పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/314

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్యసనమన స్తత్వము బడెను. పిదప ఆ శతాబ్ది అంతమున ఉత్తములయిన మన స్తత్వజ్ఞులు జంతు విజ్ఞానముపై ప్రయోగములను జరిపిరి. ఇట్టి ప్రాథమిక ప్రయోగములు మనుష్య విజ్ఞాన ముపై గాక జంతువిజ్ఞానముపై ఏ కారణముచే ప్రారం భింపబడినవి అని మనకు సందేహము కలుగవచ్చును. అందులకు కారణములు రెండు. జంతు విజ్ఞాన మెట్టిదో తెలిసికొనవలయునను మన స్తత్వజ్ఞుల కుతూహల మొకటి. అతి సూక్ష్మమును ప్రాథమికమును పైన జంతువిజ్ఞాన సూత్రములతో నారంభింపదలచుట రెండవది మానవుని స్థితి చిక్కైనది. అట్లే అతడు ఆర్జించు విజ్ఞాన పద్ధతులును చిక్కులతో కూడినవే. జంతువిజ్ఞాన పద్ధతి యొక్క పరి శీలనము, మానవుడు విజ్ఞానార్జనము చేయు క్రమమును అర్థము చేసికొనుటకు ఎక్కువ ఉపకరించినది. అందులకు కారణము, జంతువులు నేర్చుకొనుటలో కనిపించు అనేక అంశములు, ప్రవృద్ధమైన దశలో, మానవులలో కని పించుటయే. జంతువుల అభ్యసనము జంతువులను గురించి అతి విస్తృతముగా జరుపబడిన ప్రయోగ పరిశీలనయందు, లాయిడ్ మార్గన్ అను నాతడు కృషి చేసి, ప్రాథమిక మైన ఒక మూలసూత్రమును ఏర్పరచెను. దానిని లాయిడ్ మార్గను సూత్ర మందురు. “ఏ క్రియయైనను మన స్తత్వ' పరిధులకంటే అధోభాగమున పనిచేయు శక్తి యొక్క ఫలితముగా పరిగణింపబడినచో, ఆ క్రియను ఒక ఉన్నతమానసిక శక్తి యొక్క ఫలితమని ఏ విధము గాను చెప్పలేము. అను నదియే లాయిడ్ మార్గన్ యొక్క సిద్ధాంతము. దీని ననుసరించి పరిశీలించగా, జంతువులలో - ముఖ్యముగా అతి తెలివిగల జంతువులగు కోతులలోకూడ సంపూర్ణమగు హేతుజ్ఞానము ఉన్నట్లు కనపడదు. కాని వాటి యొక్క ఏమాత్రపు వివేకమును చూపు ప్రవర్తనమైనను హేతుజ్ఞాన పూర్వకముగా చేయ బడినదేమో అను విభ్రాంతిని కలిగించును. జంతువుల అభ్యసనమును తెలిసికొనుటకై చేయబడిన వివిధ ప్రయోగ పద్ధతులును, వాటిలో ముఖ్యముగా ప్రయత్న- ప్రమాద పద్ధతియు ఈ దిగువ చెప్పబడిన సామాన్యాంశముల పై ఆధారపడి యున్నవి : (అ) ఒక లక్ష్యమును చేరుటకు ఒక సంకల్పము, 255 (ఆ) లక్ష్యమును చేరుటకు స్పష్టమైన మార్గము కని పించక పోవుట. (ఇ) పరిస్థితి పరామర్శము. (ఈ) లక్ష్యమార్గములను వివిధరీతుల అనుసరించుట. (ఉ) చిట్టచివరకు లక్ష్యమును జేరుట.

ప్రయత్న - ప్రమాద - పద్ధతి జంతువు ఈ ప్రయోగ విధానము నంతయు నడిపి జయము గాంచినపుడు ఆది - . ప్రయత్నప్రమాద పద్ధతి ద్వారమున అభ్యసించిన దని మనము చెప్పగలమా? కాని మనస్తత్వజ్ఞులు ఆ పద్ధతి ప్రకారము అది నేర్చుకొనలేదని అందురు. ఏలనగా ప్రతి దినము కావించిన ఈ సంక్లిష్టప్రయోగమునందలి ఏ విభాగము యొక్క సాయమున ఆ జంతువు ప్రయత్న ప్రమాద పద్ధతియొక్క ఆవృత్తిని తగ్గించి, విషయ గ్రహణములో నేర్పును సంపాదించినది అను నంశ ము విచారణీయము. ఈ ప్రయోగము జరుగుచున్నంత కాలము జంతువు కదిలి పరిశీలించుచున్నదన్నమాట నిజమే. కాని చలనము, పరిశీలనము అను నీ రెండింటిలో దేనివలన అది నేర్చుకొనుచున్నది? మొత్తముమీద ఈ నేర్చుకొను క్రమములో చలనాత్మక క్రియకున్న జ్ఞానేంద్రియముల ద్వారమున చేయు పరిశీలనమే ఎక్కువగా ఉపకరించు చున్నది. పరిశీలన మునకు చలనముకూడ అవసరమనుట నిర్వివాదము. అట్టియెడ చలనము కలిగించుటకం టె చలనము యొక్క ఫలితమును పరిశీలించుటయే నిర్లా యక మైన అంశము. ఈ ప్రయోగములో పెట్టె, వల, మొదలగు ఏ విధమైన వస్తువులను ఉపయోగించినను, జంతువు ఎదురుగా కనిపించు వస్తువుల త త్త్వమును తెలిసి కొనును. ఈ స్థితియందు జంతువునకు ప్రయోగమునందలి వస్తువుల యొక్క త త్త్వమును తెలిసికొనుట యందుకంటె వాటినుండి తప్పించుకొనుటయందే తాత్పర్యముండును. కోతులును, ఈ పరిస్థితులలో జంతువులకు అంతర్దృష్టి ఉన్నదా, అను ప్రశ్న ఉదయించును. కారణమేమన, పిల్లులకంటెను కుక్కలకంటెను ఎక్కువ తెలివిగలిగిన చింపంజీలును (ఒకజాతి కోతులు) బాగా క్లిష్టమైన యుక్తులు నేర్చుకొనుట కలదు. ఈ స్థితిలో అంతర్దృష్టి యనగా ముందుచూపు వెనుకచూపునై యున్నది - అని అనుభవమువలన తెలియుచున్నది. మరియును, అంతర్దృష్టి