పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/318

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రపంచమునందు ఉత్పత్తియగుచున్న అభ్రకములో నూరింట నెనుబదిపాళ్ళు భారత దేశమునందలి నిధులనుండి లభ్యమగుటచే ఈ విషయమున మనదేశము అగ్రస్థానము ఆంధ్ర దేశములో 1940 - అభ్రకము వహించి యున్నది. 1940-58 సంవత్సరముల మధ్య మన దేశమందలి అభ్రకము యొక్క ఉత్పత్తి వివరములు రేఖాపట (గ్రాఫ్) రూపమున నీ క్రింద నీయబడినవి. అభ్ర క పు ఉత్పత్తి 1953 హండ్రెడ్ వెయిట్లు (వేలలో) 200 180 160 140 120 100 80 60 40 20 0 194-0 41 42 44 45 46 47 49 50 $1 52 1953 సంవత్సరములు రష్యా, కెనడా, రొడీషియా, టాంగనీకా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రములు, మెడ గాస్కర్, ఆర్జంటీనా, బ్రెజిల్, నార్వే, కొరియా, గౌటి మాలా మొదలగు దేశములందలి గనులనుండి గూడ అభ్రకము సంగ్రహించబడుచున్నది. అభ్రకమును శుభ్రపరచుట, క్రమస్థావనము (grading) : గనులనుండితీయబడిన అభ్రకపుస్తకములలో మంచివానిని వేరుపరచి భాండాగారములలో నిలువచేసెదరు. ఇట్టి పుస్తకములను దళసరి రేకు (sheet) లలోనికి చీల్చి వాని చివరలను సమముగానుండునట్లు కోసివేయుదురు. ఈ పనికై కొడవండ్లను, క త్తెరలను వాడుదురు. ఈ రేకులలో 259 ఇమిడియున్న ఇతరఖనిజములను బట్టియు, వాటి రంగును బట్టియు వాటిని వివిధరకములలోనికి విభజింతురు. వాటి నుండి లభ్యము కాగల దీర్ఘచతురస్రాకారపు గరిష్ఠ వైశాల్యమును బట్టి వాటిని వేర్వేరు క్రమములలో నుంతురు. చిన్న చిన్న పుస్తకములుగ లభ్యమగు నభ్రకమును ఎగుమతిచేయుటకుముందు వాటిని సాధ్యమైనంత సన్నని పొరలుగా వేరుచేతురు. బీహారురాష్ట్రమున అభ్రకమును చీల్చుటయే వృత్తిగాగల బాలబాలికలు, స్త్రీలు ఈ పని యందు అత్యంత సామర్థ్యముకలవారై యుండుటవలన అభ్రకమునుచీల్చుటలో ప్రపంచమున బీహారు రాష్ట్రమున