. కొన్ని తెగలయందు యౌవనదళ ప్రా ప్తించినవారు చేయవలసిన కర్మ కలాపములను చేయించు నధికారము ఈ భిషక్కుల గుండెడిది. నొకప్పుడు వీరు వ్యవసాయ సందర్భమున వేగుచుక్కను (శుక్ర గ్రహమును) పూజించుచు, నరబలి చేయుచుండెడి వారు. ఒకా అమెరికను ఇండియనులలో ఆత్మను గురించియు, పర లోకములో దానికిగల భవిష్యత్తును గురించియు భిన్నా భిప్రాయము లుండెడివి. ఈ అభిప్రాయములకు అను గుణముగానే వారి శవసంస్కారవిధులు కూడ ఏర్పాటు చేయబడియుం డెడివి. కొందరు శవములను పారవేసెడి వారు. కొందరు మిసిసిపి లోయయందు మట్టి దిబ్బలలో పూడ్చిపెట్టెడివారు. మరికొందరు 'పేరు' దేశములోవలె రాతిసమాధులలో పూడ్చిపెట్టెడివారు. 'కొచ్' (Koch) అని పిలువబడు దక్షిణ అమెరికను జనుల యొక్క ఆత్మ వాదము, 'టోటెమ్' తెగవారియొక్క ధ్యానవాదము, 'జూనిన్' తెగవంటివారి ఫెటీషి జము, (Fetishism) 'కుషింగు' అను నాతనిచేత పరిశోధింపబడినవి. 1 అమెరికను ఇండియనుల విలక్షణమైన ఆటలలో పాచిక లతో నాడబడు జూదము, హూపు, పోలు అను ఆటలును, సంయుక్త రాష్ట్రములలో నైరృతిభాగమునను, తూర్పు భాగమునను ప్రవర్తిల్లు బంతి ఆటలును పేరొన తగియున్నవి. జంటబంతులాట, నడకలో పందెములు, మంచుపాములు .మొదలయిన ఆటలు స్త్రీ లాడుదురు. అత్యున్నతమైన స్థానములను అలంకరించిన స్త్రీలు కొందరుండిరి. పరిపాలనా విధానములోను, శాంతిస్థాపన మునకై రాయబారములను నడుపుటయందును కొంత వరకు ఇవాక్వియోస్ అను స్త్రీలు పాల్గొనిరి. సుప్రసిద్ధు 270 లయిన నాయకురాండ్రుకూడ నుండిరి. దేశమాతలుగా భూషింపబడదగిన స్త్రీలుండిరి. మాయన్సులో మతా చార్యత్వమును వహించిన స్త్రీలుకలరు. స్పానియర్సుతో జరిగిన తిరుగుబాటులో కొందరు ఆ తెగలకు నాయకు రాండ్రుగా వ్యవహరించిరి. ఉదా:- 'అమెరికన్ జోన్ అఫ్ ఆర్' అని పిలువబడు 'మేరియా సిండ్రిల్లా' అట్టి స్త్రీలలో సుప్రసిద్ధురాలు. బ్రెజిలునందలి కూసేనయా (Kootenaya) జాతివారి యొక్క సామాన్యమైన ప్రజా ప్రభుత్వము మొదలుకొని ప్రాచీన మెక్సికనుల యొక్క యు పెరూ ఇండియనులయొక్కయు సుపరిష్కృతమయిన రాష్ట్రీయ సంస్థలవరకుగల పరిపాలనా విధానములు అమెరికను ఇండియనుల యొక్కయు, వారి జాతీయ నిర్మాతల యొక్కయు ప్రభుత్వ పద్ధతిని అనుసరించెను. నాయకుల యొక్క అధికారములకుకూడ కొంత హద్దు ఉండెడిది. కొన్ని తెగలవారు శాశ్వత శాంతి నాయకుసి, తాత్కాలిక యుద్ధ నాయకుని ప్రత్యేకముగ ఏర్పాటు చేసికొనుచుండిరి. సాధారణముగా నాయకులు ఆ తెగ నుండిగాని, లేక కొన్ని ప్రత్యేక మైన కుటుంబములనుండి గాని ఎన్నుకొనబడుచుండిరి. వెక్కు తెగలలో దాని సత్వము అమలులో నుండెడిది. రా. ప్ర. వికాస అమెరికను సాహిత్యము :- ఆంగ్లసాహిత్య శరీరమున కొక అంగముగ అమెరికను సాహిత్యము ఆవిర్భవించినది. ప్రప్రథమమున కొన్ని సంవత్సరముల వరకు అమెరికను విద్వాంసులు తమ జాతీయ జీవనమున సంస్కృతి యొక్కయు విద్య యొక్క యు మునకై ఆంగ్లసాహిత్య భాండారము పైననే ఆధార పడుచు వచ్చిరి. విప్లవమునకు పూర్వమే, వివిధ సాహిత్య ప్రక్రియలు విజృంభించియున్నను, అమెరికనులస్వాతంత్ర్య యుద్ధ కాలములో నింద్యములై ఉద్రేకమును కలుగ జేయునట్టి వీరగీతములు ప్రచురింపబడినను, అమెరికనులు నాటి తమ సారస్వతసాహిత్య ఆహారము కొరకు లండను, కొలనుల దేశము (Lake Country), ఆక్సుఫర్డు, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయములనే ఆధారముగా గై కొనసాగిరి. వలసదినములు-తదనంతరకాలము : విప్ల వమునకు పూర్వమేర్పడిన సాహిత్యమునందు క్రీ.శ.17 వ శతా