పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/319

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్రకము కొక విశిష్టస్థానము లభించినది. ఇతరదేశములయందు యంత్రసహాయమున సాధింపబడనేరని ఈ కార్యమును వీరు తమ హస్తలాఘవముచే సునాయాసముగా చేయ గలుగుటచే ప్రతివత్సరము పొరలుగా చీల్చుటకు కొంత L అభ్రకము మనదేశమునకు పంపబడుచున్నదనీ ఆశ్చ ర్యములేదు. మనదేశమునందలి అభ్రకపు గనులవద్ద మిగిలిపోవు అభ్రకపు ముక్కలు (Scrap mica) విరివిగా పారవేయ బడుచున్నవి. అభ్రక చూర్ణమును తయారుచేయుటలో ఇతర దేశములం దిట్టి అభ్రకము ఉపయోగింపబడు చున్నను మనదేశమున నింకను ఈ విషయముపై దృష్టి మరలలేదు. పారిశ్రామిక దృష్ట్యా అభ్రక లక్షణములు : అభ్రకపు రేకులకుగల ఉపయోగములు వాటి స్ఫటికా కారము (Crystal) పై, వాటి నిర్మాణము (Structure) పై చాల వరకు ఆధారపడియుండును. స్ఫటిక ములకు ఉండవలసిన ముఖ్య లక్షణములు పగుళ్ళు లేకుండుట, వాటి తలము దృఢముగాను, విశాలముగాను ఉండుట, ఇతర ఖనిజ పదార్థముల యొక్కగాని, జీవసంబంధ (Organic) పదా ర్థముల యొక్క గాని రంగు వాటియందు లేకుండుట,

  • అంగుళములో 1000 మందముగల పొరలుగా సులువుగా

వేరుపరచుటకు అనువుగా నుండుట ముఖ్యమైనవిగా పరి గణింప బడుచున్నవి. ప్రపంచములో ప్రస్తుతము విద్యు త్పరిశ్రమలో ఉపయోగింపబడు అభ్రకపు రేకులలో అధిక భాగము ఒకటినుండి మూడు చతురపు టంగుళముల వైశాల్యముగల చిన్న చిన్న పుస్తకములనుండి లభ్యమగు చున్నది. సన్నటి పొరలలో అభ్రకము శ్రీ అంగుళము వ్యాసము గల కడ్డీ (rod) చుట్టును చుట్టినను ఏమాత్రము తునగకుండ వంచుటకు వీలు (flexible) గా నుండును. సాధారణ పరిస్థితులలో అభ్రకము కరుగదు. అత్యధికోష్ణము సోకి నను ఇది ఏవిధమైన భౌతిక ములును, రాసాయనిక ములును నగు మార్పులను చెందదు. అంతియేకాక ఆకస్మిక విద్యు దుష్ట భేదములవలనగూడ దాని లక్షణములలో ఎట్టి మార్పునుకలుగదు. అందుచే ఇది వొక అద్భుతమగు ఉష్ణవి సంవాహన (Heat insulating) పదార్థమని తేలుచున్నది. 260 ఇదేవిధముగా అభ్రకము విద్యుత్పరిశ్రమలో విసం వా హన (insulating) పదార్థముగా ఉపయోగపడు చున్నది. అభ్రకమునందు ప్రవేశింపగల విద్యుత్ప్రవాహము అతి సూక్ష్మమైనది. అందుచే అనవసరమగు తావులందు ఆ మాత్రమే ప్రవాహమార్గ ముండుటకును, శేషించిన తావు లందు ప్రవాహమును నిరోధించుటకును ఇది ఉపయోగ పడుచున్నది. స్థితి భేదము చెందకుండ అభ్రకము అత్యధిక శక్తిమంతమగు విద్యుత్ప్రవాహమునకు తాళగలదు. పారద్యుతిక క్షేత్రము (dielectric field) నందు క్షణిక ముగా స్థితిక విద్యుచ్ఛక్తి (Electrostatic energy) ని పట్టియుంచి అత్యల్ప నష్టముతో తిరిగి దానిని విడువ గలిగి యుండుట చే ఇది విరివిగా రేడియో కండెన్సరుల (Radio Condensers) లో వాడబడుచున్నది. ఈ ఖనిజమునకుగల ఇతర లక్షణములలో నీటి సన్ని ధిలో స్థిరత్వము (stability) సన్నని పొరలలో దీనికిగల పారదర్శకత (transparency), సంపీడన నిరోధకశక్తి (incompressibility) కూడ ముఖ్యమైనవి. అనునాదము (resonance) యను స్వభావమును గలిగియుండుటచే నిది రేడియో పరిశ్రమలో ముఖ్యముగా వాడబడుచున్నది. V_ అభ్రకము యొక్క ఉపయోగములు: పైన వివరించి నట్లు విద్యుత్పరికరముల నిర్మాణము అభ్రకపు రేకులపై ఆధారపడియున్నది. ఇట్టివాటిలో వ్యత్యయ ఖండములు (commutator segments), V ఆ కారపు బిళ్ళలు (Verings), ఆర్మచూర్లు (armatures), విమానవహిత్ర స్ఫులింగనిగము లు (air plane motor spark plugs), రేడియో నాళములు (radio tubes), పరివర్తకములు (transformers), రేడియోకం డెన్సర్లు (radio condensers) దూరశ్రవణయంత్రములు గలవు. ఇవిగాక విద్యుత్ సహా యమున పనిచేయు స్త్రీ పెట్టెలు, రొట్టెలను కాల్చు పని ముట్లు (toasters), నీటిని కాచు సాధనములు (water heaters) మొదలగు గృహోపకరణములుకూడ గలవు. పరితాపనీ వాతాయనముల (stove windows) కును,, లాంతరుచిమ్నీగాను, కొలుముల (furnace) దృష్టి రంధ్ర ములు మూయుటకును, పగులని సులోచనములకును, నియోన్ (Neon) దీపములలోను, వలయకములు (wash- ers) గాను కూడ అభ్రకము ఉపయోగింపబడుచున్నది.