పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/316

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేవలము పరిస్థితులను తెలిసికొనుటయేగాక, అ వాటి యఁగ రహస్య విషయములను తెలిసికొనుట కూడ అయియున్నది. మనుష్యుడు అభ్యసించునపుడు తాను స్వేషించు పరిస్థితుల యొక్కయు తాను ఉపయోగించు వస్తువుల యొక్కయు లక్షణములను తన మనస్సునకు పట్టించుకొనును. అతడు చలనాత్మక విషయములను అభ్యసించునపుడు, ఒక సారి కదల్పబడిన పిదప స్వతంత్ర ముగా నడచునట్టి క్లిష్టచలన క్రియలను సాధనముగా చేసికొనును. అభినయించుట, నృత్యము చేయుట, ఉపన్య నించుట అనునవి ముఖ్యోదాహరణములు, ఇట్టి చలనా త్మక అభ్యసన రీతులన్నియు ఆరంభమున పరిశీలనము పై నెక్కువ ఆధారపడిన వే అయినను, కాలక్రమమున అవి నిత్యాభ్యాస కారణముగా, నాడీసంప్రదాయమున లీనమై కనీసములైన పరిశీలన నిగ్రహములతో కొనసాగును. అందువలన అభ్యాసవిషయమున, పరిశీలనములోను నిర్వ హణములోను భాషను, భావమును అర్ధముచేసికొనుట లోను, మనుష్యుడు జంతువుకంటె అనేక రెట్లు అధికుడు. అల్పకృత్యములను చేర్చి వాటిని పెద్ద విషయముగా రూపొందించుటయందే మనుష్యుని కౌశలము విశద మగుచున్నది. అభ్యసనము జరుగు విధానము: జంతువులు, మాన వులు అభ్యసించు పరిస్థితులను పరామర్శించిన పిదప, అభ్యసన క్రమమునందలి ముఖ్యాంశములను పరిశీలించుట అవసరము. అభ్యసన క్రమమును గూర్చి వెలువడిన ఏ చిన్న సిద్ధాంతమునుకూడ ప్రపంచమునందలి మనస్తత్వ శాస్త్రజ్ఞు లందరును సర్వసామాన్యముగా ఒప్పుకొని యుండ లేదు. అయినప్పటికిని, ప్రతిపాదింపబడిన ప్రతి సూత్రమునందును కొంత సత్యము లేకపోలేదు. ప్రాజ్ఞు లింకను అభ్యసన క్రియ విషయమున నూతన సూత్రములను కనుగొనుటకు విశేష ప్రయత్నము చేయుచునే ఉన్నారు. అభ్యననమును గూర్చి వెలువడిన ఆదిమ సూత్రములలో నొకటి 'సన్ని హితత్వమువలన కలుగు భావసం యోగము.' అనగా రెండుభావములు కలిసి అనుభవింపబడుటచే, అవి సంయో గము నొందును. వ్యతిరేకముగా చెప్పబడినచో ఈ సూత్రము ఎక్కువదృఢముగాను స్పష్టముగాను ఉండును. రెండు భావములును కలిసి అనుభవింపబడినప్పుడుగాని 33 257 అభ్యసనమన స్తత్వము సంయోగమును చెందవు. సంబంధములు సమకూర్చుటలో సన్నిహితత్వముకూడ ఎక్కువ సమర్థము కాదు. రెండు భావములను సమ్మేళనము చేయుటకు నేర్చుకొనువానికి వాటిలో ఏకత్వము గోచరింపవలెను. మరియెక ప్రాచీన సూత్రము కలదు—అది, "సాతత్యము, ఆవృత్తి, అభ్యసన క్రమమునకు తోడ్పడును" అని చెప్పుచున్నది. పరిస్థితి జనితక్రియా విషయమున ఇది సత్యమే. అందు ఆవృత్తి జరుగనిచో సరియైన సమాధానము ఉండజాలదు. అయితే ఈ సూత్రముకూడ పూర్వపక్షము చేయబడినది. ఎందు చేత ననగా వట్టి ఆవృత్తివలనను అభ్యసనము వలనను, ఎవరును సంపూర్ణులు కాజాలరు. ఎన్ని ఆవృత్తులు జరిగి నను సరియగు కృషి లేనిచో, గొప్ప కౌశలముగాని, పాండిత్యముగాని చేకూరజాలదు. ఒక కార్యములో నిమగ్ను డగుటకు వ్యక్తికి సరియగు అభిరుచి ఉండవలెను. అభిరుచియే అతడు చేయు పనిమీద ఎక్కువ శ్రద్ధను చూపుటకు తోడ్పడును. అట్టికృషి అభ్యాస క్రమమునకు దోహదము చేయును. అభిరుచి, శ్రద్ధ అను వాటిని మనము విమర్శించినచో నిక్కముగ, ప్రతిఫలము, శిక్ష అనునవి వాటి లక్ష్యములనియు వీటివలన అభిరుచియు, శ్రద్ధయు యు జనించుననియు, ఇవియే అభ్యసన క్రమమునకు తోడ్పడుననియు తేటపడగలదు. ఇవి అభ్యసనమును నియ మించు ప్రోత్సాహకారణములలో కొన్నియైయున్నవి. ముగింపు : అభ్యసన సూత్రములలో, కొన్ని లోప ములు (limitations) ఉన్నను అవి అభ్యసన క్రమమును కొంతవరకు విశదీకరించును. అన్ని రంగములయందువలె, సామాన్యమైన అభ్యసనమునందును, కొన్ని అపవాద ములు కలవు. కొందరు వ్యక్తులు తమ ప్రతిభ చేత గాని, సులభగ్రహణ శక్తి చేతగాని ఇతరులకంటే అతి త్వరితము గాను, ఉత్తమముగాను నేర్చుకొనగలరు. ఆల్లే కొందరు సామాన్యమైన తెలివితేటలుకూడ లేని వారుగానున్నారు. ఈ విషయమున ఇతర అంశములుగూడ పరిగణింప దగి ఉన్నవి. మనస్తత్వ శాస్త్రమును పరిశీలించునపుడు సంపూర్ణ విషయమును దృష్టిలో నుంచుకొని ఇతర శక్తులన్నింటి పాయమున దానిని పరిశీలింప వలెను. అభ్యసన క్రమ పద్ధతిని సంపూర్ణముగా అర్థము చేసుకొనుటకు వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తి, ఆలోచన, తెలివి, మనోవృత్తి,