పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/326

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగార్జునునిచేత నిర్మితమైన దని పరికీర్తితమైన ప్రాకార రేఖ యిదియే. ఈ స్తూపప్రాకారమునకు రెండువైపుల మనోహరములగు శిల్పచిత్రములు గలవు. శాసనములందీ నిలువు రాతిస్తంభములు ఊర్ధ్వపటలములనియు, అడ్డు కమ్ములు సూచులనియు, పేర్కొనబడినవి. ఈ ప్రాకార మంతయు 9 అడుగుల ఎత్తుగల నిలువరాతి స్తంభముల తోను, రెండు స్తంభములకు నడుమ కుసులుగా చొనిఫిన అడ్డుకమ్ములతోను, నిర్మింపబడినది. ప్రాకారమునకు వెలుపలవై పునగల బొమ్మలు ఆచారసిద్ధమైన రీతిని చెక్క బడినవి. ప్రతి స్తంభము మధ్యభాగమునందు దారుమయ ప్రాకారమున గానవచ్చు మేకుతలలవలె వృత్తములు తీర్పబడినవి. ఈ వృత్తములందు పద్మములు చెక్కినారు. ఈ వృత్తముల నడిమి భాగములు మూడేసి నిలువు పట్టిక లుగ విభాగింపబడి రకరకములు మనుష్య, జంతు, పుష్ప చిత్రములతో నొప్పుచుండును. ప్రాకార రేఖయందలి ప్రాకార రేఖయందలి శిలా స్తంభోపరితలమున దూలములతో మదురువలే నేర్పడిన భాగమునకు ఉష్ణషమని పేరు. సూచీస్తంభోష్ఠీష ములు అతి మనోహరములై దివ్య చిత్రసంపదతో వల రారినవి. వెలుపలివైపున తరంగాకృతిగల పొడుగైన పుష్పదండమును ఎడనెడ మనుష్యులు మోయుచున్నట్లు చిత్రితమైనది. లోపలివైపున జాతక కథలను, బౌద్ధ సంప్రదాయ చరితములను చెక్కినారు. అండాగ్రభాగమున చతురముగనో, చతురస్రముగనో పేటికవలె నుండు నిర్మాణమునకు హర్మిక యని పేరు. ఈ హర్మిక పార్శ్వములు సాంచీ మొదలగు స్తూపము అందువలె దారుమయ ప్రాకార శోభితములై యున్నట్లు చిత్రితము లయినవి. కొంద రీ హర్మికయంచే బుద్ధ ధాతు వులు నిక్షిప్తము అయి యుండెనని చెప్పుదురు. స్తూప మంతటిలో నిదియే పవిత్రమైన యుచ్ఛస్థానము. ఈ విధముగ ప్రాచీన శిల్ప కళాభిజ్ఞతకు అపూర్వోదా హరణముగ పొలుపారిన అమరావతీ స్తూప రాజము కాల విపర్యయమున శతాబ్దులు గడిచిపోవ శిథిలమై భూగర్భస్థ మయినది. ఆయాళాలములందు స్థానికాధికారులగు శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారి భవనమునకు మంచిరాఠి నిచ్చునదిగా నుండి క్రీ. శ. 18వ శతాబ్ద మున సౌందర్యక శాఖిజ్ఞులగు, 'సూయల్' 'బూలర్' 34 265 అమరావతి మున్నగు పాశ్చాత్యుల మూలమున తన అస్తిత్వమును బయలుపరచుకొనినది. కొన్ని శతాబ్దులకు పూర్వము, దీపసహస్రాలంకృతమై, విద్యాకారమై, ప్రార్థనామంది రమై లోకవిఖ్యాతిని సంతరించుకొన్న డీ యమకావతి, బౌద్ధమతావసానదశలో రానురాను తన మహావిభూతి యెల్ల అంతరించిపోగా దీపాలదిన్నెగ మారినది. చలువరాతిమీద చిలితమైన యీ శిల్ప సంపదను జా రూకతతో పరిశీలించినచో బౌద్ధయుగమునాటి యాంధ్ర శిల్పకళా ప్రవీణుల చేతిలో ఈ చలువరాయి కాఠిన్య మును వీడి వారి భావనానుగుణముగ మైనపు ముద్దవలె మారినదని తో పక మానదు. బౌద్ధ ఆంధ్ర శిల్పి తాను మలచుటకు ప్రత్యేక కథావస్తు వున్నంతకాలము తన సొంతదారి నే త్రొక్కెను. కాని, గ్రీకుకళా ప్రభావము నకుమాత్ర మాతడు వశ్యుడు కాలేదని విమర్శకుల యఖ ప్రాయము. గ్రీకుల ఉత్తమ శిల్ప రచనలను, అనేకము లను ఆతడు చూచి యుండవచ్చును. కాని అతడు వాని ననుసరించి యుండలేదు. అమరావతీ శిల్ప చిత్రమునందు గానవచ్చు బుద్ధ విగ్రహ శిల్పముననేగాక మరియే యితర మానవ విగ్రహ రచనమునందుకూడ గ్రీకు విగ్రహ శిల్ప ముఖ్యలక్షణమగు “స్నాయువిస్ఫుటత్వమును” గాంచ లేము. ఇది యొక్కటియే, అమరావతీ మానవవిగ్రహ శిల్పము దేశీయమే కాని గ్రీకు కళానుసరణము కాదని చెప్పుటకు జాలును. ' స్త్రీ ప్రతిపరచనమునం దమరావతీ శిల్పమున త్రిభంగములను చూపుట వాడుక. గ్రీకుల కీ పద్ధతి కేవల విదేశీయము. కాని కొన్ని గిన్నెలు, దుస్తులు, జంతువులు మొదలయినవాని రచనయందు కొన్ని గ్రీకు శిల్ప సామాన్యలక్షణములు గోచరించును. ఇక స్త్రీపురుషుల జంటలలో స్త్రీపురుషులు వస్త్రములు ధరించుట గ్రీకుపద్ధతి. కాని దేశీయ కళాపద్ధతియందు స్త్రీపురుషులు కొంచె మించుమించుగ విగతవక్త్రులుగనే కనబడుదురు. కొన్ని కొన్ని సందర్భములందు శృంగార రూపమయిన ఆచ్ఛాదనముండిన ముండవచ్చును. బౌద్ధ శిల్ప పవిత్రములైన బుద్ధ జీవిత గాథలను కాని, జాతకకథ అనుగాని చెక్కినప్పుడు నగ్నతచూపి యుండ లేదు. లలితకళలలో నొకటియైన సంగీతమునకు గూడ అమరావతీ శిల్పమున ప్రాధాన్యమియ్యబడినది. శిల్పికి