పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/317

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్రకము మున్న గువాటినికూడ పరిశీలింపవలెను. ఇట్టి బహుళాంశ ములతో కూడిన వాతావరణమునందే అభ్యసనకృత్యము కొనసాగును. అభ్యసనక్రమ రంగమున ప్రస్తుతము పరి శోధనము జరుగుచున్నది. ఈ రంగమున ఇంకను ఇట్టి పరిశోధనము ఎంతో అవసరము. ప్రతి రంగమునందును లక్ష్యసిద్ధియు, అభివృద్ధియు అభ్యసన మనస్తత్వము వైననే ఆధారపడి యున్నవి. డా. శ్రీ.శ్రీ. అభ్రకము* :- అభ్రకము (Mica) అను పేరున పిలువబడు కొన్ని శైలస్థ ఖనిజములు అనాదినుండియు మానవులచే విరివిగా ఉపయోగింపబడుచు వచ్చినవి. ఇవి కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి యున్నవి. మైకా ( Mica) అను పదము ల్యాటిన్ భాషయందలి మైకేర్ (Micare మిణుకు మిణుకు మనుట) పదమునుండి వచ్చి నట్లు భావింపబడుచున్నది. ఈ సంచయమునందలి ముఖ్య ఖనిజముల పేర్లు, వాని రాసాయనిక నిబంధములు (Chemical compositions) క్రింద ఉదహరింపబడినవి. 1. అభ్రకము - మస్కో వైటు (Common mica, Potassium mica) - H. K. Al (Sio,), 2. మలాభ్రకము - బయోటైట్ (magnesium iron mica) - H, K (Mg, Fe), (Al, Fe) (Sio,), 8. భ్రాజాభ్రకము – ఫ్లోగోపైట్ (magnesium mica) H, K Mg, Ala (Sio) . 4. లఘుజాభ్రకము - లెపిడోలైట్ (lithium mica) (O H F), K Li All Sis O 10 5. రాభ్రకము - వెరాగోనైట్ (Sodium mica) Ha Na Al, (Sio), అభ్రకమునకు గల పారిశ్రామిక ప్రాముఖ్యమునకు దానికి గల కొన్ని అనన్యలక్షణములే కారణము. ఈ లక్షణము లన్నియు ఏ ఇతర ప్రాకృతిక పదార్థమందు గాని, సంశ్లేష (Synthetic) పదార్థమందుగాని లేనందున విద్యుద్రాసాయనిక పరిశ్రమలలో అభ్రకము యొక్క ఉపయోగము అనివార్య మగుచున్నది. ముఖ్యముగా విద్యుత్పరిశ్రమలో, అభ్రకము లేనిదే ప్రస్తుతము సాధ్యమైన పురోభివృద్ధికి అవకాశముండి యుండెడిది కాదు. ఇంత ముఖ్య ఖనిజ మగుటవలననే దీనిని అమెరికా ప్రభుత్వపు సైనిక నౌకాస్త్రగణము (Army and Navy Munitious Board) వారు తమ ఇరువదిమూడు యోధన నైతిక (Strategic) ఖనిజములలో చేర్చిరి. క్రీ.శ. 1878 సంవత్స రమున ఎడిసన్ మొదటి మోటారు తయారు చేసి నప్పటినుండి నేటివరకు విద్యుత్ శాస్త్రీయ పురోభివృద్ధికి ప్రత్యేక లక్షణ లక్షితమగు ఈ ఖనిజసంచయము చాల దోహద మిచ్చినదని చెప్పుట అతిశయోక్తి కాజాలదు. భారతదేశ మందును, అన్యదేశముల యందును గల అభ్రకపుగనులు : భారత దేశమున మస్కో వైట్ విరివిగా లభ్యనుగుచున్నది. ద్రవస్థితినుండి ఘనీభవించిన అనేక రక ముల శిలలలో గ్రానైట్లు (granites) ఆఖరున ఏర్పడిన శిలలుగా పరిగణింపబడుచున్నవి. ఈ స్థితిలో మిగిలిన ద్రవపదార్థములోను, వాయురూప పదార్థములోను అభ్రకనిర్మాణమునకు అవసరమగు వివిధపదార్ధములు నిల్వయుండును. ఇవి వెగ్మటైట్స్ (Pegmatites) అనబడు శిలలలో అభ్రక పుస్తకములుగా తయారగుచున్నవి. పెగ్మటైట్స్ విభిన్నమగు శిలలలో చొచ్చుకొని అనేకము లగు ఆకారములను గలిగియుండును. అభ్రకము ఇట్టి పెగ్మటైట్సునుండి సేకరింపబడుచున్నది. మన దేశమున ఉత్పత్తియగు అభ్రకము బీహారు, ఆంధ్రరాష్ట్రము, రాజస్థాన్ అను తావులనుండి వచ్చుచున్నది. ఇందులో బీహారునందలి 'కోడర్మా' అను అభ్రక క్షేత్రమునందు 'బెంగాల్ కెంపు' (Bengal ruby) అని పిలువబడు మస్కో వైట్ లభ్యమగుచున్నది. మనదేశమున నుత్పత్తియగు అభ్రకములో నాలుగింట మూడువంతు లిచ్చటిదే. కోడర్మా క్షేత్ర విస్తీర్ణము సుమారు 1500 చతురపుమైళ్లు. ఆంధ్ర దేశమునందలి నెల్లూరు ప్రాంతమునుండి, హరితా భక (green mica) మనుమస్యో వైట్ లభ్యమగును. విద్యు త్పరిశ్రమలో బీహారునందలి దానికంటె ఆంధ్రదేశములో ఉత్పత్తియగు అభ్రక మే అధికముగా వాడుకలో నున్నది. దీనికి కారణము ఇచ్చటి అభ్రకపు రేకులు అధికముగా సమతలము కలిగియుండుటయే. రాజస్థాన్ నందు కూడ 'కెంపు' అభ్రకము లభ్యమగును. ఇచ్చటి గనులు చెదురు మదురుగా నున్నవి.

  • భారతీయ జాతీయ భూతాత్విక సమీక్ష డైరక్టరుగారి అనుమతితో.

258