పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/320

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్రకము చూర్ణము చేయబడిన అభ్రకము గూడ అనేక రీతుల పారిశ్రామికముగా ఉపయోగపడుచున్నది. ఈ చూర్ణము అభ్రకమునుండి ప్రత్యేక సాధనములతో తయారుచేయ బడుచున్నది. తడి పద్ధతి (Wet process) పొడిపద్ధతి (Dry process) అనబడు పద్ధతులలో ఇది తయారగుచున్నది. గోడలకు ఉపయోగించు కాగితములలోను రంగుల (paints) లోను, గుడారములు కురియకుండ చేయుటకును, రబ్బరు పరిశ్రమలోను, గట్టి రబ్బరులోను, కొన్ని రకముల రబ్బరువస్తువులలోను, జడపూరకము (inert filler) గాను, రబ్బరుటైరులను పోత (moulding) పోయుటయందును, గంధ దృంహణము (vulcanising) నందును, కందేశ (lubricant) గాను, టైరులకు లోనున్న నాళములతోడి రాపిడి తొలగించుటకును, టైరులు లోపలనున్న నాథ ములతో అతుకుకొనకుండ చేయుటకును తడిపద్ధతిపై తయారగు చూర్ణము వాడబడుచున్నది. కొన్ని ప్లాస్టిక్ (plastic) పదార్థముల తయారునందు కూడ ఇది వాడ బడుచున్నది. పొడి పద్ధతిపై తయారుచేయబడిన చూర్ణము గృహములలోపల కప్పుట కుపయోగించు కాగితమును తయారుచేయుటకు ఉపయోగపడుచున్నది. ఇది యింకను గొట్టములలోను, కాగుల (boilers) లోను, పరివేష్టనము (lagging) నకును, లోహమును కరగి అతుకు పరికరముల (welding rods) పూతగను, నాళికా కాచము (pipeline enamel) నకును, అభితాపనము (annealing) నందును, వస్త్రపరిశ్రమయందును, నూనె బావులను తొలుచుట (oil well drilling) లోను, కాంక్రీటు మొదలగు పదార్థ ములచే తయారుచేయబడు వెంకుల అంక రణము నందును గ్రామఫోను రికార్డులయందును, ప్రేలుడు పదార్థముల (explosives) ఉత్పత్తి యందును, మార్జన (cleansing) సంయోగములయందు ఆధారము (base) గాను, శిలాముద్రణ (lithographing) మందును కూడ ఉపయోగింపబడు చున్నది. క్రిస్మస్ పండుగయందలి వృక్షాలంకారములకును చలనచిత్ర నిర్మాతలచే కృత్రిమ హిమముగాను ఇది వాడబడుచున్నది. విద్యుత్పరిశ్రమలో వాడబడు మైకాలెక్స్ (micalex) అను విద్యుత్సం వాహ నిరోధ పదార్థ నిర్మాణమునందు ఇది ము ఖ్య పదార్థమై యున్నది. మనదేశమున ఆయుర్వేద ఔషధ 261 ములందు కూడ చూర్ణరూపమున అభ్రకము వాడబడు చున్నది. కృతకాభ్రకము (మైకానైట్): అభ్రకపు రేకులు మగుటలో గల యిబ్బందులవలనను, దాని యధిక మూల్యమువలనను ఇతర దేశములు కృతకాభ్రకమును తయారుచేయుటలో ఉత్సుకతను ప్రదర్శించినవి. తత్ఫలిత ముగా గత శతాబ్దాంతమున మొదటిసారిగా "మైకా నైట్" నిర్మింపబడుట జరిగెను. సన్ననిపొరలుగా నున్న అభ్రకమును జాగ్రత్తగా నమర్చి సరియగు జిగురు (adhesive) పదార్థమును ఉపయోగించి దళసరితోను, పరిమాణములలోను దీనిని తయారుచేయు చున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రములయందలి అభ్రకపరిశ్రమ అభ్రకపు ముక్కలను వినియోగించి "మైకానైట్" నిర్మించుటపై చాలవరకు ఆధారపడి యున్నది. సుదీర్ఘ పరిశోధనల ఫలితముగా ఈ పరిశ్రమ యందు ఈ దేశము అగ్రస్థానము వహించు నవకాశము పొందగలిగినది. అవసరమగు అభ్రకపు స్థానీయములు (Substitutes for Mica): సాధారణ పరిస్థితులలోను, అంతకంటే ముఖ్యముగా యుద్ధ సమయము లందును తమతమ యవసరములకు సరిపడు అభ్రకముతో ఇతర దేశములనుండి దిగుమతి చేసికొనుటలో గల ఇబ్బందులనుబట్టి కొన్ని దేశములు అభ్రకస్థానమున ఉపయోగించుటకు వీలగు పదార్థము లపై తమ దృష్టిని మరల్చినవి. ఇట్టి పదార్థములలో కొన్ని ఖనిజములు, మరికొన్ని కృత్రిమ పదార్థములు కలవు. ఖనిజములలో వెర్మిక్యులైట్ (Vermiculite) మొదలగునవి కొన్ని ప్రత్యేకోపయోగములు కలిగి యున్నను అభ్రక స్థానమును నాక్రమించు ఖనిజ మింకొకటి లేదు. అభ్రకమునుండియేతయార గుచున్న

  • మైకాలెక్స్" సంగతి ఇదివరకే పేర్కొనబడినది. అభ్రక

స్థానమున వాడబడు కృత్రిమ పదార్థములు చాలవరకు కాగితమునందు కృత్రిమనజ్జరసముల (Artificial resins) పూతచే తయారగుచున్నవి. పెర్టి నాక్స్ (Pertinax), బేక్ లైట్ (Bakelite), పేక్పోలిన్ (Paxolin), ఫార్మట్ (Formalite), ఆల్సిఫిల్మ్ (Alsi film) మొదలగు పదా ర్థము లీ తరగతికి చెందిన వే. ఇవి అన్నియు కొన్ని కొన్ని "