పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/321

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమరావతి ప్రత్యేకావసరముల కుపయోగపడున వేకాని అభ్రకము వలే వివిధావసరముల కుపయోగించు పదార్థ మేదియును లేదు. అభ్రకమును దానియందలి వివిధ రాసాయనిక భాగములనుండి కృత్రిమముగా తయారుచేయు ప్రయత్న ములుకూడ జరుగుచున్నవి. పెద్ద యెత్తున ఈ ప్రయ త్నము లింకను ఫలించినట్లు కన్పించదు. మనదేశమున అభ్రక పరిశ్రమను ఎదుర్భొను సమస్యలు: మన దేశములో అభ్రక పరిశ్రమను ఎదుర్కొనుచున్న సమస్యలు అతిక్లిష్టమైనవి. ఈ పరిస్థితికి ముఖ్య కారణము అభ్రకమును ఉత్పత్తిచేయుటలో అగ్రస్థానము వహించిన ఈ దేశములో ఉత్పత్తిని వినియోగించు నవకాళము లేకపోవుటచే ఉత్ప త్తిదారులు ఇతర దేశములందలి అవసరములనుబట్టియు, అచటి కొనుగోలుదారులు దయా ధర్మములను అనుసరించియు ఈ అమూల్య ఖనిజమును ఇతర దేశములకు ఎగుమతిచేయుట తప్పనిసరి అగుటయే అని చెప్పవచ్చును. ఉత్పత్తి అంతయు అనేకములగు చిన్న చిన్న గనులనుండి వచ్చుచుండుటచే, ఉత్పాదనవిషయమై యెట్టి ప్రణాళిక తయారు చేయబడలేదు. ఇట్టి ఉత్పత్తి దారులమధ్య నేర్పడు పోటీలు ఈ పరిశ్రమ కింకను చిక్కులు కల్గించుచున్నవి. ఇతరదేములందు అభ్రక స్థానీ యములను ఉత్పత్తిచేయు పరిశోధనలు కూడ నిర్విరామ ముగా సాగుచున్నవి. ఇట్టి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొను టకు ఉత్పత్తిదారులు సహకార పద్ధతులలో తమ వ్యవహా రములను నిర్వర్తించుకొనుటకు కాలహరణము చేయక సన్నద్ధులు కావలయును, ఉత్ప త్తిని అధిక ము చేయుటతో పాటు ఖననరీతులు, విపణిరీతులు ప్రమాణీకరించుట అత్యావశ్యకము. దేశీయముగా అభ్రకము నుపయో గించు పరిశ్రమలను పెంపొందించుట, “మైకానైట్” పరిశ్రమను ప్రోత్సహించుటవలన ఇట్టి ముఖ్య ఖనిజమును ఉత్పత్తిచేయుటలోను, ఉపయోగించుటలోను మన దేశము ఇతరదేశములపై ఆధారపడక స్వయంసమృద్ధమగుటకు అవకాశము కలుగగలదు. కె. జి. కె. ఎస్. అమరావతి :- అమరావతి మేరుపర్వతముపై గల ఇంద్రుని రాజధాని. దీనికి స్వర్గలోకమని పేరు. ఇందు సుందరమగు నందనవనమును, అద్భుతమగు నింద్రసభయు 1 262 గలవు. ఇం దప్సరసలు, దేవతలు, యజ్ఞయాగాదు లాచ రించిన మానవులు నివసింతురు. భూలోకమందు అమరావతి యను పేరుకల పురములు అనేక ములుకలవు. ఒకప్పుడు నగరహారమను ఉపనామము గల అమరావతీపురము ఆఫ్గన్ దేశమునం దుండెను. అది ఇప్పుడు ఆఫ్ గన్ స్థానములోని జలాలాబాదునకు పశ్చిమ మున 'నగరాక్' అనబడు చిన్న పల్లెటూరును చుట్టియున్న పాడుదిబ్బలుగ మారియున్నది. మధ్య రాష్ట్రమునందు పూర్వపు విదర్భ (వర్హాడు) కు ముఖ్యపట్టణమై వరలిన "ఉమరావతి” యను మరియొక పట్టణము నేటికిని " అమ రావతి" యనియే వ్యవహరింపబడుచున్నది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో కృష్ణానది వొడ్డున ఉత్తర అక్షాంశము 16° 341 45" పైనను, తూర్పు రేఖాంశము 80°24′21″ పైనను ఉన్న అమరావతీ పట్ట ణము మరియొకటి. ఇది ఇప్పు డొక చిన్న పల్లెటూరుగా మారినది. దీని కొకప్పుడు నాగరాజు దేశ మను పేరుండెను. "అస్తిశ్రీ ధాన్యకటకపురమ్ సురపురాత్పరమ్. . .” అను ప్రాచీనశాసన వాక్యమునుబట్టి ఈ గ్రామమునకు పూర్వము ధాన్యకటకమను పేరుండినట్లు తెలియును. ఆంధ్రదేశము నందుగల పంచారామములలో నొకటి యగు అమరేశ్వ రాలయము నందలి అమరేశ్వరుని బట్టియే ఈ నగరము నకు అమరావతి యను పేరు ఏర్పడినది. ఇందలి శివ లింగము ఒకప్పుడు జైన బౌద్ధ విగ్రహములలో నొక టై యుండెననియు తరువాత బ్రాహ్మణులు దానిని శివలింగ ముగమార్చిరనియు కొందరు చరిత్రకారుల అభిప్రాయమై యున్నది. ఇక్కడ బుద్ధునిపూజయు, అమరేశ్వరుడను వేర శివుని పూజయు, జరుగుచుండెను. క్రీ. శ. 18 వ శతాబ్ది వరకు ధాన్యకటకమను పేరే దీనికి వ్యవహారమునం దుండెను. గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ. శ. 78 ప్రాంత మున ధాన్యకటక సింహాసనము నధిష్ఠించెను. ఆనాటి నుండియే దీనికి ప్రసిద్ధికలిగెను. క్రీ.శ. 7వ శతాబ్దిలో వచ్చిన చీనా యాత్రికుడు యువానా ్చంగ్ ధాన్యకటక వై భవమును ప్రశంసించియున్నాడు. ఈ ధాన్యకటకమను పేరు కాలక్రమమున ధరణికోటగ మారినది. ధరణికోట అను పేరు క్రీ. శ. 1409 నాటి శాసనమున కనబడు చున్నది. ఇప్పుడు వ్యవహారమునందున్న ధరణికోట,