పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/315

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్యసనమన స్తత్వము యనగా వస్తువు యొక్క తత్త్వము యొక్క అవగతియై యున్నది. ప్రొఫెసర్ వుడ్ వర్తు ఇట్లు చెప్పెను: ఆధునిక యుగములో మనము మోటారు కార్లను, రేడియోలను, వాటి యంత్ర రచనాజ్ఞానము ఏమాత్రమును లేకయే ఉపయోగించుకొనుచున్నాము. ఏ వస్తువు యొక్క గాని సంపూర్ణమైన అంతర్దృష్టిగలవా రెవ్వరును లేరు. 'అంత ర్దృష్టి' అను పదములో పనులను నెరవేర్చుకొనుటకై మనము చేయు సామాన్య పరిశీలనముకూడ ఇమిడి యున్నది" కావున అంతర్దృష్టి యొక్క స్థానమున మనము 'పరిశీలనము' అను పదమును వాడవచ్చును. ఈ పద మును వాడుటలోకూడ కొంత చిక్కు లేకపోలేదు. కారణము - పరిశీలన మనగా బుద్ధిపూర్వకమైన పరిశీలన మగుటయే, జంతువు దాని జ్ఞానేంద్రియముల ద్వారమున పరిస్థితి యొక్క వివరములను తెలిసికొనును. ముందు చూపు కలిగియున్నచో అది కార్యరంగమును పరిశీలించి లక్ష్యసిద్ధికై మార్గమును అన్వేషించును. జంతువు కేవల పరిశీలనముచేత నే అనగా, యత్న - ప్రమాద పద్ధతి ననుసరింపక యే, లక్ష్యసిద్ధి నొందజాలదు. ఇందులో విశేషముగా వెనుకచూపు అవసరమగుచున్నది. తరచుగా పరిస్థితి జనిత క్రియ (Conditioned Reflex): జంతువుల మనస్తత్వ రంగమున పరిశీలన రహితమైన మరియొక ముఖ్యమైన అభ్యసనక్రమము కలదు. అదియే పరిస్థితి జనితక్రియ. ఈ శతాబ్ది ఆరంభమున (జంతుదేహ ధర్మ శాస్త్రజ్ఞుడైన) ఒక రష్యను దేశీయుడు 'పాన్ ల్లోవ్' అనునాతడు కుక్కలను పరిశోధనవిషయముగా గ్రహించి, వాటియొక్క జీర్ణశక్తిని గురించి పరిశీలించెను. అందు అతడు కుక్కల లాలాజలస్రవణమును నిర్ణయించుటకు ఒక పద్ధతిని కనుగొనెను. కుక్కలకు నోటిలో ఆహార మన్నప్పుడేగాక, అవి ఆహారమునుగాని, ఆహారమును పెట్టు పళ్ళెరమునుగానీ, ఆహారమునిచ్చు మనుష్యునిగాని, చూచినవుడును, ప్రక్కగదిలోనున్న ఆ మనుష్యుని కాలి చప్పుడు విన్నప్పుడును, వాటి నోటినుండి లాలాజలము ఊరుటను 'పావ్ ల్లోవ్' కనిపెట్టెను. నోటియందు ఆహార మున్నప్పుడు లాలాజలము ఊరుట సహజక్రియయై యున్నది. ఆహారపుపళ్ళెరమును చూచుటచేతను, ఆహార మిచ్చు మనుష్యుని పదధ్వనిని వినుటవలనను, లాలాజలము ఊరుట నిస్సంశయముగ అసహజక్రియ, అనగా, అభ్యస్త మైన క్రియ. దీనికి ఆధారము ఆ జంతువునకు అంతకు మునుపు ఆహారము పెట్టబడిన పరిస్థితులు. అందుచేత 'పావ్ లోవ్' దీనికి 'పరిస్థితిజనిత క్రియ' యని వేరి డెను. ఇది యథార్థముగా ఒక ప్రతిక్రియ కాదు. అందుచే దీనిని మనస్తత్వజ్ఞులు సంనియమక్రియ యనిరి. (Conditioned Response). మానవుల అభ్యసనము : జంతువులు నేర్చుకొను సామాన్య విధానమును గూర్చిన వివరములను తెలిసి కొనినపిదవ మానవులు నేర్చుకొను రీతిని పరిశీలించుట మన కర్తవ్యము. మానవుడు జంతువుకంటె అధికుడు, కొన్ని అంశములలో అతడు నేర్చుకొను పద్ధతి జంతువులు నేర్చుకొను పద్ధతికంటె విశిష్టము. 1. మానవుడు జంతువుకంటే విశేషముగా నేర్చు కొనును. 2. మానవుడు నేర్చుకొను విషయము జంతువు నేర్చు కొను విషయముకంటే ఎక్కు వ శక్తికలిగి యుండును. 8. మానవుడు నేర్చుకొనలేదు. నేర్చుకొనగలిగినదంతయు జంతువు అతడు మానవుడు జంతువు నేర్చుకొనునట్లే నేర్చుకొనును. నేర్చుకొను క్రమము, పరిశీలనము. యత్న- ప్రమాదపద్ధతి ఇవి ఉభయత్రసమానములే. అయినను, ఆతని పరిశీలనము, యత్న - ప్రమాద పద్ధతి రెండును ఉన్నత స్థాయికి చెంది యుండును. మనుష్యునిపరిశీలనము కేవలము జ్ఞానేంద్రియ జన్య మే కాదు. నియమములు కలిగినవాడై, అల్పములయిన ఉద్రేకములకు లోనుకాడు. చిక్కులు పెట్టుట, కలవర పెట్టుట, అను ప్రయోగములు మనుష్యుని పరముగా జరుగగా, అతడు వాటిని బోధ చేసికొనుట యందును, వాటినుండి విముక్తిని సంపాదించుకొనుట యందును జంతువులకంటే విశేషమైన ఉత్కృష్టతను ప్రదర్శించునని తెలియుచున్నది. మానవుని చేతులు కౌశలముతో పనిచేయుటకు ఎక్కువ వీలుగానున్నవి. దీనికంటే ముఖ్యమైన విషయ మేమనగా అతని పరిశీలనశక్తి, జంతు పరిశీలనశక్తి కంటె గొప్పది. అతడు పరిశీలనమువలన వేర్చుకొనుట అనగా,