పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/327

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమృత షేర్దిల్ చిత్రరచనమున నెట్టిప్రావీణ్యముకలదో అట్లే ఆ కాలము వారికి నృత్తగాన విద్యలందును విశేషకౌళ లా ఖిమాన ములు గలవని చిత్రములనుబట్టి ఊహింపవచ్చును. ఒక్క

స్త్రీ పురుషులే కాక, నాట్యాభినయాన ర్హములైన కుబ్జ

యక్షగణములుకూడ నాట్యముచేయుచుండినట్లు మనము అమరావతీ శిల్పమునందు కాంచగలము. అభినయమును పురస్కరించుకొనియుండు జంత్రగాత్ర సంగీతముకూడ శిల్పమున ప్రదర్శిత మైనది. అమరావతీ శిల్పమున చూపబడిన యుద్ధ చిత్రములను బట్టి అప్పుడు సైన్యము రథ, గజ, తురగ, పదాతిన మేత మని తెలియుచున్నది. యుద్ధ చిత్రములు గల అమరావతీ యుద్ధచిత్రములుగల చిత్ర శిలాఫలకములు శిథిలమై యుండుటచే క్షేత్రజీవ్యు చితమైన వేష, భూషా, శిరస్త్రాణాదులను గురించి విశేష ముగ తెలియదు. అమరావతీ శిల్పమునందు సామాన్యమైన పూరిగుడి సెలు మొదలు రాజహర్మ్యములవరకు చూడగలము. గ్రామప్రాకార ద్వారములు, విలాసద్వారములు తోరణ సంశోభితములై కానవచ్చును. రాజకుమారు లుష్ఠీషమును చిత్రమయిన రీతుల మిక్కిలి సొంపుగ రచించువారు, రూప సంపదయందు రాజకుమారు లెప్పుడును యౌవనవంతులే. బ్రాహ్మణులకును, యతులకును, భూషణము లుండవు. యతులు పెక్కురీతుల జటాధారణము చేయువారు. బౌద్ధభిక్షువులు ముండిత శిరస్కులు గానవత్తురు. యోధులు శిరస్త్రాణములను ధరించుచుండిరి. దాసజనము మోకాలు దిగని చిన్న పంచెకట్టి నడుమునకు రుమాలు చుట్టుచుండిరి. నడిమితరగతులవా రెప్పటివలెనే దుస్తు లను ధరించి కొండిసిగలను, ప్రక్క సిగలను దీర్చుచుండిరి.. అమరావతీ శిల్పమున గానవచ్చు స్త్రీ ప్రతిమలను గాంచినచో ఆకాలపు స్త్రీలు సౌందర్య, శృంగారముల మీద నెంతటి లక్ష్యముంచువారో విశదము కాగలదు. ఇంత యెందులకు? క్రీస్తుశక ప్రాథమిక శశాబ్దులందు ఆంధ్రుల ఆచారవ్యవహారములు, దుస్తులు, ఆభరణములు, మతము మొదలగువానిని గురించి తెలుపుటకు అమరా వతి పెన్నిధివంటిది. ఈ శిల్ప మాంధ్రభూమిని కళామ యము గావించి, నూతన కళావిన్యాసమును సంతరించు కొని “అమరావతీ రీతి' యను పేర బరగు నొక విశిష్ట 266 కళావిభూతికి సూత్రము పన్నినది. ఆధునిక సభ్యతా సంస్కృతులు, సౌందర్యాలంకార పరిణామములు ఇప్ప టికి రమారమి 2000 సం. పూర్వమే మన యాంధ్రు లనుభవించినారని తెలుపుటకు నిదర్శనము, శాశ్వత సౌందర్య కళాఖండము అమరావతీ శిల్పము. పి. య. రె. అమృత షేర్గిల్ (Amritha Shergil) :- అమృత షేర్గిలు బుడాపెస్టు నగరము (హంగరీ) లో క్రీ. శ. 1980 సం. 30 తేది జన్మించెను. ఆమె తండ్రి పేరు ఉమ్రావ్ సింగ్, ఆతడు సిక్కు జాతీయుడు. తల్లి హంగే రియను నారీమణి. సహోదరి ఇందిర. ఉమ్రావ్ సింగు ప్రాకృతీచీవేదాంత విజ్ఞానఖని అగుటయేగాక, సంస్కృత భాషాపాండిత్యమును గూడ గడించెను. అతని భార్య కళాప్రవీణ యై యుం డెను. 1921 వ సంవత్సరము ఏప్రిల్ మాసములో భారత దేశమునకు ఈ కుటుంబము తరలి వచ్చెను. సిమ్లాలో లేక గోరఖ్ పూర్ జిల్లాలోని సరాయా మొదలగు గ్రామములు వీరికి వంశానుక్రమముగ సంక్ర మించిన జాగీర్లు. అచ్చటనే వీరి నివాసము. "అమృత" యొక్క బాల్యమంతయు యూరపుఖండములో నధిక ముగా గడచెను. ఆమె భారతదేశమునుండి విద్యాభ్యా సము కొరకై మొదట తల్లిచే ఫ్లోరెన్సు నగరమునకును, పిదప ప్యారిసు (Paris) నగరమునకును తీసికొనిపోబడెను. అప్పుడామె పందొమ్మిది సంవత్సరముల ప్రాయమును మాత్రమే కలిగియుండెను. అమృత షేర్గిల్ యొక్క చిత్ర కళాఖ్యానము నేషనల్ 'ఎకోల్ దిబూ' అను కళా కేంద్ర ములో జరిగెను. అచ్చటి ప్రొఫెస రొకడు ఆమె భవిష్యత్తు ఉజ్వలముగా నుండగలదని భావించి "నీవు నా శిష్యురాల నగుటకు .నే నెంత యో గర్వించుచున్నాను"అని చెప్పినట. 1938 సం. లో ఆమె వ్రాసినచిత్రము 'సంభాషణము' అనునది గొప్ప మన్ననల బడసి, ఆమెకు అమిత ప్రోత్సా హమును కలిగించెను. 'బూ ఆర్ట్సు'లో ఆమె ఆర్ద్ర భిత్తి చిత్రములు రచించుట నేర్చుకొనెను. మాతృ దేశమునకు మరలివచ్చిన పిదప అట్టిపనికి ఆమెకు అవకాశము లభించ లేదు. ఆమె రచించిన తైలవర్ణ చిత్రములలో భిత్తి చిత్ర ముల పోకడలు పొడచూపుచుండును. ప్యారిసు నగర