పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/329

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికను ఇండియనులు కనబడుచున్నది. ఈ సన్నిహితజాతులను గురించి మన కేమియు వి శేషాంశములు తెలియవు. భిన్నభిన్న జాతు లుగా కనబడువారుకూడ వారిలో చేరిన అవాంతర శాఖలుగా నే పరిగణింపబడవలెను. ఈ ఐక్యమే అమెరికను ఆదిమ ఇండియనుల చరిత్రకు సంబంధించిన మానవజాతి శాస్త్ర ముఖ్యసం ఘటనము. ఇండియను జాతుల భాషా పరిశీలనము, పురావస్తు శేషములు, కళలు, పరిశ్రమలు, ఆటలు, సాంఘిక మత సంస్థలు, పౌరాణిక గాథలు, జాన t . . పద విజ్ఞానము మున్నగునవివారి మానసిక ఐక్య తనే చాటుచున్నవి. ఈ జాతులలో 'శారీరకములైన భేద ములు కన్పించుచున్నను, అవి ప్రపంచమునందలి ఇతర గొప్ప జాతులలో కానిపించు భేదముల కంటే మించినవి కావు. ఉత్తర అమెరికను ఇండియనులు అనేకమయిన తెగలుగా విభజింపబడి యున్నారు. అలాస్కా యొక్క పశ్చిమప్రాంతములను ఆక్రమించిన ఎన్డీ మోలులను వారు వీరిలో ముఖ్యులు. 'ఏతిపాస్కన్సు' (Athepascans) అమవారు ఉత్తర కాలిఫోర్నియా, ఎరిజోనా, మెక్సికో ప్రాంతములను ఆక్రమించి యున్నారు. ఆక్రమించి యున్నారు. 'ఇరాకీస్' (Iraquies) అను జాతివారితో సమ్మిశ్రితులైన 'ఆల్గో కీయక్షా' జాతివారు, సెంటు లారెక్సు భూములందును అంటారియో సరస్సునకు తూర్పుననున్న భాగమందును నివసించియున్నారు. ముస్కోజియన్ తెగవారు ఎప్లాచి యను పర్వత ప్రాంతమునను అట్లాంటికు, మెక్సికో మిసిసిపి ప్రాంతములందును సింధుశాఖ, నివసించు చున్నారు. కడ్జోయను తెగవారు, సియోనులు, సొషోని యనులు లేక, ఉటో అజ్టియనులు (Vio-Agteean), అమెరికన్ ఇండియన్ 268 మాయనులు, అరవాకనులు, టుపి యనులు, చి బిహానులు, క్వెచి యనులు అను వివిధ జాతులవారు అమెరికాలోని వివిధ ప్రాంతము లందు నివసించియున్నారు. వీరు మంగోలియ౯ జాతీయులు. వీరు మధ్య ప్రమాణముగల పొడవును, గోదుమవ న్నెగల శరీరములను, వెడల్పయిన ముక్కులను ముఖము లను ఏటవాలు కం డ్ల ను కలిగి యుండు మంగోలియా జాతి ందుదురు. అ మెరికను ఇండియనుల యొక్క కళలు వారు కనిపెట్టిన విషయములు తమ పరిసరముల యొక్క పరిమితికిని వైవిధ్యమున కును అనుగుణమైనవిగా నున్నవి. ఈ ఖండమును కనుగొనునాటికి, అచ్చటనున్న జనులు రాతియుగమునకు చెందిన వేట గాండ్రుగాను, చేపలు పట్టు వారుగాను, వ్యవసాయ దారులుగాను ఉండిరి. వారిలో పెక్కుమంది కుండలు చేయుట కొంతవరకు ఎరిగినవారే. 'అల్ గోకియ ఎట్ చెమిన్స్' అనువారు అక్షరాల తేలిక పడవలను నడుపు మనుష్యులు. ఈ సందర్భమున సముద్రముపై తేలిక పడవలను నడుపుచు చేపలను పట్టుకొను 'అలాస్కా' తీరవాసులును, బ్రిటిష్ కొలంబియా వాసులును పేర్కొనదగినవారు. అమెరికను ఇండియనులలో ఎస్కిమోలు కుక్కలను, ఆల్గోకియనులు జారుడు బండ్లను